E-Paper
Advertisement

Actress Amani : రాజకీయాల్లో ఎంట్రీ ఇవ్వబోతున్న నటి ఆమని.. ఏ పార్టీలో చేరుతుందంటే..?

Actress Amani : రాజకీయాల్లో ఎంట్రీ ఇవ్వబోతున్న నటి ఆమని.. ఏ పార్టీలో చేరుతుందంటే..?
Advertisement

Actress Amani : తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు నటి ఆమని.. ఎన్నో సినిమాల్లో నటించి ప్రేక్షకుల మనసులో తన నటనతో చెరగని ముద్ర వేసుకుంది. ఆమె కెరియర్ పీక్స్ లో ఉన్నప్పుడే స్టార్ హీరోలు అందరితో సినిమాలు చేసే ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన అతి కొద్ది కాలంలోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగింది.. ఒకవైపు వరుస సినిమాలతో బిజీగా ఉన్నప్పుడే తమిళ డైరెక్టర్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. అయితే కొన్నేళ్లు బాగానే సాగిన వీరి దాంపత్యానికి గుర్తుగా పిల్లలు కూడా పుట్టారు.. ఆ తర్వాత ఆర్థిక పరిస్థితులు వీరిని దూరం చేశాయని గతంలో ఓ ఇంటర్వ్యూ లో ఆమని చెప్పారు. ప్రస్తుతం బుల్లితెర పై ప్రసారం అవుతున్న సీరియల్స్ లలో నటిస్తున్నారు. తాజాగా ఈమె గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. అదేంటంటే త్వరలోనే ఈమె రాజకీయాల్లోకి అడుగుపెట్టబోతుందంటూ వార్తలు సోషల్ మీడియాలో ప్రచారంలో ఉన్నాయి. అందులో నిజం ఎంత ఉందో తెలియదు గానీ ప్రస్తుతం ఇది హాట్ టాపిక్ గా మారింది.

రాజకీయాల్లోకి ఆమని ఎంట్రీ.. 

సినీ నటి ఆమని సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. హీరోలకు తల్లిగా, లేదా హీరోయిన్లకు తల్లిగా నటిస్తూ వస్తుంది.. కేవలం సినిమాలు మాత్రమే కాదు అటు వెబ్ సిరీస్ లు, బుల్లితెరపై ప్రసారం అవుతున్న సీరియల్స్లలో కూడా నటిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.. అయితే గత కొద్దిరోజులుగా ఆమని రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతుందంటూ వార్తలు వినిపించాయి. కానీ వాటిపై ఆమె ఎక్కడ స్పందించలేదు. ఇప్పుడు మరోసారి ఆ వార్తలు ఊపు అందుకున్నాయి ఊపందుకున్నాయి. ఈమె రాజకీయాల్లోకి ఎంట్రీకి రంగం సిద్ధం చేసుకున్నట్లు ప్రస్తుతం టాక్ నడుస్తుంది. త్వరలోనే బీజెపి కండువా కప్పుకోబోతుందంటూ ప్రచారం జరుగుతుంది. ఇందులో నిజం ఎంత ఉంది అన్నది తెలియాలంటే ఈ వార్తలపై ఆమని స్పందించేంత వరకు వెయిట్ చేయాలి.. ఇకపోతే ప్రముఖ రాజకీయ పార్టీ అయినా బీజెపిలోకి ఇప్పటికే పలువురు హీరోయిన్లు చేరారు. ఇప్పుడు ఆమని కూడా ఆ లిస్టులోకి చేరిపోతుందేమో చూడాలి..

Advertisement

Also Read :అడ్వాన్స్ బుకింగ్స్ లో ‘జన నాయగన్’ రికార్డ్ బ్రేక్.. ఆ సంస్థకే శాటిలైట్ హక్కులు..?

ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్…

వెండితెర పై ఒక ఊపు ఊపేసిన హీరోయిన్ ఆమని.. టాలీవుడ్ ఇండస్ట్రీలోని స్టార్ హీరోల అందరితోనూ జోడీ కట్టింది.. అప్పటిలో ఆమె సినిమాలకు మంచి డిమాండ్ ఉండేది.. కేవలం తెలుగులో మాత్రమే కాదు మిగిలిన ఇండస్ట్రీలలో కూడా ఆమె సినిమాలు చేసింది. పెళ్లి చేసుకున్న తర్వాత కొద్ది రోజులు సినిమాలకు దూరమైంది. ఆ తర్వాత ఇన్నాళ్లకు సెకండ్ నుంచి స్టార్ట్ చేసి వచ్చిన అవకాశాలన్నిటిని సద్వినియోగం చేసుకుంటూ సినిమాలు చేస్తూ బిజీగా గడుపుతుంది. వెండితెర నుంచి బుల్లితెరపైకి అడుగుపెట్టిన ఆమని స్టార్ మా లో ప్రసారమవుతున్న ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ లో నటిస్తుంది.. ఈ సీరియల్ ద్వారా ఆమెకు మంచి గుర్తింపు లభించింది.. ప్రస్తుతం ఈమె సీరియల్స్ తో పాటుగా మరో రెండు మూడు భారీ ప్రాజెక్టులలో నటిస్తున్నట్లు సమాచారం..

Related News

ఇరుముడి సీక్వెల్ సినిమాలో రామ్ చరణ్.. ఫాన్స్ కు పూనకాలే!

పవన్‌ కల్యాణ్‌ ఆస్తుల లెక్క ఇదిగో.. కళ్లు తిరిగే నంబర్లు!

లక్కీ భాస్కర్ 2… వెంకీ అట్లూరి బిగ్ అప్డేట్!

పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. ‘ఓజీ యూనివర్స్’ నుంచి స్పెషల్ ట్రీట్!

రూ.200 కోట్ల క్లబ్ లోకి ఇరుముడి.. అయ్యప్పగా మణెమ్మ!

టాక్సిక్ vs ఇరుముడి.. భారీ బడ్జెట్ సినిమాలకు ఇదో గుణపాఠమా?

సాహో ప్రపంచంలోకి ఓజీ..? ఏం ప్లాన్ చేస్తున్నావ్ సుజిత్ ?

మీరే నాకు స్ఫూర్తి… బాబాయ్ కు అబ్బాయ్ విషెస్!

Big Stories

Advertisement
×