Best Camera Phones Under Rs 20,000: ఒకప్పుడు హై క్వాలిటీ ఫొటో కావాలంటే ఖరీదైన DSLR తప్ప మరో దారి లేదు. పైగా వాటి ధరలు వేలల్లో కాదు.. లక్షల్లో ఉండేవి. కానీ, 2026కి వచ్చేసరికి పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఇప్పుడు జేబులో ఉండే స్మార్ట్‌ఫోన్‌నే ఒక పవర్‌ఫుల్ కెమెరాగా మార్చేసింది టెక్నాలజీ. ముఖ్యంగా రూ.20వేల లోపు బడ్జెట్ ఫోన్లలోనే DSLR క్వాలిటీ ఫొటోలు తీసే కెమెరాలు అందుబాటులోకి వచ్చాయి. ఇకపోతే ఫొటోగ్రఫీ అంటే ప్రాణం పెట్టేవాళ్లకు ఇది నిజంగా గోల్డెన్ టైమ్. ఈ నేపథ్యంలో ఈ ఏడాది మార్కెట్లో ఉన్న బెస్ట్ కెమెరా స్మార్ట్‌ఫోన్లు ఏవో ఓసారి చూసేద్దాం..
ఒప్పో నుంచి వస్తున్న K13x 5G ఫోన్ కేవలం రూ.15,999 ధరలోనే అద్భుతమైన ఫీచర్లను కలిగి ఉంటుంది. దీనిలో 50MP మెయిన్ కెమెరాతో పాటు 8MP సెల్ఫీ కెమెరా ఉంటుంది. దీని 6.67 అంగుళాల 120Hz డిస్‌ప్లే వీడియోలు చూసేటప్పుడు మంచి అనుభూతిని అందిస్తుంది. దీనిలో 6000mAh బ్యాటరీ ఉండటం వలన రోజంతా ఛార్జింగ్ టెన్షన్ లేకుండా వాడుకోవచ్చు.
ఇక వివో T4X మోడల్ రూ.15,499కే అందుబాటులో ఉంది. దీనిలోని 50MP డ్యూయల్ కెమెరా సెటప్ ఎంతో స్పష్టంగా ఉండే ఫొటోలను క్లిక్ చేస్తుంది. ముఖ్యంగా 6500mAh బ్యాటరీ ఉండటంతో ఎక్కువ సేపు ఫొటో షూట్‌లు చేసుకునే వారికి ఇది బెస్ట్ ఛాయిస్.
Also Read: ఒక్కసారి ఛార్జ్ చేస్తే వారం రోజులు వాడొచ్చు.. 8,500mAh బ్యాటరీతో వస్తోన్న షియోమీ 17T ప్రో!
మీకు సెల్ఫీలు తీసుకోవడం ఇష్టమైతే, మోటోరోలా G67 Power మీ కోసమే. దీనిలో ఏకంగా 32MP హై రిజల్యూషన్ ఫ్రంట్ కెమెరా ఉంది. రూ.15,999 ధరలో లభించే ఈ ఫోన్.. 7000mAh భారీ బ్యాటరీతో వస్తోంది. ఈ ఫోన్‌ను ఒక్కసారి ఛార్జ్ చేస్తే రెండు రోజుల వరకు నిరంతరాయంగా పని చేస్తుంది.
ప్రముఖ నథింగ్ సబ్ బ్రాండ్ నుంచి వచ్చిన CMF ఫోన్ 2 ప్రో ఫొటోగ్రఫీ ప్రేమికులకు వరమనే చెప్పాలి. రూ.17,999 ధరలో టెలిఫొటో లెన్స్‌తో వస్తున్న అరుదైన ఫోన్ ఇది. దీనిలో 50MP వైడ్, 50MP టెలిఫొటో కెమెరాలు ఉండటం వల్ల ఎంత దూరం నుంచి తీసినా ఫొటోలు చాలా క్వాలిటీగా వస్తాయి.
నమ్మకమైన బ్రాండ్ కావాలనుకునే వారికి శాంసంగ్ గెలాక్సీ A17 5G బెటర్ ఆప్షన్. రూ.18,999 ధరలో లభించే ఈ స్మార్ట్‌ఫోన్ Super AMOLED డిస్‌ప్లేతో వస్తుంది. దీని 50MP మెయిన్ కెమెరా సహజమైన రంగులతో కూడిన ఫొటోలను క్యాప్చర్ చేస్తుంది.
Also Read: తక్కువ ధరలో థియేటర్ అనుభవం కావాలా? ఈ ఏడాది మార్కెట్‌ను షేక్ చేస్తున్న బెస్ట్ టీవీలివే!