E-Paper
Advertisement

కన్నీళ్లు పెట్టుకున్న హేమా.. డ్రగ్స్ వ్యవహారంపై ఓపెన్ ఛాలెంజ్.. ‘బిగ్ టీవీ’తో ఏం చెప్పారంటే?

కన్నీళ్లు పెట్టుకున్న హేమా.. డ్రగ్స్ వ్యవహారంపై ఓపెన్ ఛాలెంజ్.. ‘బిగ్ టీవీ’తో ఏం చెప్పారంటే?
Advertisement

Actress Hema: తాజాగా ప్రముఖ నటి హేమకి డ్రగ్స్ కేసు నుండి కోర్టు క్లీన్ చిట్ ఇవ్వడంతో తాజాగా బిగ్ టీవీకి ఎక్స్ క్లూజివ్ గా ఇంటర్వ్యూ ఇచ్చింది. అందులో కన్నీళ్లు పెట్టుకున్న ఈమె.. తాను పడ్డ కష్టాల గురించి.. డ్రగ్స్ వ్యవహారంలో చోటు చేసుకున్న పరిణామాల గురించి ఇలా ఎన్నో విషయాలను పంచుకుంది.

అక్కడ ఉన్నది నేను కాదు.. నిరూపించుకోవడానికి ఎంతో కష్టపడ్డా..

ఇంటర్వ్యూలో భాగంగా హేమ మాట్లాడుతూ.. “పార్టీకి వెళ్లానని అంటున్నారు.. వెళ్లడం ఎంత నిజమో బయటికి రావడం కూడా అంతే నిజం కదా! పార్టీకి 8:30 కి అలా వెళ్ళాము, ఆ తర్వాత కొద్దిసేపటికే వచ్చేసాము. పార్టీ నుంచి బయటికి వచ్చిన అమ్మాయిలలో ఒక అమ్మాయి వైట్ డ్రెస్ వేసుకొని వచ్చింది, ఆ అమ్మాయి హైటు నా హైటు మ్యాచింగ్ అవ్వదు, ముఖ్యంగా నేను బ్లాక్ డ్రెస్ వేసుకున్నాను. అక్కడ ఎవరో ఒక అమ్మాయిని చూపించి అక్కడ ఉన్నది హేమా హేమా అంటూ చూపించారు. అయితే అక్కడ ఉన్నది నేను కాదు అని నిరూపించుకోవడానికి చాలానే కష్టపడాల్సి వచ్చింది” అని తెలిపింది.

మీడియా చేసిన హంగామా వల్లే పోలీసులు అరెస్టు చేశారు..

Advertisement

“మీడియా వాళ్ళు కూడా ప్రతిసారి హేమ అక్కడ చిక్కింది.. ఇక్కడ చిక్కింది అంటూ చూపించడంతో.. ఈమె తోపు ఏమో అనుకుంటూ పోలీసులు సైతం నన్ను తీసుకువెళ్లారు . బెంగళూరు పోలీసుల కూడా నాకు మూడు నోటీసులు ఇచ్చారు. అందులో రెండు నోటీసులకు నేను అటెండ్ అయ్యాను. ఒకవేళ నేను నిజంగానే తప్పు చేసి ఉంటే నేను ఒక్కదాన్ని వెళ్ళేదాన్ని కాదు కదా, నా దగ్గర పలుకుబడి లేదా.. నా దగ్గర లాయర్లు లేరా ..నా దగ్గర డబ్బు కూడా ఉంది. నేను తప్పు చేయలేదు కనుక ఒంటరిగానే వెళ్లాను” అంటూ తెలిపింది.

ఆ ఒక్కరోజే 450 కాల్స్ వచ్చాయి..

నా స్నేహితులు అయితే మీడియాలో వచ్చిన వార్తలు చూసి వెంట వెంటనే ఫోన్ చేశారు. సుమారుగా 450 కాల్స్ వచ్చాయి. ఒకవేళ నేను ఇలాంటి ఇష్యూలో ఉంటే అసలు ఫోనే లిఫ్ట్ చేయను కదా అంటూ తెలిపింది. ఇక చేయని నేరానికి ఇలాంటి అబాండారాలు వచ్చాయి కదా.. ఈ విషయంపై మీ అభిప్రాయం ఏంటి? అని ప్రశ్నించగా.. ఒక్కొక్కరి స్టూడియోలు కాల్చేద్దాం, యాసీడ్ పోసేద్దాం అన్నట్టుగా అనిపించిందని తెలియజేసింది.

లైవ్ లో సవాల్ విసిరిన హేమ..

Advertisement

ఇక మీరు పార్టీలో డ్రగ్స్ తీసుకున్నారు అంటే వార్తలు వచ్చాయి కదా అని ప్రశ్నించగా.. నేను పార్టీలో డ్రగ్ తీసుకున్న విషయం అప్పుడే పోలీసులు చెప్పారా మీకు.. అలా అయితే పోలీసులు చెప్పారని మీ దగ్గర సాక్ష్యం ఉంటే చూపించండి.. నేను ఇప్పుడే చేతులు కట్టుకొని క్షమించమని అడిగి, ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను అని లైవ్ లో సవాల్ చేసింది ..ఇక ఆరోజు నేను బిర్యానీ చేస్తూ ఇంట్లో వున్నాను.. లైవ్ పెట్టినా అది ఎప్పటి వీడియోనో ఇప్పుడు పెట్టారు అని అప్పుడు అన్నారు ..కానీ ఇప్పుడు చూపిస్తాను అని ఆమె లైవ్ లో ఇంస్టాగ్రామ్ వీడియో లైవ్ పెట్టటం చూపించింది ..

లైవ్ వీడియోని కూడా తప్పుపట్టారు..

వీడియో 12:30 కి పోస్ట్ చేశాను.మీరు ఈలోగా అది అబద్దం అని వేసేసారు .20వ తారీకు ఈ సంఘటన జరిగితే, నేను 21 ఇంస్టాగ్రామ్ లో లైవ్ పెట్టాను..అది కూడా నమ్మకపొతే ఎలా ,నేను పార్టీ కి వెళ్ళాను..కానీ డ్రగ్స్ తీసుకోలేదు..అన్నది నిజం .అంటే మీరు ఆ టైం లో లైవ్ వీడియోలు చేసి వస్తున్న వార్తని మీరు మార్చాలనుకున్నారా అని అడగ్గా? హేమ నేను పబ్బులకు వెళ్తాను.. క్లబ్బులకు వెళ్తాను అన్న విషయం అందరికీ తెలిసిందే . నాతో ఉన్న నా ఫ్రెండ్స్ నా వాళ్ళందరికీ నేను ఏంటన్నది తెలుసు. కాకపోతే మీడియా వాళ్లకే నేను ఏంటన్నది తెలియక అక్కడ పార్టీలో నేను ఉన్నానని, తెలిసిన వెంటనే నేను డ్రగ్స్ తీసుకున్నానని వేసేసారు. కానీ అది తప్పు.. నేను తీసుకోలేదు.. .నేను అక్కడే ఉండి ఉంటే బయటికి వచ్చిన వాళ్లలో నేను లేను.. చూపించండి కావాలంటే.. అప్పుడు తీసిన వీడియోలు మీ దగ్గర ఉంటాయి కదా.. నేను బయటికి రాలేదు అన్నది నిజం. నేను ఆ టైంలో అక్కడ లేను.

నిజం తెలియకుండా ఎలా ఆరోపిస్తారు?

నేను ఎనిమిదిన్నరకి పార్టీకి వెళ్లాను. కేక్ కట్ చేసే వరకు ఉన్నాను. ఆ తర్వాత ఇంటికి వచ్చేసాను అయినా డ్రగ్స్ తీసుకున్నట్లు నాపై అభియోగాలు చేశారు. బయటకి వచ్చిన ఆడవాళ్లలో అప్పుడు నేను లేను.. ఆ వీడియోనీ నిరూపించండి అని సవాల్ చేసింది .మీరు పార్టీకి వెళ్లడం నిజం ఆ తరువాత పార్టీలో డ్రగ్స్ తీసుకున్న వాళ్ళని పోలీసులు పట్టుకు వెళ్ళడం నిజం. మరి అలాంటప్పుడు బయట మీడియా వాళ్ళు అందులో ఉన్న వాళ్ళందరూ డ్రగ్స్ తీసుకున్నట్టు అనుమానించి పోలీసులు పట్టుకొని వెళ్లారు అని చెప్తారు కదా.. అలానే ఆరోజు అన్ని మీడియా ఛానల్లో వచ్చింది.. కానీ మీరు ఎలా పోలీసులు చెప్పకుండా నేను డ్రగ్స్ తీసుకున్నాను అని అంటారు అంటూ నిలదీసింది .

ఆధారాలు లేకుండా నిందించడం తప్పు..

నేను ఏంటో నాకు తెలుసు ,మీరు చెప్తే తెలుసుకోవాల్సిన పనిలేదు, సమాజానికి డ్రగ్స్ తో ప్రాబ్లం గానీ హేమతో ప్రాబ్లం కాదు కదా ,ఆరోజు ఎంతోమందిని పోలీసులు తీసుకెళ్లారు,మీడియా వాళ్ళు ఎంతోమంది ఆ రోజు నాకు ఫోన్ చేశారు. రికార్డ్ చేసారు. తెలియనివాళ్లు నా ఫోన్ నంబర్ కోసం కాలనీ వాళ్లు అడిగి తెలుసుకున్నారు. కానీ ఆ రోజు ఇలానే ధైర్యంగా మాట్లాడాను. ఇప్పుడు ఇలానే మాట్లాడుతున్నాను అని హేమ తెలిపింది. నేనేంటన్నది అందరికీ తెలుసు మీడియా వాళ్ల వల్లే అందరూ నా మీద బురద జల్లేలా చేశారు. మీడియా వాళ్ల వల్లే నా పరువు అంతా పోయింది .

రిపోర్టులు రాకుండానే పాజిటివ్ అని వేసేశారు..

పోలీసులు నన్ను తీసుకువెళ్లి టెస్ట్ చేసినప్పుడు మీరు అక్కడికి వచ్చారు . మీడియా వాళ్ళు, పోలీసులు రిపోర్ట్ ఇవ్వకముందే పాజిటివ్ వచ్చేసింది అని టెలికాస్ట్ చేసేశారు. అప్పుడు నేను మీడియా ముందుకు వచ్చి చెప్పాను. నా టెస్టులు ఇప్పుడు చేస్తుంటే పాజిటివ్ వచ్చినట్టుగా మీడియాలో ఎలా పబ్లిష్ చేస్తారు అని.. నేను ఆరోజు ప్రశ్నించాను. ఏదైనా టెస్ట్ చేస్తే 15 రోజులు పడుతుంది రిపోర్ట్స్ రావడానికి.. అలాంటిది టెస్ట్ చేసిన రోజే పాజిటివ్ అని టీవీలో రావడం నిజంగా చాలా బాధాకరం అని ,ఫేక్ వార్తలు ప్రచారం చేశారు. నిజంగా అలాంటిదే ఏదైనా ఉంటే ఇంత ధైర్యంగా మాట్లాడను కదా.. నా మీద ఎందుకు అలాంటి ఫేక్ వార్తలు ప్రచారం చేశారు.. ఇప్పుడు మీరు చెప్పండి అలాంటిది చేయొచ్చా, ఒక నిమిషం ఆలోచించి బయటికి వచ్చిన వాళ్లలో అమ్మాయి ఉందా? లేదా ? అని కనుక్కొని,ప్రసారం చేయాలి కానీ ఏమీ తెలియకుండానే మీరు అలా ఎలా టీవీలలో వేసేస్తారు అని ప్రశ్నించింది.

చంపేసి.. జైలుకు వెళ్లినా బాగుండేది అనిపించింది..

ఎంతో కష్టపడి మీరు ఇండస్ట్రీకి వచ్చారు . ఇలాంటి ఆరోపణలు ఎదుర్కొన్నప్పుడు మీకు ఎలా అనిపించింది అని అడగ్గా అసలు ఇలాంటి ఆరోపణలు నామీద చేసిన వాళ్ళని మర్డర్ చేసినా తప్పు లేదనిపించింది. చేస్తే జైలుకెళ్తే నా మీద ఆరోపణలు చేసిన వాళ్ళనే కదా నేను మర్డర్ చేసింది అని జైల్లో హ్యాపీగా ఫీల్ అయ్యేదాన్ని ఏమో.. నా ఇన్నర్ ఫీలింగ్ అడిగారు కాబట్టి చెప్తున్నాను.. ఇది ఒకవేళ తప్పయితే క్షమించండి.

ఆ చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారు?

ఇక మొదటి రోజే పోలీసులు పట్టుకెళ్తున్నప్పుడు హేమా డ్రగ్స్ తీసుకుంది అని టీవీలలో వేసేశారు. ఆ తర్వాత మూడో రోజు వచ్చి నన్ను టెస్ట్ లోకి తీసుకువెళ్లారు మొదటి రోజు పాజిటివ్ వేసినప్పుడు మరి మూడో రోజు మళ్ళీ టెస్ట్లకు తీసుకువెళ్లడం ఏంటి అని ఒకసారి కూడా ఆలోచించలేదు. మొదటి రోజే టెస్ట్ చేయకుండానే మీరు డ్రగ్ తీసుకున్నట్లుగా మీడియాలో వేసేస్తే , మరి పోలీసులు నన్ను ఎందుకు మూడో రోజు టెస్టులు చేయడానికి తీసుకెళ్లారు ..ఆ తర్వాత 15 రోజులకు రిపోర్ట్ వచ్చింది దీనికి సమాధానం చెప్పండి అని అడిగారు .

తల్లిని కోల్పోయానన్న ఆవేదన.. కన్నీళ్లు పెట్టుకున్న హేమ.

ఇకపోతే డ్రగ్స్ వివాదం హేమ జీవితంలో తీరని శోకాన్ని మిగిల్చింది. గతంలో బెంగళూరు పబ్ ఉదంతం సమయంలో జరిగిన రచ్చ వల్ల తన తల్లి తీవ్ర మనోవేదనకు గురై చనిపోయారని హేమ ఈ ఇంటర్వ్యూలో వెల్లడించారు. “ఆ తప్పుడు వీడియోలు, వార్తల వల్ల ఇప్పటికే నేను నా తల్లిని కోల్పోయాను. ఇక దయచేసి పాత వీడియోలన్నీ డిలీట్ చేయండి” అని ఆమె ప్రాధేయపడ్డారు. రేపు తన కుటుంబ సభ్యులు,తన మానవడో ,మనవరాలో ఎవరైనా పెద్దైయ్యాక యూట్యూబ్ లో ఆ వార్తలను చూసి,నన్ను ప్రశ్నిస్తే,నేను తట్టుకోలేను.. ఆ బాధ పడకూడదన్నదే నా ఆరాటమని, ఒక తప్పు చేయని మహిళగా తాను అనుభవించిన నరకం వర్ణనాతీతమని ఆమె కన్నీళ్లు పెట్టుకున్నారు.

also read:కుల మతాలకు అతీతంగా పార్థిబన్ కీలక నిర్ణయం.. హాట్ టాపిక్ గా మారిన కోర్టు తీర్పు!

కష్టానికి తగిన ఫలితం..

ఇక ఇప్పుడు డ్రగ్స్ టెస్టులో నెగిటివ్ రావడంతో ఆమె అభిమానులు ఊపిరి పీల్చుకుంటున్నారు. ఎన్ని కష్టాలు ఎదురైనా, తన నిజాయితీని నిరూపించుకోవడానికి ఆమె పోరాడుతున్న తీరు చూసి నెటిజన్లు ఇప్పుడు ఆమెకు మద్దతుగా నిలుస్తున్నారు.

Related News

హిట్ కొట్టిన రోజా,నాగదుర్గ.. పాపం ఐశ్వర్య, లయ!

నేషనల్ అవార్డు విన్నింగ్ పై మెగాస్టార్ ట్వీట్.. నిహారిక క్రేజీ కామెంట్స్!

కన్నీటి పర్యంతమవుతున్న ‘మహారాజ’ బ్యూటీ.. అసలేం జరిగిందంటే?

డ్యాన్స్ మాస్టర్స్ అసోసియేషన్ వివాదం..ఫిలిం ఫెడరేషన్ అత్యవసర సమావేశం!

ఉత్తమ బాలల చిత్రంగా నేషనల్ అవార్డు అందుకున్న తొలి తెలుగు చిత్రం ఏంటో తెలుసా?

నేషనల్ అవార్డ్స్ రేసులో ధనుష్ రికార్డ్… ‘కలాం’ బయోపిక్‌పై హైప్!

ఆ హీరోతో అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్?

Sharmiela mandre :చడీ చప్పుడు లేకుండా పెళ్లి చేసుకున్న అల్లరి నరేష్ హీరోయిన్.. వరుడు ఎవరంటే?

Big Stories

Advertisement
×