E-Paper
Advertisement

Bandla Ganesh: చంద్రబాబు, రేవంత్, పవన్.. బండ్లకు ఎవరి పేరు వింటే ఊపొస్తుందో తెలుసా?

Bandla Ganesh: చంద్రబాబు, రేవంత్, పవన్.. బండ్లకు ఎవరి పేరు వింటే ఊపొస్తుందో తెలుసా?
Advertisement

Bandla Ganesh: శివాజీ, లయ జంటగా నటించిన సినిమా ‘సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని’ (Sampraadayini Suppini Suddhapusani). ‘లిటిల్ హార్ట్స్’, ‘రాజు వెడ్స్ రాంబాయి’ లాంటి విజయాల తర్వాత ఈటీవీ విన్‌తో కలిసి ప్రముఖ నిర్మాతలు బన్నీ వాస్, వంశీ నందిపాటి విడుదల చేస్తున్న సినిమా ఇది. తాజాగా విడుదలైన ట్రైలర్ సినిమాపై అంచనాలు భారీగా పెంచేసింది. క్రైమ్-కామెడీ ఫ్యామిలీ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ‘సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని’ సినిమాను ముందు ఓటీటీలో స్ట్రీమింగ్ చేయాలని అనుకున్నారు. కానీ, ఈ సినిమా చూసిన వారంతా థియేటర్లలో అయితే బాగుంటుందని చెప్పడంతో మేకర్స్ నిర్ణయం మార్చుకుని, ఇప్పుడు థియేటర్లలో విడుదల చేయబోతున్నారు. ఈటీవీ విన్‌ అసోసియేషన్‌తో శ్రీ శివాజీ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రిక్కి సమర్పణలో హీరో శివాజీ (Sivaji) స్వయంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. సుధీర్ శ్రీరామ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం మార్చి 6న థియేటర్లలోకి రాబోతోంది. ఈ క్రమంలో మేకర్స్ ప్రీ రిలీజ్ వేడుకను మంగళవారం గ్రాండ్‌గా నిర్వహించారు.

Also Read- Mega158: పూనకాలు లోడింగ్ 2.O.. చిరుబాబీ ప్రాజెక్ట్ ఎక్స్‌క్లూజివ్ అప్డేట్!

ఎవరి పేరు వింటే ఊపొస్తది?

Advertisement

ఈ కార్యక్రమానికి బ్రహ్మానందం ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అలాగే ఈ మధ్య సంకల్ప యాత్ర అంటూ ఏపీ సీఎం చంద్రబాబు (AP CM Chandrababu) కోసం షాద్ నగర్ నుంచి తిరుమలకు కాలినడకన వెళ్లి మొక్కు తీర్చుకున్న అనంతరం, ఫస్ట్ టైమ్ బ్లాక్ బస్టర్ నిర్మాత బండ్ల గణేష్ (Bandla Ganesh) కూడా ఈ వేడుకకు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో సరదాగా అలీ అందరినీ కొన్ని ప్రశ్నలు అడిగారు. అందులో భాగంగా బండ్ల గణేష్‌ను కూడా ఆయన ఓ ప్రశ్న అడిగారు. ‘నీకు ఎవరి పేరు రాగానే, నీ బాడీలో ఊపు వస్తుంది?’ అని అలీ (Ali) ఈ కార్యక్రమంలో గణేష్‌ని అడిగారు. దానికి బండ్ల గణేష్ ఇచ్చిన ఆన్సర్ ప్రస్తుతం వైరల్ అవుతోంది. బండ్ల గణేష్ అనగానే గుర్తొచ్చే పేరు ఏమిటో అందరికీ తెలిసిందే. అదే పేరు బండ్ల గణేష్ ఆన్సర్‌గా చెప్పి, మరోసారి తన దేవుడిని గుర్తు చేసుకున్నాడు.

Also Read- Repu Udayam 10 Gantalku: ‘రేపు ఉదయం 10 గంటలకు’.. ఏంటి? అసలు విషయమేంటి?

ది వన్ అండ్ ఓన్లీ, బాస్!

Advertisement

చంద్రబాబు గారా? పవన్ కళ్యాణ్ గారా? రేవంత్ రెడ్డి గారా? ఎవరి పేరు రాగానే నీ బాడీలో ఊపొస్తుంది? అని బండ్ల గణేష్‌ని అలీ అడిగారు. అందుకు బండ్ల గణేష్ నవ్వుతూ.. ‘కాదన్నా.. నువ్వు ఈ ప్రశ్న నన్ను అడగకూడదన్నా.. నాకు ఎవరి పేరు చెబితే ఊపు వస్తుందో నీకు తెలుసు కదా అన్నా. నాకు ఈ పేరు ఎవరివల్ల వచ్చింది? బండ్ల గణేష్ అనే పేరు ఎవరివల్ల వచ్చింది’’ అని బండ్ల గణేష్ అనగానే.. ‘చెప్పు పేరు చెప్పు’ అని అలీ మరోసారి అడిగారు. వెంటనే బండ్ల గణేష్ అందుకుని ‘‘ఇంకెవరన్నా.. ది వన్ అండ్ ఓన్లీ, బాస్.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Power Star Pawan Kalyan). ఊపు ఎందుకురాదన్నా.. ఎందుకురాదు.. మనం ఈ అనుభవిస్తున్నదంతా ఆయన వల్లే కాబట్టి ఎప్పుడు ఊపొస్తది’’ అని చెబుతుంటే, వెనుక ఆడియెన్స్‌లో సౌండ్ దద్దరిల్లిపోయింది. మరో అలీ కూడా ఒకప్పుడు పవన్ కళ్యాణ్‌కు స్నేహితుడే. చాలా బాగా ఉండేవారు. మధ్యలో పాలిటిక్స్ వారిద్దరినీ దూరం చేశాయనే విషయం తెలియంది కాదు.

Also Read- Allu Sirish Nainika wedding: అల్లు శిరీష్ ప్రీ వెడ్డింగ్ .. కనిపించని ముగ్గురు స్టార్స్… ఏం జరిగిందబ్బా?

Related News

ఉత్తమ బాలల చిత్రంగా నేషనల్ అవార్డు అందుకున్న తొలి తెలుగు చిత్రం ఏంటో తెలుసా?

నేషనల్ అవార్డ్స్ రేసులో ధనుష్ రికార్డ్… ‘కలాం’ బయోపిక్‌పై హైప్!

ఆ హీరోతో అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్?

Sharmiela mandre :చడీ చప్పుడు లేకుండా పెళ్లి చేసుకున్న అల్లరి నరేష్ హీరోయిన్.. వరుడు ఎవరంటే?

38ఏళ్ల తర్వాత తండ్రి నాగబాబు రికార్డును రిపీట్ చేసిన నిహారిక!

సైలెంట్ గా నిశ్చితార్థం.. పెళ్లికి సిద్ధమైన టాలీవుడ్ హీరో!

కళ్ళు లేవు.. మైమరిపించే గాత్రానికి నేషనల్ అవార్డు.. ఎవరీ సింగర్?

విజువల్ వండర్ గా రామాయణ ట్రైలర్.. అఫీషియల్ ఎప్పుడంటే?

Big Stories

Advertisement
×