E-Paper
Advertisement

కుల మతాలకు అతీతంగా పార్థిబన్ కీలక నిర్ణయం.. హాట్ టాపిక్ గా మారిన కోర్టు తీర్పు!

కుల మతాలకు అతీతంగా పార్థిబన్ కీలక నిర్ణయం.. హాట్ టాపిక్ గా మారిన కోర్టు తీర్పు!
Advertisement

R. Parthiban: కోలీవుడ్ సినీ ఇండస్ట్రీలో దర్శకుడిగా, నటుడిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్న ఈయన ఇటీవల పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) , హరీష్ శంకర్ (Harish Shankar) కాంబినేషన్లో వచ్చిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ప్రీ రిలీజ్ ఈవెంట్లో చేసిన కామెంట్లకు కాంట్రవర్సీ ఎదుర్కొన్న విషయం తెలిసిందే. “నేను నాయుడు గారి అబ్బాయిని” అంటూ స్టేజ్ పైన కులం ప్రస్తావన తీసుకొచ్చి విమర్శలు ఎదుర్కొన్నారు. దీంతో ఆ కామెంట్లకు క్షమాపణలు కూడా చెప్పారు. ఉద్దేశపూర్వకంగా అలా మాట్లాడలేదు. కుల వ్యవస్థను తప్పుపడుతూ ఎన్నో సినిమాలు చేశాను. ఇన్నేళ్ల అనుభవంలో కులం పేరు ప్రస్తావించడం ఇదే మొదటిసారి. మరోసారి ఇలా జరగకుండా జాగ్రత్త పడతాను అంటూ వివరణ కూడా ఇచ్చారు.

నో క్యాస్ట్.. నో రిలీజియన్..

అలాంటి ఈయన ఇప్పుడు అందరికీ షాక్ ఇస్తూ..” నో క్యాస్ట్ నో రిలీజియన్” సర్టిఫికెట్ కోసం మద్రాస్ కోర్టును ఆశ్రయించడం.. దానికి కోర్టు ఇచ్చిన తీర్పు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం.. పార్థిబన్ నో క్యాస్ట్ నో రిలీజియన్ సర్టిఫికెట్ కోసం కోర్టులో పిటిషన్ వేయగా.. మంగళవారం పిటిషన్ విచారించిన కోర్టు ఆయనకు అనుకూలంగానే తీర్పు చెప్పింది. ఈనెల 29 లోపు ఆ సర్టిఫికెట్ జారీ చేయాలని సంబంధిత అధికారులను కూడా కోరుతూ ఆదేశించింది. ఇక తనకు అనుకూలంగా సర్టిఫికెట్ ఇవ్వాలి అని కోర్టు ఆదేశాలు జారీ చేయడంతో సంతోషం వ్యక్తం చేశారు పార్థిబన్.

Advertisement

also read:మెగాస్టార్ మూవీకి ప్రొడక్షన్ తిప్పలు.. అసలేం జరుగుతోంది!

సర్టిఫికెట్ పొందడం వెనుక అసలు కారణం?

ఈ సర్టిఫికెట్ ఆయన ఎందుకు పొందారు? అనే విషయానికి వస్తే ఆయన మాట్లాడుతూ.. “కుల మతాలపై నాకు ఎలాంటి ఆసక్తి లేదు కొంతమందికి వాటిపై బలమైన భావాలుంటాయి. నేను వారిలాంటి వ్యక్తిని కాను. ఇటీవల ఒక ఈవెంట్లో నేను పొరపాటున కులం పేరు ప్రస్తావించాను. ఆ కామెంట్లు చాలామందిని బాధించాయి. ఆ క్షణం నేను కూడా ఎమోషనల్ అయ్యాను. అప్పుడే ఈ నిర్ణయం తీసుకున్నాను. అందుకే నేను ఏ కులానికి, మతానికి చెందిన వాడిని కాదని తెలిపే సర్టిఫికెట్ పొందాలని పిటిషన్ వేశాను. ముఖ్యంగా కుల మతాలు లేని ఒక సరికొత్త సమాజాన్ని సృష్టించే దిశగా నేను వేస్తున్న ఈ అడుగు చాలా ముఖ్యమైనది. ముఖ్యంగా కులం ఆధారంగా చేసుకొని వచ్చే ఏ ప్రయోజనాలు కూడా నాకు అవసరం లేదు. ఒకవేళ ఎవరైనా సామాన్యుడు ఇలాంటి సర్టిఫికెట్ కావాలని కోరుకుంటే.. దాని కోసం కోర్టుకు వెళ్లాల్సిన అవసరం లేకుండా ఈ ప్రాసెస్ మరింత సులభంగా ఉండాలి. అందుకే కుల మతాలకు అతీతంగా కష్టపడి పైకి రావాలని నేను నిర్ణయించుకున్నాను. నా నిర్ణయం వ్యక్తిగత ప్రయోజనాల కోసం మాత్రం కాదు. సమాజంలో కూడా మార్పు రావాలి. కుల మతాలు లేకుండా అందరం ఒక్కటే అనే భావన అందరిలో కలిగితే ఎటువంటి గొడవలకు, కోపతాపాలకు చోటు ఉండదు అంటూ తన అభిప్రాయాన్ని వెల్లడించారు పార్థిబన్ .ప్రస్తుతం ఈయన తీసుకున్న సర్టిఫికెట్, కోర్టు ఈయనకు అనుకూలంగా ఇచ్చిన తీర్పు సమాజ భవిష్యత్తుకు పునాదులు కావాలని ఆశిద్దాం..

Related News

‘స్పిరిట్’ వాయిదా.. ఫ్యాన్స్‌కు కొత్త రిలీజ్ డేట్ ప్రకటించిన సందీప్ రెడ్డి వంగా!

గరివిడి లక్ష్మి సినిమాపై రవితేజ రివ్యూ.. ఏమన్నారంటే?

ఏడేళ్ల వయసులోనే సాఫ్ట్వేర్ సంస్థకు యజమాని.. ‘జైలర్’ బుడ్డోడు చిన్నోడు కాదండోయ్!

‘గరివిడి లక్ష్మి’లో ఆర్పీ పట్నాయక్ పాత్ర వెనుక అసలు కథ ఇదేనా?

క్యాస్టింగ్ కౌచ్‌పై ఝాన్సీ ఏమన్నారంటే.. ఇండస్ట్రీలో మహిళల పరిస్థితి ఇదేనా?

యూత్‌ను టార్గెట్ చేస్తూ వస్తున్న ‘హైకూ’.. అక్టోబర్ 23న థియేటర్లలోకి!

మాల్దీవుల్లో ఖుషీ కపూర్ అందాల సందడి.. ఫ్యాన్స్‌కు ఫుల్ ట్రీట్!

రామాయణంపై రాజమౌళి పోస్ట్.. ఏమన్నారంటే!

Big Stories

Advertisement
×