E-Paper
Advertisement

Jana Nayagan: అడ్వాన్స్ బుకింగ్స్ లో ‘జన నాయగన్’ రికార్డ్ బ్రేక్.. ఆ సంస్థకే శాటిలైట్ హక్కులు..?

Jana Nayagan: అడ్వాన్స్ బుకింగ్స్ లో ‘జన నాయగన్’ రికార్డ్ బ్రేక్.. ఆ సంస్థకే శాటిలైట్ హక్కులు..?
Advertisement

Jana Nayagan: కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ దళపతి ఈ పేరు వినగానే అభిమానులకు తెలియని ఉత్సాహం వస్తుందన్న విషయం తెలిసిందే.. తమిళ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ రజనీకాంత్ తర్వాత విజయ్ సినిమాల కోసం ఎక్కువగా అభిమానులు ఎదురు చూస్తుంటారు.. ఈమధ్య కొన్ని సినిమాలు మిక్స్డ్ టాక్ ని అందుకున్న కూడా మరికొన్ని సినిమాలు మాత్రం బాక్సాఫీస్ వద్ద బిగ్గెస్ట్ హిట్గా నిలుస్తున్నాయి.. ఈ క్రమంలో విజయ్ నటిస్తున్న తాజా చిత్రం జననాయగన్.. ఇదే ఇతని చివరి సినిమా కూడా.. ప్రముఖ దర్శకుడు హెచ్. వినోద్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం పవర్‌ఫుల్ పొలిటికల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోంది. ఈ సినిమాని థియేటర్లలో చూసేందుకు ఆయన అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.. వచ్చేయడాది సంక్రాంతి కానుకగా థియేటర్లలోకి రాబోతుంది.. ఈ క్రమంలో ఈ మూవీ అడ్వాన్స్ బుకింగ్స్ లో రికార్డ్ బ్రేక్ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.. ప్రస్తుతం ఈ చిత్రం బుకింగ్స్ ఎక్కడ ఎలా ఉన్నాయో ఒకసారి తెలుసుకుందాం..

అడ్వాన్స్ బుకింగ్స్ లో విజయ్ మూవీ రికార్డ్ బ్రేక్.. 

తమిళ హీరో విజయ్ దళపతి నటిస్తున్న చివరి సినిమా కావడంతో రోజు రోజుకు జననాయగన్ పై అంచనాలు పెరుగుతున్నాయి. హీరోయిన్‌గా పూజా హెగ్డే నటిస్తుండగా, మలయాళం బ్యూటీ మమిత బైజు విజయ్ కూతురు పాత్రలో కనిపించనుంది. యాక్షన్ ఎంటర్‌టైనర్ జనవరి 9న సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన ‘దళపతి కచేరి’ పాటకు ఫ్యాన్స్ నుంచి భారీ స్పందన వస్తుంది. తాజా విడుదల చేసిన సెకండ్ సింగిల్ కూడా విశేషంగా ఆకట్టుకుంటోంది.. విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో సినిమాకు అడ్వాన్స్ బుకింగ్స్ కూడా మొదలయ్యాయి. అడ్వాన్స్ టికెట్ బుకింగ్స్ విషయంలో ఇప్పటికే హిస్టరీ క్రియేట్ చేస్తోంది.. బుకింగ్స్ చూస్తే.. యూకేలో అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభమైన తొలి 24 గంటల్లోనే 12,800కు పైగా టికెట్లు అమ్ముడుపోవడం విశేషం. లియో చిత్రానికి మించిన బుకింగ్స్ జరిగాయని తెలుస్తుంది. అలాగే ఈ మూవీ శాటిలైట్ హక్కులు ప్రముఖ సంస్థ జీ సొంతం చేసుకుంది..

Advertisement

Also Read : ప్రభాస్ పరువు తీసిన ‘రాజా సాబ్’.. అక్కడ బుకింగ్స్ మరీ ఇంత తక్కువా..?

రాజకీయాల్లోకి విజయ్ ఎంట్రీ.. 

తమిళ హీరో విజయ్ దళపతి రాజకీయాల్లోకి ఎట్రీ ఇవ్వబోతున్న సంగతి అందరికీ తెలిసిందే.. సొంత పార్టీని విజయ్ స్థాపించారు. ఆ పార్టీ పేరు తమిళగ వెట్రి కజగం. 2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలను లక్ష్యంగా ముందుకు సాగుతున్న సంగతి తెలిసిందే.. ఎలాగైనా సరే ఈ ఎన్నికల్లో తమ పార్టీ గెలుపుని చూడాలని విజయ్ తెగ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే ఆయన పార్టీ తరఫున మీటింగ్లు కూడా ఏర్పాటు చేశారు. అయితే గతంలో ఏర్పాటు సమావేశంలో తొక్కిసలాట జరిగి పలువురు అభిమానులు మృతి చెందిన విషయం తెలిసిందే. ఇక ఈ సినిమా విజయ్ కెరియర్ లో చివరి సినిమా.. అందుకేనేమో ఈ సినిమాకి మొదటి నుంచి అంచనాలు కాస్త ఎక్కువగానే ఉన్నాయి. ఇప్పటివరకు రిలీజ్ అయిన అప్డేట్స్ అన్నీ కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. మరి సినిమా ఎలాంటి టాక్ ను సొంతం చేసుకుంటుందో చూడాలి..

Related News

చిన్న వయసులోనే గొప్ప మనసు చాటుకున్న సితార.. మహేష్ బాబు ఎమోషనల్ పోస్ట్!

టాలీవుడ్ లో నేషనల్ అవార్డు అందుకున్న తొలి చైల్డ్ ఆర్టిస్ట్ ఎవరంటే?

భాయ్ చిక్కిపోయాడని ఏడ్చేసిన ఫ్యాన్స్.. రివర్స్ సెటైర్ వేసిన సల్మాన్ !

రికార్డుల వేటలో ‘ది ఒడిస్సీ’..మన మేకర్స్ ఇప్పటికైనా మారతారా?

విదేశాల్లో షాట్లు.. ఏపీలో ఓట్లు! టాలీవుడ్ స్టార్స్‌పై అంబికా కృష్ణ మార్కు కౌంటర్లు!

‘టాక్సిక్’ దెబ్బకి ప్లాన్స్ ఛేంజ్? రవితేజ ‘ఇరుముడి’ రిలీజ్ డేట్‌పై లేటెస్ట్ అప్‌డేట్!

మగాళ్ల హత్యల పై షాకింగ్ కామెంట్స్.. కొడుకు కోసం ఆందోళన పడుతున్న కాజల్..

నేను దేశ ద్రోహిని కాదు.. బీజేపీ తీరుపై నటుడు నరేష్ ఫైర్..

Big Stories

Advertisement
×