E-Paper
Advertisement

మానసికంగా కృంగిపోయాను.. ఆ టైంలో సూసైడ్ చేసుకోవాలనుకున్నాను: హేమ

మానసికంగా కృంగిపోయాను.. ఆ టైంలో సూసైడ్ చేసుకోవాలనుకున్నాను: హేమ
Advertisement

Actress Hema: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో సీనియర్ నటిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో సీనియర్ నటి హేమ ఒకరు. ఒకానొక సమయంలో టాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస సినిమాలలో అక్క, వదిన పిన్ని పాత్రలలో నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు. అయితే ఇటీవల కాలంలో హేమ(Hema) సినిమాలకు దూరమైనప్పటికీ పలు వివాదాల ద్వారా వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. గత ఏడాది క్రితం డ్రగ్స్ కేసు(Drugs Case)లో చిక్కుకోవడంతో ఈ విషయం కాస్త ఇండస్ట్రీలో సంచలనంగా మారింది. ఈ డ్రగ్స్ కేసు ఆరోపణలలో భాగంగా హేమ జైలుకు కూడా వెళ్లిన సంగతి తెలిసిందే.

మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో పాల్గొన్న హేమ..

ఇలా డ్రగ్స్ ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి ఈమె ఈ కేసు పూర్తి విచారణ జరిగిన అనంతరం హేమ ఎలాంటి డ్రగ్స్ తీసుకోలేదని ఈమెపై క్లీన్ చిట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇలా తన తప్పులేదని కోర్టు తీర్పు వెల్లడించడంతో హేమ ఎంతో ఎమోషనల్ అయ్యారు. మొదటి నుంచి కూడా డ్రగ్స్ విషయంలో తన తప్పులేదని చెబుతున్నప్పటికీ వినకుండా మీడియా, సోషల్ మీడియాలో తనపై ఎన్నో ఆరోపణలు చేశారని ఈమె తరచూ తన బాధను మొత్తం బయట పెడుతూ వచ్చారు. తాజాగా హేమ ఫిలిం క్రిటిక్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో పాల్గొన్నారు.

సూసైడ్ ఆలోచనలు వచ్చాయి..

Advertisement

ఈ కార్యక్రమంలో భాగంగా హేమ మీడియాలోనూ సోషల్ మీడియాలోనూ తన గురించి వచ్చిన ఆరోపణల పై మాట్లాడుతూ కాస్త ఎమోషనల్ అయ్యారు. నా తప్పు లేకపోయినా తన గురించి పెద్ద ఎత్తున వార్తలు బయటకు వచ్చాయని తెలిపారు. డ్రెస్ కేసులో తనపై వచ్చిన ఆరోపణలు కారణంగా తాను మానసికంగా ఎంతో కృంగిపోయానని తెలిపారు. ఆ సమయంలో తాను సూసైడ్ చేసుకుంటే బాగుంటుందనే ఆలోచనలు కూడా చేశానని హేమ ఈ సందర్భంగా షాకింగ్ విషయాన్ని బయటపెట్టారు. ఇలా నిజా నిజాలు తెలుసుకోకుండా నా గురించి మీడియాలో వచ్చిన వార్తలు చూసి నా కుటుంబం మొత్తం ఎంతో ఇబ్బందులు పడ్డారు .

అమ్మ చనిపోవడానికి అదే కారణం..

Advertisement

మా అమ్మ చనిపోవడానికి కారణం కూడా ఈ ఆరోపణలేనని హేమ తెలిపారు. నాపై ఇలాంటి ఆరోపణలు వచ్చినప్పుడు చుట్టుపక్కల వాళ్ళు చూసే విధానంలో కూడా మార్పు వచ్చిందని వీటన్నింటినీ భరించలేక సూసైడ్ ఆలోచనలు వచ్చాయని హేమ ఆవేదన వ్యక్తం చేశారు.
నేను ఎలాంటి తప్పు చేయలేదు అందుకే నిర్దోషిగా బయటకు వచ్చానని తెలిపారు. డ్రగ్స్ ఆరోపణల కేసులు హేమ చిక్కుకోవడంతో హేమ పూర్తిగా ఇండస్ట్రీకి దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. బెంగళూరు హైకోర్టులో తనకు క్లీన్ చీట్ వచ్చిన తర్వాత ఈమె బయటకు వస్తూ ఆ సమయంలో తను ఎదుర్కొన్న బాధను ఇబ్బందుల గురించి మాట్లాడుతూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Also Read: సితార బ్యానర్ లో నితిన్ కొత్త సినిమా.. డైరెక్టర్ ఎవరంటే? ఈసారైనా హిట్ కొట్టేనా?

Related News

నవరాత్రుల వేళ హెబ్బా పటేల్ స్పెషల్ ట్రీట్..ఫ్యాన్స్‌కు కనువిందే!

జ్యోతి పూర్వజ్, పూర్వాజ్ మూవీ ‘కిల్లర్’.. ఒకేసారి రెండు అప్డేట్స్!

‘స్పిరిట్’ వాయిదా.. ఫ్యాన్స్‌కు కొత్త రిలీజ్ డేట్ ప్రకటించిన సందీప్ రెడ్డి వంగా!

గరివిడి లక్ష్మి సినిమాపై రవితేజ రివ్యూ.. ఏమన్నారంటే?

ఏడేళ్ల వయసులోనే సాఫ్ట్వేర్ సంస్థకు యజమాని.. ‘జైలర్’ బుడ్డోడు చిన్నోడు కాదండోయ్!

‘గరివిడి లక్ష్మి’లో ఆర్పీ పట్నాయక్ పాత్ర వెనుక అసలు కథ ఇదేనా?

క్యాస్టింగ్ కౌచ్‌పై ఝాన్సీ ఏమన్నారంటే.. ఇండస్ట్రీలో మహిళల పరిస్థితి ఇదేనా?

యూత్‌ను టార్గెట్ చేస్తూ వస్తున్న ‘హైకూ’.. అక్టోబర్ 23న థియేటర్లలోకి!

Big Stories

Advertisement
×