E-Paper
Advertisement

Vishwak Sen: నా అకౌంట్లో రూ. లక్ష చూడటమే కల.. ఆ క్షణం కన్నీళ్లాగలేదు..

Vishwak Sen: నా అకౌంట్లో రూ. లక్ష చూడటమే కల.. ఆ క్షణం కన్నీళ్లాగలేదు..
Advertisement

Vishwak Sen: టాలీవుడ్ ఇండస్ట్రీలో నటుడుగా కొనసాగుతూ ఎన్నో విభిన్నమైన సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తూ మంచి సక్సెస్ అందుకున్న వారిలో విశ్వక్ సేన్ (Vishwak Sen)ఒకరు. ఈ నగరానికి ఏమైంది హిట్, ఫలక్ నుమా దాస్ వంటి సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకున్నారు. అయితే ఇటీవల కాలంలో విశ్వక్ కథల ఎంపిక విషయంలో తడబాటు జరుగుతోందనే చెప్పాలి. ఇటీవల ఈయన వరుస సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తున్నప్పటికీ సరైన సక్సెస్ మాత్రం అందుకోలేకపోతున్నారు. ఇక ఈ ఏడాది వాలంటైన్స్ డే సందర్భంగా విశ్వక్ నటించిన ఫంకీ అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

సొంత ఇల్లు లేదు…

ఎన్నో అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా అనుకున్న స్థాయిలో పెద్దగా సక్సెస్ అందుకోలేకపోయింది. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా ఇటీవల ఒక ఇంటర్వ్యూకి హాజరైన విశ్వక్ తన కెరీర్ గురించి చిన్నప్పటినుంచి ఎదుర్కొన్న ఇబ్బందుల గురించి మాట్లాడుతూ కాస్త ఎమోషనల్ అయ్యారు. తాను పుట్టినప్పటికీ కూడా సొంత ఇల్లు లేదని తెలిపారు .అయితే నాన్న పిల్లలకు కరాటే నేర్పిస్తూ డబ్బు సంపాదించేవారు దానివల్ల పెద్దగా ఆదాయం లేకపోవడంతో కన్స్ట్రక్షన్ ఫీల్డ్ లోకి వచ్చారని తెలిపారు. ఇక నేను ఉన్నత చదువులు చదవడం కోసం డబ్బులు లేకపోవడంతోనే డిగ్రీలో చేరి డిగ్రీ చదివానని తెలిపారు.

అప్పటివరకు అంత డబ్బు చూడలేదు..

Advertisement

నేను ఇండస్ట్రీలోకి రాకముందు తన అకౌంట్లో ఒక లక్ష రూపాయలు ఉంటే చూద్దామని కలగనే వాడిని కానీ హిట్ సినిమా కమిట్ అయిన తర్వాత అడ్వాన్స్ కింద నాకు 50వేల రూపాయలు ఇచ్చారు. అది చూసి చాలా సంతోషపడ్డానని ఆ క్షణం కళ్ళల్లో నీళ్లు తిరిగాయి అంటూ ఈయన తెలియచేశారు. అప్పటివరకు నా అకౌంట్లో ఇంత మొత్తంలో డబ్బు ఎప్పుడూ చూడలేదని ఈయన తెలియ చేశారు. ఇలా ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటూ తన స్వశక్తితో ఇండస్ట్రీలోకి వచ్చానని విశ్వక్ తెలిపారు.

వ్యక్తిత్వాన్ని మార్చుకోలేను..

Advertisement

ఇక ఈ ఇంటర్వ్యూ సందర్భంగా ఈయన సోషల్ మీడియాలో తన గురించి వస్తున్నటువంటి విమర్శలపై కూడా స్పందించారు. నేను ఎప్పుడు ఒకే విధంగానే ఉంటాను సినిమాల కోసం నా వ్యక్తిత్వాన్ని నేను మార్చుకోలేనని ఈయన తెలిపారు. ఇలా పరిస్థితులకు అనుగుణంగా మనం ప్రవర్తించకపోతే సినిమా ఇండస్ట్రీలో లైఫ్ ఉండదని చాలామంది నాకు చెప్పారు కానీ మనిషి అన్న తర్వాత క్యారెక్టర్ ముఖ్యమని నేను నమ్ముతాను సినిమా సక్సెస్ అయితే ఆ సినిమాలో నటించిన హీరో ఎవరు ఏంటి అనే విషయాలు ప్రేక్షకులు చూడరు, ప్రేక్షకులకు హీరో ముఖ్యం కాదు కథ ముఖ్యం అంటూ ఈయన తన గురించి వచ్చే విమర్శలపై కూడా స్పందించారు.

Also Read: Yash: టాక్సిక్ కు పోటీగా ధురంధర్ 2.. యశ్ షాకింగ్ రియాక్షన్.. ఏమన్నారంటే?

Related News

‘విక్రమ్ 1’ ర్యాకెట్ ప్రయోగంలో జబర్దస్త్ సత్యశ్రీ చెల్లి కీలక పాత్ర.. ఆ ఫొటోలు షేర్ చేస్తూ నటి ఎమోషనల్!

నటిగా పీవీ సింధు.. ఆసక్తిని రేకెత్తిస్తున్న పోస్ట్!

చిన్న వయసులోనే గొప్ప మనసు చాటుకున్న సితార.. మహేష్ బాబు ఎమోషనల్ పోస్ట్!

టాలీవుడ్ లో నేషనల్ అవార్డు అందుకున్న తొలి చైల్డ్ ఆర్టిస్ట్ ఎవరంటే?

భాయ్ చిక్కిపోయాడని ఏడ్చేసిన ఫ్యాన్స్.. రివర్స్ సెటైర్ వేసిన సల్మాన్ !

రికార్డుల వేటలో ‘ది ఒడిస్సీ’..మన మేకర్స్ ఇప్పటికైనా మారతారా?

విదేశాల్లో షాట్లు.. ఏపీలో ఓట్లు! టాలీవుడ్ స్టార్స్‌పై అంబికా కృష్ణ మార్కు కౌంటర్లు!

‘టాక్సిక్’ దెబ్బకి ప్లాన్స్ ఛేంజ్? రవితేజ ‘ఇరుముడి’ రిలీజ్ డేట్‌పై లేటెస్ట్ అప్‌డేట్!

Big Stories

Advertisement
×