Bangaluru: బెంగళూరులో దారుణ ఘటన జరిగింది. ఇంటి ముందు రోడ్డుపై ఆడుకుంటున్న చిన్నారిపై ఓ వ్యక్తి అకారణంగా దాడికి పాల్పడ్డాడు. బెంగళూరులోని త్యాగరాజనగర్‌లో తన ఇంటి బయట ఆడుకుంటున్న ఐదేళ్ల బాలుడిని 35 ఏళ్ల వ్యక్తి ఎగిరి తన్నిన వీడియో CCTV ఫుటేజీలో రికార్డు అయింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు.
ఈ ఘటనకు పాల్పడింది మాజీ జిమ్ ట్రైనర్ రంజన్‌గా పోలీసులు గుర్తించారు. అతడిని కోర్టులో హాజరుపరిచి జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు. పోలీసుల ప్రాథమిక విచారణలో అతడి మానసిక స్థితి స్థిరంగా లేదని గుర్తించారు.
త్యాగరాజనగర్ పోస్టల్ రోడ్డులో ఉంటున్న నీవ్ జైన్ తన తల్లి, బంధువులతో కలిసి ఇంటి సమీపంలో ఆడుకుంటున్నాడు. మాజీ జిమ్ ట్రైనర్ రంజన్ తన ఇంట్లోంచి బయటకు వస్తూ.. రోడ్డుపై ఆడుకుంటున్న బాలుడిని వెనుక నుంచి బలంగా తన్నాడు. దీంతో బాలుడు ఒక్కసారిగా రోడ్డుపై పడిపోయాడు. ఈ దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. బాలుడి ముఖం, కాళ్లు, చేతులకు గాయాలయ్యాయి. ఈ ఘటనపై బాలుడి తల్లి దీపికా జైన్ బనశంకరి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.
దక్షిణ బెంగళూరులోని బనశంకరి ప్రాంతంలో వరుసగా పిల్లలు, యువతులపై దాడులు జరుగుతున్నట్లు పోలీసులు గుర్తించారు. అలాగే మాజీ జిమ్ ట్రైనర్ రంజన్ పై ఈ తరహా కేసులు ఉన్నట్లు తెలుస్తోంది. బాలుడి తల్లి ఫిర్యాదుతో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పోలీసుల దర్యాప్తులో బాలుడిపై దాడి చేసినట్లు రంజన్ పలువురిపై దాడికి పాల్పడినట్లు గుర్తించారు. సీసీటీవీలు పరిశీలించగా రంజన్ దాడులకు పాల్పడిన దృశ్యాలు వెలుగుచూశాయి. బాధితుల కుటుంబ సభ్యులను సంప్రదించి నిందితుడిపై చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు పోలీసులు సిద్ధమయ్యారు.
Shocking😱
footage from #Thyagarajnagar show a man kicking a child from behind while the child was peacefully playing badminton with his mother, with no provocation.This mentally unstable people should be sent to rehabiliation center😡#Bengaluru #AamirKhan #TuMeriMainTera pic.twitter.com/vxAxTS90O1
— Daphi (@Dafi_syiemz) December 19, 2025
గతంలో బన్నేర్‌ఘట్ట రోడ్డులో జిమ్ ట్రైనర్‌గా పనిచేసిన రంజన్ కు.. మూడు నెలల క్రితం జరిగిన ఓ ప్రమాదంతో మానసిక ఆరోగ్యం క్షీణించిందని పోలీసులు తెలిపారు. ప్రస్తుతం అతడ్ని మధురైలోని ఒక ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందిస్తు్న్నారు. నిందితుడిపై చట్టపరమైన చర్యలు తీసుకోవచ్చా అనే విషయాన్ని పోలీసులు పరిశీలిస్తున్నారు.
Also Read: Auto Hits RTC Bus: బస్సును ఢీకొన్న స్కూల్ ఆటో.. స్టూడెంట్స్ స్పాట్‌లో