E-Paper
Advertisement

Subbaraju: దయచేసి అలా పెళ్లి చేసుకోవద్దు..పెళ్ళి పై  నటుడు సుబ్బరాజు కామెంట్స్!

Subbaraju: దయచేసి అలా పెళ్లి చేసుకోవద్దు..పెళ్ళి పై  నటుడు సుబ్బరాజు కామెంట్స్!
Advertisement

Subbaraju: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో నటుడిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో సుబ్బరాజు(Subbaraju) ఒకరు. ఈయన విలన్ పాత్రలలోనూ కమెడియన్ గా హీరో ఫ్రెండ్ పాత్రలలో కూడా నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు.ఇలా వరుస సినిమాలలో నటిస్తున్న సుబ్బరాజు నాలుగు పదుల వయసులో పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఇలా ఇటీవల పెళ్లి చేసుకున్న ఈయన ఒక ఇంటర్వ్యూ సందర్భంగా పెళ్లి గురించి మాట్లాడుతూ చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. పెళ్లి విషయంలో తన ఆలోచన ధోరణిని ఈయన బయట పెట్టడంతో ఈ కామెంట్స్ కాస్త సంచలనగా మారాయి.

పెళ్లి అనేది బాధ్యత..

ప్రతి ఒక్కరి జీవితంలో పెళ్లి అనేది అవసరమని అయితే పెళ్లి ఒకరు ఒత్తిడి చేస్తున్నారని లేదా వయసు పై పడుతుందని చేసుకోకూడదని తెలిపారు. కుటుంబ సభ్యులు బలవంత పెట్టడం లేదా ఇతరులు చేసుకుంటున్నారు కదా అని మనం ఎప్పుడు పెళ్లి చేసుకోకూడదని తెలిపారు. ఇలా చేసుకున్న పెళ్లిళ్లు నిజమైనవి కాదని తన ఉద్దేశం, తన అభిప్రాయాన్ని తెలిపారు. పెళ్లి అనేది ఒక బాధ్యత, అవగాహన అని తెలిపారు. ఒక వ్యక్తి వివాహం చేసుకోవడానికి ఎంచుకున్న స్త్రీకి ఏదైనా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నప్పుడే పెళ్లి చేసుకోవాలని తెలిపారు.

47 ఏళ్లలో పెళ్లి..

Advertisement

ఇలా పెళ్లి అంటే ఒక బాధ్యతతో కూడుకున్న అంశం అంటూ సుబ్బరాజు పెళ్లి గురించి తన అభిప్రాయాలను తెలియచేయడంతో నేటిజన్ లు ఈ వ్యాఖ్యలపై స్పందిస్తూ ఈయనపై ప్రశంసలు కురిపిస్తున్నారు. పెళ్లి విషయంలో సుబ్బరాజు చాలా స్పష్టంగా ఉన్నారంటూ కామెంట్లు చేస్తున్నారు. పెళ్లి విషయంలో ప్రతి ఒక్కరూ ఇలాంటి స్పష్టత కలిగి ఉంటే విడాకులు తీసుకొని విడిపోయేవారు కూడా ఉండరు అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇక సుబ్బరాజు కూడా చాలా ఆలస్యంగా పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. ఈయన 47 సంవత్సరాల వయసులో పెళ్లి చేసుకుని పెళ్లికి సంబంధించిన ఫోటోలను షేర్ చేస్తూ అందరికీ షాక్ ఇచ్చారు. 2024లో సుబ్బరాజు స్రవంతి అనే అమ్మాయితో ఏడడుగులు నడిచారు. ఇలా వీరి పెళ్లికి సంబంధించిన ఫోటోని సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ పెళ్లయిపోయింది అంటూ తన పెళ్లి విషయాన్ని షేర్ చేశారు.

వందకు పైగా సినిమాలు..

Advertisement

ఇలా గత ఏడాది వివాహం చేసుకున్న ఈయన పెళ్లి గురించి ఇలాంటి వ్యాఖ్యలు చేయడంతో ఇది కాస్త సంచలనంగా మారాయి. ఇక సుబ్బరాజు కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కిన ఖడ్గం సినిమా ద్వారా నటుడుగా ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు సంపాదించుకున్న సుబ్బరాజు అనంతరం ఆర్య, పోకిరి, మిర్చి, గీత గోవిందం, బాహుబలి 2 వంటి ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో నటించారు. ఇలా తెలుగు సినిమాలలో సపోర్టింగ్ పాత్రలో మాత్రమే కాకుండా విలన్ పాత్రలలో కూడా నటించారు సుమారు వందకు పైగా తెలుగు సినిమాలలో సుబ్బరాజు నటించి ప్రేక్షకులను సందడి చేశారు.

Also Read: Nick Jonas: వారణాసి సినిమాపై నిక్ జోనాస్ కామెంట్స్.. ఇది కదా రాజమౌళి క్రేజ్!

Related News

ఇరుముడి సీక్వెల్ సినిమాలో రామ్ చరణ్.. ఫాన్స్ కు పూనకాలే!

పవన్‌ కల్యాణ్‌ ఆస్తుల లెక్క ఇదిగో.. కళ్లు తిరిగే నంబర్లు!

లక్కీ భాస్కర్ 2… వెంకీ అట్లూరి బిగ్ అప్డేట్!

పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. ‘ఓజీ యూనివర్స్’ నుంచి స్పెషల్ ట్రీట్!

రూ.200 కోట్ల క్లబ్ లోకి ఇరుముడి.. అయ్యప్పగా మణెమ్మ!

టాక్సిక్ vs ఇరుముడి.. భారీ బడ్జెట్ సినిమాలకు ఇదో గుణపాఠమా?

సాహో ప్రపంచంలోకి ఓజీ..? ఏం ప్లాన్ చేస్తున్నావ్ సుజిత్ ?

మీరే నాకు స్ఫూర్తి… బాబాయ్ కు అబ్బాయ్ విషెస్!

Big Stories

Advertisement
×