E-Paper
Advertisement

సోషల్ మీడియా ట్రోలర్స్‌కు నటి హేమ షాక్.. సీపీ సజ్జనార్‌కు ఫిర్యాదు!

సోషల్ మీడియా ట్రోలర్స్‌కు నటి హేమ షాక్.. సీపీ సజ్జనార్‌కు ఫిర్యాదు!
Advertisement

Hema Complaint: సోషల్ మీడియా వేదికగా సెలబ్రిటీలను, ముఖ్యంగా మహిళా నటీమణులను టార్గెట్ చేస్తూ అసభ్యకరమైన కామెంట్స్ చేసే నెటిజన్ల ఆటకట్టించడానికి సినీనటి హేమ రంగంలోకి దిగారు. గత కొంతకాలంగా తనపై ఇష్టమొచ్చినట్టు వల్గర్ కామెంట్స్, ట్రోలింగ్ చేస్తున్న పలువురిపై ఆమె చట్టపరమైన చర్యలకు ఉపక్రమించారు. ఈ మేరకు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వి.సి. సజ్జనార్‌ను నేరుగా కలిసి, ఆధారాలతో సహా లిఖితపూర్వక ఫిర్యాదు చేశారు.

Read also-Jabardast Varsha : జబర్దస్త్ వర్ష నెలకు ఎంత సంపాదిస్తుందో తెలుసా..?

ఓపిక నశించే..

Advertisement

సీపీ సజ్జనార్‌ను కలిసిన అనంతరం నటి హేమ ఒక సెల్ఫీ వీడియోను సోషల్ మీడియాలో విడుదల చేశారు. తనపై జరుగుతున్న డిజిటల్ వేధింపులపై ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. “నాపై వల్గర్ కామెంట్స్ పెట్టొద్దని, ఒకవేళ అలా చేస్తే లీగల్‌గా యాక్షన్ తీసుకుంటానని నేను ముందే హెచ్చరించాను. అయినా కొంతమందిలో మార్పు రాలేదు, నా హెచ్చరికలను బేఖాతరు చేస్తూ అసభ్యకరంగా పోస్టులు పెడుతూనే ఉన్నారు. ఇక నా ఓపిక నశించింది. అందుకే నన్ను బ్యాడ్ గా ట్రోల్ చేసిన, అసభ్య కామెంట్స్ పెట్టిన వాళ్లందరి ప్రొఫైల్స్, కామెంట్ల స్క్రీన్ షాట్లను సేకరించాను. వాటన్నింటినీ సీపీ సజ్జనార్ గారికి అందజేసి కంప్లయింట్ ఇచ్చాను” అని హేమ స్పష్టం చేశారు.

రంగంలోకి పోలీసులు..

నటి హేమ ఇచ్చిన ఫిర్యాదుపై సీపీ సజ్జనార్ సానుకూలంగా స్పందించారు. సోషల్ మీడియాలో మహిళల గౌరవానికి భంగం కలిగించేలా, వ్యక్తిగత దూషణలకు దిగే వారిపై కఠిన చర్యలు ఉంటాయని భరోసా ఇచ్చారు. ఈ కేసును తదుపరి దర్యాప్తు నిమిత్తం సైబర్ క్రైమ్ విభాగానికి బదిలీ చేశారు. హేమ సమర్పించిన స్క్రీన్ షాట్ల ఆధారంగా.. సదరు ఐడీల ఐపీ (IP) అడ్రస్‌లను ట్రాక్ చేసి, నిందితులను గుర్తించే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు.

Advertisement

Read also-‘పెద్ది’ వీకెండ్ కలెక్షన్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే.. రామ్ చరణ్ కెరీర్ లోనే..

ట్రోలర్స్‌కు గట్టి హెచ్చరిక..

ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో సెలబ్రిటీలపై నెగెటివిటీని స్ప్రెడ్ చేయడం, బూతులు తిట్టడం కొందరికి అలవాటుగా మారిందని, ఇలాంటి వారికి ఈ కేసు ఒక గుణపాఠం కావాలని హేమ పేర్కొన్నారు. సెలబ్రిటీలైనా, సాధారణ మహిళలైనా సరే.. డిజిటల్ ప్లాట్‌ఫార్మ్స్‌పై వేధింపులకు గురైతే ఊరుకునేది లేదని, ఐటీ యాక్ట్, సైబర్ చట్టాల ప్రకారం కఠిన శిక్షలు పడేలా ముందడుగు వేస్తానని ఆమె హెచ్చరించారు. ప్రస్తుతం నటి హేమ తీసుకున్న ఈ లీగల్ నిర్ణయం ఆమె షేర్ చేసిన వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. అయితే పోలీసులు జోక్యంతో ఈ సమస్య ఎంత వరకూ సర్థుమణుగుతుందో చూడాలి.

Related News

పిల్లలు ఉన్నా.. లేకపోయినా ఒకే అనుకున్నాం..కానీ: సమంత

ఫౌజీ అసలు వస్తుందా? ప్రభాస్ సినిమా చుట్టూ పెరుగుతున్న సస్పెన్స్!

ఫ్యాన్స్ అంటే సెలబ్రేషన్స్ మాత్రమే కాదు..మనసులు గెలిచిన అల్లు అర్జున్ ఫ్యాన్స్!

మనవడి కోసం నాగబాబు సంచలన నిర్ణయం!

అప్పుడే ఏడాది..క్యూట్ పిక్ తో కొడుకుకి స్పెషల్ విషెస్ చెప్పిన వరుణ్ తేజ్ !

ఫ్యాన్స్ కి విజయ్ దేవరకొండ పిలుపు!

నిఖిల్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. ‘స్వయంబు’ రిలీజ్ అప్పడే..?

‘సర్దార్ 2’ ట్విట్టర్ రివ్యూ.. కార్తీ అకౌంట్లో హిట్ పడిందా..?

Big Stories

Advertisement
×