E-Paper
Advertisement

Harsha Bhogle: వైభ‌వ్ బ్యాటింగ్ అంటేనే అస‌హ్యం వేస్తోంది..ఒక్క సిక్స‌ర్ కొట్ట‌డం చేత‌కాలేదా ?

Harsha Bhogle: వైభ‌వ్ బ్యాటింగ్ అంటేనే అస‌హ్యం వేస్తోంది..ఒక్క సిక్స‌ర్ కొట్ట‌డం చేత‌కాలేదా ?
Advertisement

Harsha Bhogle:  ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ (Indian Premier League 2026 tournament) సందర్భంగా అదరగొట్టిన 15 ఏళ్ల కుర్రాడు వైభవ్ సూర్యవంశీ (Vaibhav Sooryavanshi), ప్రస్తుతం లిస్ట్ A క్రికెట్ ఆడుతున్నాడు. టీమిండియా, ఆఫ్ఘనిస్తాన్ అలాగే శ్రీలంక జట్ల మధ్య లిస్ట్ ఏ ట్రై సిరీస్ (Tri Nation A Series in Sri Lanka 2026) జరుగుతోంది. శ్రీలంక వేదికగా జరుగుతున్న ఈ టోర్నమెంట్ నేపథ్యంలో.. ఇవాళ ఆఫ్ఘనిస్తాన్ వర్సెస్ టీమ్ ఇండియా లిస్ట్ ఏ ( India A vs Afghanistan A, 2nd Match) జట్ల మధ్య మ్యాచ్ జరుగుతోంది. ఇందులో మొదటి బ్యాటింగ్ చేసిన టీమిండియా, భారీ స్కోర్ దిశగా దూసుకు వెళ్తోంది. ఇక ఈ మ్యాచ్ లో ఓపెనర్ గా బరిలోకి దిగిన 15 ఏళ్ల కుర్రాడు వైభవ్ సూర్యవంశీ (Vaibhav Sooryavanshi), 44 పరుగులు సాధించి వికెట్ కోల్పోయాడు. దీంతో అర్థ సెంచరీ మిస్సైంది.

Also Read: Litton Das ON T20 World Cup 2026 : పాకిస్తాన్ లో అడుగుపెట్టాలంటే గన్ మెన్లను పెట్టుకోవాల్సిందే..బంగ్లా క్రికెటర్ సంచలనం

వైభవ్ సూర్యవంశీపై హర్ష భోగ్లే వివాదాస్పద వ్యాఖ్యలు

Advertisement

ఆఫ్ఘనిస్తాన్ వర్సెస్ టీమ్ ఇండియా మధ్య జరుగుతున్న వన్డే మ్యాచ్ సందర్భంగా 15 ఏళ్ల కుర్రాడు వైభవ్ సూర్యవంశీ అర్థ సెంచరీ మిస్ చేసుకున్నాడు. 22 బంతులు ఎదుర్కొన్న వైభవ్ సూర్యవంశీ, 44 పరుగులు సాధించాడు. ఇందులో తొమ్మిది బౌండరీలు సాధించగా.. ఒక్క సిక్సర్ కూడా బాదలేక పోయాడు. కానీ 200 స్ట్రైక్ రేట్ మాత్రం సాధించాడు వైభవ్ సూర్య‌వంశీ. ఐపీఎల్ టోర్నమెంట్ లో సిక్సర్లు తప్ప సింగిల్స్, బౌండరీలు పెద్దగా కొట్టని వైభవ్… ఈ మ్యాచ్ లో ఒక్క సిక్సర్ కూడా కొట్టలేని పరిస్థితి ఉన్న నేపథ్యంలో ప్రముఖ కామెంటేటర్ హర్ష భోగ్లే (Harsha Bhogle) సంచలన వ్యాఖ్యలు చేశారు.

వైభవ్ సూర్యవంశీ ఒక్క సిక్సర్ కొట్టకపోవడంతో.. అతని బ్యాటింగ్ చూస్తే అసహ్యం వేసిందని హాట్ కామెంట్స్ చేశారు. సిక్సర్లు కొట్ట లేకపోతే అతడి బ్యాటింగ్ చూడలేమని బాంబు పేల్చారు. ప్రతి మ్యాచ్ లో వైభవ్ సిక్సర్ల మీద కాన్సన్ట్రేషన్ చేయాలని… అతడి సిక్సర్ల కోసం కోట్లాదిమంది అభిమానులు ఎదురుచూస్తున్నారని వ్యాఖ్యానించారు. కానీ ఆఫ్గనిస్తాన్ తో మ్యాచ్ జరుగుతున్న సందర్భంగా 9 బౌండరీలు సాధించిన వైభవ్.. ఒక్క సిక్సర్ కొట్టకపోవడం తనకు బాధ కలిగించిందని కీలక వ్యాఖ్యలు చేశారు. ఇకపైన మ్యాచ్ ఆడేటప్పుడు సిక్సర్ల పై ఫోకస్ చేయాలని కోరారు. అప్పుడే మ్యాచ్ మజా వస్తుందని వ్యాఖ్యానించారు హర్ష భోగ్లే. ఇది ఇలా ఉండగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంటులో ఆరెంజ్ క్యాప్ విజేతగా నిలిచిన 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీని టీమిండియాలోకి తీసుకుంటున్నట్లు బిసిసిఐ ప్రకటించింది. ఐర్లాండ్ అలాగే ఇంగ్లాండ్ తో జరిగే టి20 లకు వైభవ్ ఆడే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

Advertisement

Also Read: Manav Sutar’s career changed with superstition: మూఢనమ్మకాల‌తో మాన‌వ్ సుతార్ కెరీర్ ఛేంజ్…6 వికెట్లు తీసి 38 ఏళ్ల రికార్డ్ బ్రేక్ చేసిన‌ జ‌డేజా వార‌సుడు

 

Related News

సంజు కంటే అభిషేక్ శ‌ర్మ పెద్ద‌ పోటుగాడా? అంద‌రికీ ఒకే రూల్స్ ఉండాలి

పసికూన‌ జింబాబ్వే పైన గెలవడం కాదు…మ‌గాళ్లు అయితే మాపై గెల‌వండి!

పాకిస్తాన్ ఘోర అవ‌మానం…ఏ ఒక్క కామెంటేటర్ ను పిల‌వ‌ని వెస్టిండీస్‌

వైభ‌వ్ సెంచ‌రీ మిస్…టీమిండియా చేతిలో జింబాబ్వే వైట్ వాష్

Video: వైభవ్ సూర్యవంశీ భారీ సిక్సర్..స్టేడియం బయట పడ్డ బంతి

జింబాబ్వేను బెదిరించి సిరీస్ గెలుచుకున్నారు..త‌న్వీర్ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు

ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా వెనుక ధోని కుట్ర‌లు?

జింబాబ్వే బౌలర్లు స్లో బంతులు వేశారు…అందుకే టీమిండియా గెలుపు

Big Stories

Advertisement
×