BigTV English

Donlee: ఓర్నీ.. స్పిరిట్ విలన్ తో నువ్వేం చేస్తున్నావ్ తరుణ్ బ్రో..

Donlee: ఓర్నీ.. స్పిరిట్ విలన్ తో నువ్వేం చేస్తున్నావ్ తరుణ్ బ్రో..

Donlee: పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. తెలుగు ప్రేక్షకులు మాత్రమే కాకుండా ఇండస్ట్రీ మొత్తం ఎదురుచూస్తున్న సినిమాలో ఒకటి స్పిరిట్. అర్జున్ రెడ్డి సినిమాతో తెలుగు ఇండస్ట్రీని షేక్ చేసిన సందీప్ రెడ్డి వంగా బాలీవుడ్ కి వెళ్లి యానిమల్ సినిమాతో మరోసారి ఇండస్ట్రీని షేక్ చేశాడు. ఇక ఇప్పుడు స్పిరిట్ సినిమాతో ప్రపంచాన్ని షేక్ చేయడానికి రెడీ అయ్యాడు. ప్రభాస్ హీరోగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా స్పిరిట్. ఎప్పుడెప్పుడు ఈ సినిమా సెట్స్ మీదకు వెళుతుందా అని అభిమానులు వేయికళ్లతో ఎదురుచూస్తున్న విషయం తెలిసిందే. ఆగస్టులో ఈ సినిమా సెక్స్ పైకి వెళ్ళనుందని సందీప్ రెడ్డి వంగా అధికారికంగా ప్రకటించాడు. ఇక ఇప్పుడు స్పిరిట్ కు సంబంధించిన క్యాస్టింగ్ పనుల్లో వంగా బిజీగా ఉన్నాడు.


 

ఇక  ఈ సినిమాలో ప్రభాస్ సరసన యానిమల్ బ్యూటీ త్రిప్తి దిమ్రి హీరోయిన్ గా సెలెక్ట్  అయ్యింది. ఇక త్రిప్తి కన్నా ముందు దీపికా పదుకొనేను హీరోయిన్ గా అనుకున్నారు. అయితే ఆమె పెట్టిన కండిషన్స్ వంగాకు నచ్చక ఆమెను రిజెక్ట్ చేసిన విషయం అందరికీ తెలిసిందే. ఇక దీంతో దీపికా స్పిరిట్ కథను లీక్ చేసిందని, వంగా ఫైర్ అయ్యాడు. అలా వీరిద్దరి మధ్య గొడవ తారాస్థాయికి చేరుకుంది. ఇప్పుడిపుడే ఈ వివాదం సద్దుమణుగుతుంది. ఇక ఇదంతాపక్కన పెడితే.. స్పిరిట్ లో కొరియన్ నటుడు  డాన్ లీ విలన్ గా నటిస్తున్నాడు అని ఎప్పటి నుంచో వార్తలు వినిపిస్తున్న విషయం తెల్సిందే.


 

ఇక డాన్ లీ స్పిరిట్ లో ఉన్నాడని తెలియడంతో  ప్రభాస్- డాన్ లీ మధ్య వచ్చే సీన్స్ ను ఇప్పటినుంచే ఇమేజిన్ చేసుకుంటున్నారు. ఇక ప్రభాస్ ఫ్యాన్స్ అయితే డాన్ లీని సోషల్ మీడియాలో కూడా ఫాలో అవుతున్నారు. ఇక ఎప్పుడెప్పుడు డాన్ లీ ఇండియాలో అడుగుపెడతాడా అని ఎదురుచూస్తున్నవారికి షాక్ ఇచ్చాడు. డాన్ లీ ఇండియాలో అడుగుపెట్టాడు. సడెన్ గా ఒక హీరోతో దర్శనమిచ్చాడు. ఏంటి.. నిజమా అంటే నిజమే. అవును. తాజాగా డాన్ లీ.. హీరో తరుణ్ ను  కలిసాడు. అయితే వీరిద్దరూ కలిసి లాస్ వేగాస్ లో కలిసినట్లు తెలుస్తోంది . ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరల్ గా మారింది.

 

ఇక తరుణ్ ను డాన్ లీతో చూసిన అభిమానులు.. ఓర్నీ.. స్పిరిట్ విలన్ తో నువ్వేం చేస్తున్నావ్ తరుణ్ బ్రో అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ఇక ఈ ఒక్క ఫోటో ఎన్నో అనుమానాలకు దారితీసింది. తరుణ్ కూడా స్పిరిట్ లో ఒక పాత్ర చేస్తున్నాడని కొందరు చెప్పుకొస్తున్నారు. నిజంగా అది నిజం అయితే కనుక తరుణ్ రీఎంట్రీ బాగా సాలిడ్ గా ఉండబోతుందని చెప్పొచ్చు. ఎన్నో ఎలా క్రితమే తరుణ్ సినిమాలకు దూరమయ్యాడు. మధ్యమధ్యలో సినిమాలు చేసినా కూడా అంతగా క్లిక్ అవ్వలేదు. మరి స్పిరిట్ లో నటిస్తున్నాడు అనే తరుణ్ .. డాన్ లీని కలిశాడా ..  లేదా.. ? అనేది తెలియాల్సి ఉంది.

Related News

Actress Hema: ఆ క్షణం ఎవరినైనా చంపేయాలనిపించేది..ఎమోషనల్ అయిన హేమ!

Bahubali The Epic: బాహుబలి ది ఎపిక్.. బిగ్ సర్ప్రైజ్ ప్లాన్ చేసిన జక్కన్న?

OG 2: పవన్ ఫ్యాన్స్ కి కిక్ ఇచ్చే న్యూస్.. ఓజి 2లో అకీరా .. థియేటర్లు తగలబడి పోవాల్సిందే!

Salman Khan: సల్మాన్‌ ఖాన్‌ ఇంట సంబరాలు.. మరోసారి తండ్రైన ఆర్భాజ్ ఖాన్‌!

Samantha: ఫైనల్లీ కొత్త ప్రాజెక్ట్ పై అప్డేట్ ఇచ్చిన సమంత.. త్వరలోనే షూటింగ్ అంటూ!

Vijay Devarakonda: నిశ్చితార్థం తరువాత ఫేవరెట్ ప్లేస్ కి విజయ్ దేవరకొండ.. ప్రత్యేకం ఏంటబ్బా!

Rukmini Vasanth: క్రష్ ట్యాగ్ పై రుక్మిణి షాకింగ్ రియాక్షన్.. తాత్కాలికం అంటూ!

Rishabh shetty: ఆ ఘర్షణ నుంచే కాంతార కథ పుట్టింది.. అసలు విషయం చెప్పిన రిషబ్!

Big Stories

×