E-Paper
Advertisement

Actor Dharmendra: బాలీవుడ్‌ లెజెండరీ నటుడు ధర్మేంద్ర కన్నుమూత

Actor Dharmendra: బాలీవుడ్‌ లెజెండరీ నటుడు ధర్మేంద్ర కన్నుమూత
Advertisement

Dharmendra Passed Away: సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. బాలీవుడ్‌ లెజెండరీ నటుడు ధర్మేంద్ర కన్నుమూశారు. కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆరోగ్యం విషమించడంతో సోమవారం (నవంబర్‌ 24) తుదిశ్వాస విడిచారు. ఆయన మృతితో బాలీవుడ్‌ సినీ పరిశ్రమలో విషాద ఛాయలు నెలకొన్నాయి. దీంతో బాలీవుడు సినీ ప్రముఖులంత ఆయన ఇంటికి తరలివస్తున్నారు. అమితాబ్‌ బచ్చన్‌, ఆమిర్‌ ఖాన్‌ లాంటి అగ్ర నటులంత కాసేపటి క్రితం ఆయన భౌతికకాయాన్ని సందర్శించారు.

క్షీణించిన ఆరోగ్యం

మరోవైపు బాలీవుడ్‌కి సినీ ప్రముఖులు నటీనటులంత ఒక్కొక్కరుగా ఆయన ఇంటికి తరలివస్తున్నారు. కాగా గత కొన్ని రోజులుగా వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆయన ఆరోగ్యం క్షీణించడంతో ఆస్పత్రికి తరలించారు. ముంబైలోని బ్రీచ్ కాండీ ఆసుపత్రిలో చేర్చారు. దీంతో వైద్యులు ఆయనను ఐసీయూలో వెంటిలెటర్‌పై పెట్టి చికిత్స అందించారు. విషమ పరిస్థితుల్లో చికిత్స పొందుతున్న ఆయన మరణించినట్టు మొదట వార్తలు వచ్చాయి. దీంతో కుటుంబ సభ్యులు ఈ వార్తలను కొట్టిపారేశారు. ఆయన ఆరోగ్యం విషమంగా ఉన్నప్పటికీ చికిత్స స్పందిస్తున్నట్టు వివరణ ఇచ్చారు.

బాలీవుడ్ నివాళి

Advertisement

అదే రోజు ధరేంద్ర తమ ఇంటి వద్దే ఉంచి వైద్య సేవలు అందిస్తున్నారు. ఈ క్రమంలో ఇవాళ (నవంబర్‌ 24) ఆయన ఆరోగ్యం క్షీణించడంతో మరణించారు. దీంతో కుటుంబ సభ్యులు అత్యంత గొప్యంగా ఆయన అంత్యక్రియలను నిర్వహించారు. ముంబైలోని ప‌వ‌న్ హ‌న్స్ శ్మ‌శాన‌వాటిక‌లో ధ‌ర్మేంద్ర అంత్యక్రియ‌లు కాసేపటికి క్రితమే ముగిశాయి. ఆయన కుమారుడు సన్నీ డియోల్ ధర్మేంద్ర అంత్యక్రియలు నిర్వహించారు. బాలీవుడ్‌ స్టార్‌ హీరోలు అమితాబ్‌ బచ్చన్‌, అమిర్‌ ఖాన్‌ వంటి తదితర నటీనటులు అంత్యక్రియల్లో పాల్గొన్నారు. ఆయన మరణవార్తతో బాలీవుడ్ సినీ ప్రముఖులు, అభిమానులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ సోషల్ మీడియాలో వేదికగా అంతిమ నివాళులు అర్పిస్తున్నారు.

Also Read: Director Maruthi: కాలర్‌ ఎగిరేయడంపై సెటైర్లు.. ఎన్టీఆర్‌ ఫ్యాన్స్‌కి క్షమాపణలు చెప్పిన మారుతి

డిసెంబర్ 8తో ధర్మేంద్రకు 90 ఏళ్లు

Advertisement

మరోవైపు ధర్మేంద్ర నివాసం వద్ద పోలీసులు భద్రత కట్టుదిట్టం చేశారు. అంబులెన్స్‌లు ఆయన ఇంటికి చేరడంతో అక్కడ ఆందోళన పరిస్థితులు నెలకొన్నాయి. దశాబ్దాలుగా బాలీవుడ్‌లో స్టార్‌ హీరోగా రాణించిన ధర్మేంద్ర తన చివరి రోజుల వరకు సినిమా కోసం క్రషి చేశారు. రీసెంట్‌గా ఆయన ఇక్కీస్‌ చిత్రంలో నటించారు. ఇదే ఆయన చివరి మూవీ. ఇందులో అమితాబ్‌ బచ్చన్‌ మనవడు అగస్త్య నందకు తండ్రిగా కనిపించారట. క్రిస్మస్‌ కానుకగా డిసెంబర్‌ 25న ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుంది. అంతలోనే ఆయన మరణించడంతో కుటుంబ సభ్యులు, ఇండస్ట్రీ ప్రముఖులు జీర్ణించుకోలేకపోతున్నారు. మరోవైపు డిసెంబర్ 8న ఆయన 90వ పుట్టిన రోజును వేడుకగా జరిపించేందుకు కుటుంబ సభ్యులు సిద్దమవుతున్నారు.

‘హీ-మ్యాన్ ఆఫ్ బాలీవుడ్’

ఇంట్లో వైద్య సేవలతో కోలుకుంటున్న ఆయన పుట్టిన రోజు జరిపించాలని కుటుంబ సభ్యులు గ్రాండ్‌ ఏర్పాట్లకుప్లాన్‌ చేసినట్టు తెలుస్తోంది. 1958లో దిల్ బీ తేరా హ‌మ్ బీ తేరే చిత్రంతో తెరంగేట్రం చేసిన ధర్మేంద్ర, తన కెరీర్‌లో ‘షోలే’, ‘చుప్కే చుప్కే’, ‘ధర్మ్ వీర్’, ‘సీటా ఔర్ గీత’, ‘యాదోం కి బారాత్’ వంటి ఎన్నో హిట్‌ చిత్రాల్లో నటించిన ఎంతో అభిమాన ఘనాన్ని సంపాదించుకున్నారు. ముఖ్యంగా ఆయన నటించని షోలే మూవీలోని ఆయన పాత్ర ప్రేక్షకుల గుండెల్లో స్థిరస్థాయిగా నిలిచిపోతుంది. స్క్రీన్‌పై తన పవర్‌ఫుల్ డైలాగ్ డెలివరీ, మాస్ అప్పీల్, అద్భుతమైన స్టైల్‌తో తనదైన గుర్తింపు పొందారు. ఆయన అద్భుతమైన నటనకు గానూ ‘హీ-మ్యాన్ ఆఫ్ బాలీవుడ్’ అనే బిరుదును కూడా పొందారు.

Related News

‘టాక్సిక్’ దెబ్బకి ప్లాన్స్ ఛేంజ్? రవితేజ ‘ఇరుముడి’ రిలీజ్ డేట్‌పై లేటెస్ట్ అప్‌డేట్!

హైదరాబాద్‌లో ‘వైఫ్ ఎక్స్ఛేంజ్’ కల్చర్ ఉందంటూ హీరోయిన్ మాధవీలత సంచలన వ్యాఖ్యలు!

మగాళ్ల హత్యల పై షాకింగ్ కామెంట్స్.. కొడుకు కోసం ఆందోళన పడుతున్న కాజల్..

నేను దేశ ద్రోహిని కాదు.. బీజేపీ తీరుపై నటుడు నరేష్ ఫైర్..

హిట్ కొట్టిన రోజా,నాగదుర్గ.. పాపం ఐశ్వర్య, లయ!

నేషనల్ అవార్డు విన్నింగ్ పై మెగాస్టార్ ట్వీట్.. నిహారిక క్రేజీ కామెంట్స్!

కన్నీటి పర్యంతమవుతున్న ‘మహారాజ’ బ్యూటీ.. అసలేం జరిగిందంటే?

డ్యాన్స్ మాస్టర్స్ అసోసియేషన్ వివాదం..ఫిలిం ఫెడరేషన్ అత్యవసర సమావేశం!

Big Stories

Advertisement
×