E-Paper
Advertisement

కంటికి కనిపించని ఒత్తిడి.. మీ హార్మోన్ల వ్యవస్థను ఎలా కుప్పకూలుస్తుందంటే?

కంటికి కనిపించని ఒత్తిడి.. మీ హార్మోన్ల వ్యవస్థను ఎలా కుప్పకూలుస్తుందంటే?

Stress And Hormonal Imbalance: ప్రస్తుతం ఒత్తిడి అనేది మనందరి జీవితంలో ఒక భాగం అయిపోయింది. అయితే దీనిని కేవలం ఒక మానసిక సమస్యగా మాత్రమే చూడకూడదు. ఎందకంటే దీర్ఘకాలిక ఒత్తిడి అనేది మన శరీరంలో అంతర్గత అవయవ వ్యవస్థను ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా హార్మోన్ల సమతుల్యతను తలకిందులు చేస్తుంది. మన నిద్ర, ఆకలితో పాటు సంతానోత్పత్తి మాత్రమే అంతే కాకుండా జీవక్రియలు అన్నీ ఈ హార్మోన్లపైనే ఆధారపడి ఉంటాయి కాబట్టి ఒత్తిడి పెరిగినప్పుడు శరీరం ఫైట్ ఆర్ ఫ్లైట్ మెడ్ లోకి వెళ్తుంది. ఫలితంగా అవసరమైన దాని కంటే ఎక్కువ హార్మోన్లను విడుదల చేయడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంటుంది.

ఒత్తిడి హార్మోన్ల అసమతుల్యతకు ఎలా కారణం అవుతుంది ?
సాధారణంగా శరీరం ఒత్తిడికి గురైనప్పుడు, మెదడులోని హై ఫోథాలమస్ సిగ్నల్స్ పంపి అడ్రినల్ గ్రంధు ద్వారా కార్టిసాల్ అంతే కాకుండా.. అడ్రినలిన్ అనే హార్మోన్లు విడుదల చేస్తుంది. ఇది అత్యవసర పరిస్థితుల్లో మనల్ని రక్షించడానికి ఉపయోగపడుతుంది. కానీ..మనం ప్రతి రోజూ ఆందోళన చెందుతూ ఉంటే.. ఈ హార్మోన్లు రక్తంలో నిరంతరం ఎక్కువగా ఉంటాయి. దీనినే క్రానిక్ స్ట్రెస్ అని అంటారు.

1. కార్టికల్:
కార్టిసాల్‌ను స్ట్రెస్ హార్మోన్ అని పిలుస్తారు. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను పెంచుతుంది. అంతే కాకుండా కార్టిసాల్ స్దాయిలు ఎల్లప్పుడూ ఎక్కువగా ఉంటే. అది ఇన్సులిన్ నిరోధకతకు దారి తీస్తుంది. ఫలితంగా బరువు పెరగడం ముఖ్యంగా పొత్తికడుపు భాగంలో కొవ్వు పేరుకుపోవడం వల్ల టైం-2 డయాబెటిస్ బారిన పడే ప్రమాదం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది.

2. థైరాయిడ్ సమస్యలు:
ఒత్తిడి థైరాయిడ్ గ్రంథి పనితీరుపై ప్రత్యక్ష ప్రభావం చూపుతుంది. అధిక కార్టిసాల్ థైరాయడ్ హార్మోన్ల ఉత్పత్తిని కూడా తగ్గిస్తుంది. దీని వల్ల మెటాబాలిజం కూడా మందగిస్తుంది. అంతే కాకుండా అలసట, జుట్టు రాలడంతోపాటు డ్రై స్కిన్ సమస్యల కూడా పెరుగుతుంది.

3.సంతానోత్పత్తి ,హార్మోన్లు:
మహిళల్లో ఒత్తిడి వల్ల ప్రొజెస్టిరాన్ , ఈస్ట్రోజెన్, హార్లోన్ల సమతుల్యత దెబ్బతింటుంది. ఇది పీరియడ్స్ సరిగ్గా రాకపోవడానికి, PCOS (Polycystic Ovary Syndrome), సంతానలేమి సమస్యలకు కూడా దారితీస్తుంది.ఇదిలా ఉంటే మగ వారిలో అధిక ఒత్తిడి టెస్టోస్టెరాన్ స్థాయిలను తగ్గిస్తుంది. ఫలితంగా లైంగిక సామర్థ్యంపై ప్రభావం చూపుతుంది.

4. నిద్ర, మెలటోనిన్:
మనం ప్రశాంతంగా నిద్రపోవడానికి ‘మెలటోనిన్’ అనే హార్మోన్ అవసరం. అయితే.. ఒత్తిడి వల్ల పెరిగే కార్టిసాల్, మెటలోనిన్ ఉత్పత్తిని అడ్డుకుంటుంది. దీని వల్ల నిద్రలేమి వంటి సమస్యలు కూడా ఎదురవుతాయి. నిద్ర సరిగ్గా లేకపోతే హార్మోన్ల అసమతుల్యత మరింత తీవ్రమవుతుంది అని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

స్ట్రెస్ వల్ల హార్మోన్ల అసమతుల్యత కలిగితే కనిపించే లక్షణాలు:

1.కారణం లేకుండా బరువు పెరగడం లేదా తగ్గడం వంటివి జరుగుతాయి.

2. నిరంతరం అలసటగా అనిపించడం.

3. రాత్రిపూట నిద్ర పట్టకపోవడం వంటి సమస్యలు.

4. ఆందోళన లేదా డిప్రెషన్, చిరాకు

Also Read: బలమైన ఆహారమే.. కానీ మీ కిడ్నీలకు శాపంగా మారే అవకాశం! మినప్పప్పు వెనక ఉన్న చేదు నిజం

హర్మోన్ల సమతుల్యతను కాపాడుకోవడానికి మార్గాలు:
సరైన ఆహారం: మెగ్నీషియం, విటమిన్ బి12, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఉన్న ఆహారం తీసుకోవాలి. ఇవి నాడీ వ్యవస్థను ప్రశాంతంగా ఉంచుతాయి.

రెగ్యులర్ వ్యాయామం: ప్రతి రోజూ కనీసం 30 నిమిషాల వాకింగ్ లేదా యోగా చేయడం వల్ల ‘ఎండార్ఫిన్లు’విడుదలవుతాయి. ఇవి కార్టిసాల్‌ను చాలా వరకు తగ్గిస్తాయి.

ధ్యానం: రోజుకు 10-15 నిమిషాల ధ్యానం మెదడును ప్రశాంతంగా ఉంచి, హార్మోన్ల ఉత్పత్తిని క్రమబద్ధీకరిస్తుంది.

తగినంత నిద్ర: రోజుకు కనీసం 7-8 గంటల గాఢ నిద్ర అవసరం.

కెఫిన్ తగ్గించడం: కాఫీ, టీలు ఎక్కువగా తాగడం వల్ల అడ్రినల్ గ్రంధులపై ఒత్తిడి పెరుగుతుంది. వాటికి బదులుగా గ్రీన్ టీ లేదా హెర్బల్ టీలు ప్రయత్నించండి.

Related News

ఏసీలో పడుకుంటే తలనొప్పి వస్తోందా? నిపుణులు చెబుతున్న అసలు కారణాలివే!

టీనేజర్ల ఆరోగ్యాన్ని గుల్ల చేస్తున్న ఎనర్జీ డ్రింక్స్.. తస్మాత్ జాగ్రత్త!

ఇంటి బయట ॐతో పాటు ఈ నాలుగు చిహ్నాలుంటే.. మీ జీవితంలో సుఖ సంతోషాలే

మార్కెట్‌ నుంచి తెచ్చిన మొక్కలు ఇంట్లో ఎండిపోతున్నాయా? ఈ టిప్స్ పాటిస్తే ఏళ్ల తరబడి పచ్చగా పెరుగుతాయి

వేసవి నీరసం వల్ల ఓఆర్ఎస్ తాగుతున్నారా? ప్యాకెట్లు వద్దు.. ఇంట్లోనే ఇలా తయారు చేయండి

మీ అబ్బాయి కోసం పెళ్లిసంబంధాలు చూస్తున్నారా? ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయి సర్వ గుణ సంపన్నురాలు

వేసవిలో అద్దంలా మెరిసిపోయే ముఖ చర్మం కావాలా? ఈ టిప్స్ మీ కోసమే

కొత్త ఇల్లు మీ కోసం సంతోషాలు తీసుకొస్తుందా లేదా కష్టాలకు కారణమవుతుందా? దీనికి కారణాలు ఇవే

Big Stories

×