E-Paper
Advertisement

Gadwal Municipality: కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తేవడమే లక్ష్యం : డిసిసి అధ్యక్షుడు రాజీవ్ రెడ్డి!

Gadwal Municipality: కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తేవడమే లక్ష్యం : డిసిసి అధ్యక్షుడు రాజీవ్ రెడ్డి!
Advertisement

Gadwal Municipality: రాష్ట్ర ప్రభుత్వ ప్రజా పాలన ద్వారా క్షేత్రస్థాయిలో పార్టీకి పూర్వ వైభవం తెచ్చేలా కృషి చేస్తానని జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాజీవ్ రెడ్డి అన్నారు.  జిల్లా కేంద్రంలో ప్రజాబంగ్లాలో గద్వాల మున్సిపాలిటీలోని 29వ వార్డు ఇండిపెండెంట్ కౌన్సిలర్  సత్యం, 32 వ వార్డు ఇండిపెండెంట్ కౌన్సిలర్ ముత్యాల లక్ష్మి అధికారికంగా కాంగ్రెస్ పార్టీ కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీలో క్రమశిక్షణ తప్పితే ఎంతటి నాయకుడినైనా ఉపేక్షించే ప్రశ్నే లేదన్నారు. వ్యక్తిగతంగా పార్టీ కార్యక్రమాలు నిర్వహించడం ఇకమీదట కుదరదన్నారు. మున్సిపాలిటీలో అందరికీ ఆమోదయోగమైన బీసీ మహిళకు మున్సిపల్ చైర్ పర్సన్ గా జయలక్ష్మి ని పార్టీ ఎంపిక చేసిందన్నారు.

Also Read: Vishwak Sen: నా అకౌంట్లో రూ. లక్ష చూడటమే కల.. ఆ క్షణం కన్నీళ్లాగలేదు..

వర్గ పోరుని ప్రోత్సహించే వారిపై కఠిన చర్యలు

Advertisement

కాంగ్రెస్ పార్టీలో సమిష్టిగా పనిచేస్తేనే గుర్తింపు లభిస్తుందన్నారు. వర్గ పోరుని ప్రోత్సహించే వారిపై కఠిన చర్యలు ఉంటాయన్నారు. గతంలో చెప్పిన విధంగా ఇంట్లో కూర్చున్న చోటికి బీఫామ్ లు రావని ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో నిరూపించానన్నారు. నూతన మున్సిపల్ చైర్ పర్సన్ జయలక్ష్మి మాట్లాడుతూ ప్రభుత్వం, స్థానిక ఎమ్మెల్యే, అధికారులు, కౌన్సిలర్ల సహకారంతో మున్సిపాలిటీలో నెలకొన్న సమస్యలను పరిష్కరించి మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట వేస్తామన్నారు.పార్టీ చేస్తున్న అభివృద్ధి పనులకు ఆకర్షితులై పార్టీలో చేరినట్లు స్వతంత్ర కౌన్సిలర్లు సత్యం లక్ష్మి తెలిపారు. ప్రజలు పెట్టుకున్న నమ్మకాలను నిజం చేస్తూ వార్డులలో నెలకొన్న సమస్యలను పరిష్కరించి, వార్డు ప్రజలకు అందుబాటులో ఉంటామన్నారు. ఈ సమావేశంలో మున్సిపల్ వైస్ చైర్మన్ గంజిపేట శంకర్ ,పట్టణ అధ్యక్షుడు ఇసాక్ ,తుమ్మల నరసింహులు పార్టీ నాయకులు పాల్గొన్నారు.

Also Read: Rukmini Vasanth: స్పెషల్ ఫోజులతో ఆకట్టుకుంటున్న రుక్మిణీ వసంత్!

Related News

తెలుగు రాష్ట్రాల్లో మారుతున్న వాతావరణం.. ఏకంగా రెండు అల్పపీడనాలు, భారీ వర్ష సూచన

వాహనారులకు అలర్ట్.. హైదరాబాద్ సిటీలో సద్దుల బతుకమ్మ పండగ, వివిధ ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు

హైదరాబాద్ MVSR కాలేజీ దాండియా వేడుకల్లో ఘోర ప్రమాదం.. ఇద్దరు మృతి!

క్యూనెట్ రూ.10,000 కోట్ల కుంభకోణం.. మరో కీలక నిందుతుడు అరెస్ట్?

వాహన ఫిట్‌నెస్ టెస్ట్ విధానంలో.. తెలంగాణ సర్కార్ కీలక మార్పులు..?

మూసీ తరహాలోనే హుస్సేన్ సాగర్ ప్రక్షాళన.. సర్కార్ సంచలన నిర్ణయం!

తెలంగాణ ప్రభుత్వ ఆఫీసుల్లో.. ఏసీల వాడకం పై కొత్త రూల్స్ ఇవే..?

విద్యాసంస్థల్లో దాడులా.. కాంగ్రెస్ అనుబంధ సంఘాలకు పీసీసీ మాస్ వార్నింగ్!

Big Stories

Advertisement
×