E-Paper
Advertisement

Actor Shivaji: AMB మాల్‌లో పాప్‌కార్న్‌ రేట్‌ ఎక్కువ.. ఇండస్ట్రీ ఏం పత్తిత్తు కాదు.. శివాజీ షాకింగ్‌ కామెంట్స్‌

Actor Shivaji: AMB మాల్‌లో పాప్‌కార్న్‌ రేట్‌ ఎక్కువ.. ఇండస్ట్రీ ఏం పత్తిత్తు కాదు.. శివాజీ షాకింగ్‌ కామెంట్స్‌
Advertisement

Actor Sivaji Comments on AMB Mall: నటుడు, బిగ్‌ బాస్‌ ఫేం శివాజీ ఇటీవల సినిమా టికెట్ల రేట్స్‌, పాప్ కార్న్‌పై చేసిన కామెంట్స్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. ఇక్కడ అన్నిటికంటే చీప్‌ సినిమానే అని, ఇక పాప్‌ కార్న్‌ రేట్‌ ఎక్కువ అంటే తానేమి చేయాలేను అన్నారు. మూడు గంటల సినిమా కేవలం మూడు నాలుగు వందల్లోనే దొరుకుంది. సైలెంట్ గా సినిమా చూసి రాకుండ ఈ పాప్ కార్న్ గోల ఏంటండి అన్నారు. తన లేటెస్ట్‌ మూవీ దండోరా టీజర్ లాంచ్‌లో శివాజీ ఈ చేసిన ఈ కామెంట్స్‌పై నెటిజన్స్‌ మండిపడుతున్నారు. అయితే తాజాగా మరోసారి తన కామెంట్స్‌పై శివాజీ స్పందించారు.

ఐబొమ్మ రవిది గొప్ప టాలెంట్

ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మరోసారి ఐబొమ్మ రవి అరెస్టు, సినిమా టికెట్స్, పాప్‌ కార్న్‌ రేట్స్‌ వివాదంపై మాట్లాడారు. ముఖ్యంగా ఐబొమ్మ రవికి జనాల్లో వస్తున్న మద్దుతును ఉద్దేశిస్తూ కామెంట్స్‌ చేశారు. ‘ఐబొమ్మ రవి మంచి టాలెంటెడ్‌. ఆయన ప్రతిభను 200ల శాతం అభినందిస్తా. కానీ, దేశ చట్టాలకు వ్యతిరేకంగా ఎవరూ ప్రవర్తించిన శిక్ష పడాల్సిందే. అది ఎవరైనా, సినిమా హీరోలైన, ఐబొమ్మ రవి అయినా, రాజకీయ నాయకులైన. చట్టం ముందు అందరు సమానమే. ఇది వ్యక్తిగతంగా ఎవరి మీద ద్వేషం కాదు. ఒక చట్టపరమైన అంశం. ఈ దేశస్తుడు కాదు కాబట్టి శిక్షించలేరు అనడం సరైన ఆలోచన కాదు. అతడు చేసిందే నేరం కాదని అనుకుంటే చిన్నపాటి నేరాలు చేసే దొంగల్ని కూడా వదిలేయాలా?” అని శివాజీ ప్రశ్నించారు.

బస్సు రేట్స్ పై మాట్లాడరేందుకు?

Advertisement

ఆ తర్వాత సినిమా టికెట్స్‌, పాప్‌ కార్న్‌ రేట్స్‌ ప్రజలల్లో ఉన్న వ్యతిరేకత ఉద్దేశించి కూడా మాట్లాడారు. “సినిమా టికెట్స్‌ భారీగా పెంచి డబ్బులు దండుకుని సినీ పరిశ్రమలోని వారంత లగ్జరీ బతుకుతున్నారని అనుకుంటే అది పొరపాటే. ఎందుకంటే ఇండస్ట్రీలోని వ్యక్తులందరి లైఫ్‌ లగ్జరీగా ఉండదు. 95 శాతం మంది సాధారణ జీవితమే గడుపుతున్నారు. ఒక హీరో, ఒక దర్శకుడు, ఒక నిర్మాత లగ్జరీలో ఉంటారని చెప్పి మొత్తం ఇండస్ట్రీని దోషిగా చూపించడం సరైనది కాదు” అని పేర్కొన్నారు. అలాగే సంక్రాంతి సమయంలో బస్సు రేట్స్‌ మూడు రెట్లు పెరిగినా ఎవరూ మాట్లాడరు. కానీ సినిమా టిక్కెట్ వంద పెంచితే మాత్రం ఇండస్ట్రీనే విలన్‌గా చూస్తున్నారు.

Also Read: Actor Dharmendra: బాలీవుడ్‌ లెజెండరీ నటుడు ధర్మేంద్ర కన్నుమూత

ఇండస్ట్రీ ఏం పత్తిత్తు కాదు

Advertisement

కంటెంట్ బాగుంటే చిన్న సినిమాలని కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. అవి కూడా మంచి కలెక్షన్స్‌ చేస్తున్నాయి. కానీ, పెద్ద సినిమాల వల్ల చిన్న సినిమాలు ఇబ్బందులు ఎదుర్కొంటుంది. సినీ ఇండస్ట్రీ ఏం పత్తిత్తు కాదు. ఎవరు తప్పు చేశారో వాళ్ల గురించి మాట్లాడండి. అంతే తప్ప అందరిని విలన్లుగా చూడటం కరెక్ట్ కాదు. కొందరు హీరోలు,నిర్మాతలకు కూడా మాల్స్‌ ఉన్నాయి. వాటిలో సినిమా టికెట్స్‌ రేట్లు, పాప్‌ కార్న్‌ రేట్స్‌ భారీగా ఉన్నాయి. ఏఎంబీ మాల్‌లో రేట్లు మరీ దారుణంగా ఉన్నాయి. కానీ దానికి సినిమాకి ఏంటి సంబంధం. రేట్లు తగ్గించమని వాళ్లని అడిగితే మా బిజినెస్‌తో మీకు సంబంధం ఏంటి? అని అంటున్నారు” అని శివాజీ చెప్పుకొచ్చారు.

Related News

భాయ్ చిక్కిపోయాడని ఏడ్చేసిన ఫ్యాన్స్.. రివర్స్ సెటైర్ వేసిన సల్మాన్ !

రికార్డుల వేటలో ‘ది ఒడిస్సీ’..మన మేకర్స్ ఇప్పటికైనా మారతారా?

విదేశాల్లో షాట్లు.. ఏపీలో ఓట్లు! టాలీవుడ్ స్టార్స్‌పై అంబికా కృష్ణ మార్కు కౌంటర్లు!

‘టాక్సిక్’ దెబ్బకి ప్లాన్స్ ఛేంజ్? రవితేజ ‘ఇరుముడి’ రిలీజ్ డేట్‌పై లేటెస్ట్ అప్‌డేట్!

మగాళ్ల హత్యల పై షాకింగ్ కామెంట్స్.. కొడుకు కోసం ఆందోళన పడుతున్న కాజల్..

నేను దేశ ద్రోహిని కాదు.. బీజేపీ తీరుపై నటుడు నరేష్ ఫైర్..

హిట్ కొట్టిన రోజా,నాగదుర్గ.. పాపం ఐశ్వర్య, లయ!

నేషనల్ అవార్డు విన్నింగ్ పై మెగాస్టార్ ట్వీట్.. నిహారిక క్రేజీ కామెంట్స్!

Big Stories

Advertisement
×