Yash: కే జి ఎఫ్ సినిమా తర్వాత కన్నడ నటుడు యష్ పేరు పాన్ ఇండియా స్థాయిలో మారుమోగుతుంది. ఈ సినిమా ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈయన తదుపరి సినిమాలన్నీ కూడా పాన్ ఇండియా స్థాయిలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సిద్ధమవుతున్నారు. యష్ త్వరలోనే టాక్సిక్ సినిమా (Toxic Movie)ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో తెరికెక్కిన ఈ సినిమా మార్చి 19వ తేదీ పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలోనే ప్రమోషన్ కార్యక్రమాలను కూడా మొదలు పెట్టబోతున్నారు.
ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదల చేసిన టీజర్ సినిమా పట్ల మంచి అంచనాలను పెంచేసింది. ఇకపోతే ఈ సినిమా విడుదలరోజే బాలీవుడ్ నటుడు రణవీర్ (Ranaveer)హీరోగా నటించిన ధురంధర్ 2 (Dhurandhar 2)సినిమా కూడా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది ఇటీవలే ధురంధర్ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఏకంగా 800 కోట్లకు పైగా కలెక్షన్లను రాబట్టిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే సీక్వెల్ పై కూడా అదే స్థాయిలో అంచనాలు ఉన్నాయి.
ఇలా ఈ రెండు సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద పోటీకి దిగడంతో ఏదో ఒక సినిమా విడుదల వాయిదా పడుతుందని ముఖ్యంగా యష్ (Yash)నటించిన టాక్సిక్ విడుదల వాయిదా పడుతుంది అంటూ వార్తలు వచ్చాయి. అయితే ఈ సినిమా విడుదల విషయంలో మాత్రం చిత్ర బృందం వెనకడుగు వేయలేదు. ఇలా బాక్స్ ఆఫీస్ వద్ద ఈ రెండు సినిమాలు పోటీకి దిగడంతో ఈ విషయంపై యశ్ స్పందించారని తెలుస్తోంది. ఈ సినిమా కంటెంట్ పై తనకు పూర్తిగా నమ్మకం ఉందని అందుకే పోటీ నుంచి తప్పుకోకుండా ధురంధర్ 2 సినిమాకు పోటీగా విడుదలవుతుందని తెలుస్తోంది.
భారీగా ప్రీ రిలీజ్ బిజినెస్..
ఇలా ఈ సినిమా విషయంలో యశ్ కాన్ఫిడెంట్ చూస్తుంటే ఈ సినిమా ద్వారా సరికొత్త రికార్డులను సృష్టించబోతున్నారని తెలుస్తోంది. మరి యష్ టాక్సిక్ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎలాంటి సక్సెస్ అందుకుంటుందో తెలియాల్సి ఉంది. ఇక ఈ సినిమా యాక్షన్ డ్రామాగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇక ఈ సినిమాలో కియారా అద్వానీ, నయనతార రుక్మిణి వసంత్, తారా సుతారియా వంటి పలువురు హీరోయిన్లు నటించబోతున్నారు. ఈ సినిమా కోసం కన్నడ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు . ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా భారీ స్థాయిలో జరుగుతుంది. కేవలం రెండు తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ హక్కులను దిల్ రాజు ఏకంగా 120 కోట్లకు కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇలా ఈ సినిమా పై విడుదలకు ముందే భారీ అంచనాలు నేపథ్యంలో ఈ సినిమాకు పోటీగా ఇతర సినిమాలు విడుదలవుతున్న విడుదల తేదీ విషయంలో మార్పులు చేసుకోలేదని తెలుస్తోంది.
Also Read: Vijay Rashmika wedding: విజయ్ రష్మిక పెళ్లికి కండీషన్లు.. వాటికి నాట్ అలో..