E-Paper
Advertisement

Actress Himaja: ట్రోలర్స్ కి హిమజా గట్టి కౌంటర్.. ఇన్ డైరెక్ట్ గా చంపేస్తున్నారంటూ!

Actress Himaja: ట్రోలర్స్ కి హిమజా గట్టి కౌంటర్.. ఇన్ డైరెక్ట్ గా చంపేస్తున్నారంటూ!
Advertisement

Actress Himaja:బుల్లితెరపై తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకుని, బిగ్‌బాస్ షోతో మరింత పాపులర్ అయిన నటి హిమజా రెడ్డి(Himaja Reddy) ఇప్పుడు వార్తల్లో నిలిచారు. సోషల్ మీడియాలో తన లగ్జరీ లైఫ్ పట్ల అసభ్యకరంగా కామెంట్స్ చేస్తున్న ట్రోలర్లకు ఆమె చురకలు అంటించారు. తన ఎదుగుదల వెనుక ఉన్న ఏళ్ల కష్టాన్ని, కుటుంబం ఇచ్చిన సపోర్ట్‌ను తక్కువ చేసి మాట్లాడటంపై ఆమె తీవ్రంగా స్పందించారు. “ఎదుటివారి సక్సెస్ చూసి ఏడవకండి” అంటూ తన మార్క్ మాస్ వార్నింగ్‌తో నెటిజన్ల నోళ్లు మూయించారు.

నా కష్టం చూడరు.. కారు గురించే మాట్లాడతారా:

ఇక హిమజ తన సంపాదనపై వస్తున్న విమర్శలను నేరుగా ఎదుర్కొన్నారు. తాను స్క్రీన్ మీద కనిపిస్తున్నానంటే కచ్చితంగా సంపాదిస్తున్నట్టే కదా అని ఆమె ప్రశ్నించారు. కేవలం నటన మాత్రమే కాకుండా, బిగ్‌బాస్ నుండి వచ్చాక దాదాపు 12 షాపింగ్ మాల్ ఓపెనింగ్స్ చేశానని, ఒక్కో ఓపెనింగ్‌కు వచ్చే పారితోషికమే తన కారు కొనడానికి సరిపోతుందని స్పష్టం చేశారు. పగలు రాత్రి కష్టపడి సంపాదించిన డబ్బుతో కొన్న వస్తువులను చూసి, ఎవరో ‘గిఫ్ట్’ ఇచ్చారని కామెంట్స్ చేయడం నీచమని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. తన EMI పేపర్లు కూడా చూపించేందుకు సిద్ధంగా ఉన్నానని చెబుతూ, నెటిజన్ల తీరును తప్పుబట్టారు.

మల్టిపుల్ బిజినెస్ లు.. అమ్మానాన్నల ఆవేదన:

Advertisement

కేవలం సినిమాలు, సీరియల్స్ మీదే కాకుండా తాను మరికొన్ని వ్యాపారాల్లో కూడా ఉన్నానని హిమజ వెల్లడించారు. హెర్బా లైఫ్‌లో సూపర్‌వైజర్‌గా, స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్‌గా పనిచేయడమే కాకుండా.. సొంతంగా ఒక కంపెనీ కూడా ప్రారంభించానని ఆమె తెలిపారు. తాను కొన్న ఇంటి కోసం తన తల్లిదండ్రుల కష్టాన్ని కూడా గుర్తు చేసారు. ఇప్పుడు తన క్యారెక్టర్‌ను కించపరిచేలా కామెంట్స్ చూస్తే అమ్మ నాన్న గుండె పగిలిపోతుందని ఎమోషనల్ అయ్యారు. ఒక తెలుగమ్మాయి కష్టపడి పైకి వస్తుంటే అభినందించాల్సింది పోయి, ఇలా ఏడవడం ఏం సంస్కారమని ఆమె ఘాటుగా ప్రశ్నించారు.

హద్దు మీరితే ఊరుకోను.. మాస్ వార్నింగ్:

ట్రోలర్లు కేవలం కామెంట్లతోనే తనను ‘ఇన్ డైరెక్ట్‌గా చంపేస్తున్నారని’ హిమజ ఆవేదన వ్యక్తం చేశారు. ఇన్నాళ్లు మౌనంగా ఉన్నా, ఇకపై హద్దు మీరితే ఊరుకునే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. తన పర్సనల్ లైఫ్ గురించి, సంపాదన గురించి తప్పుడు ప్రచారం చేసేవారికి బుద్ధి వచ్చేలా ఈ క్లాస్ పీకారు. సెలబ్రిటీల లైఫ్ అంటే కేవలం గ్లామర్ మాత్రమే కాదని, దాని వెనుక ఎన్నో నిద్రలేని రాత్రులు, కష్టార్జితం ఉంటుందని ఆమె అందరికీ గుర్తు చేశారు. ఇకనైనా తన మీద పడి ఏడవడం మానేసి, పాజిటివ్‌గా ఉండటం నేర్చుకోమని హితవు పలికారు.

Advertisement

 

also read: Balakrishna: ఫ్లాప్ డైరెక్టర్ తో బాలయ్య.. అంత నమ్మకమేంటి?

Related News

తెలుగు హీరోలంటే క్రిమినల్స్, స్మగ్లర్స్.. టాలీవుడ్ సినిమాలపై కస్తూరి షాకింగ్ కామెంట్స్!

కళ్ళు చెదిరే అందం.. వరుస ఆఫర్స్.. మరి సక్సెస్ రేట్ ఎక్కడ చిట్టి?

అదంతా ఫేక్ ఎవరు మోసపోవద్దు.. స్కామ్ పై కల్కి 2 టీమ్ క్లారిటీ!

సరికొత్త రికార్డు సృష్టించి’ఏష నాగుల’…తొలి తెలుగు పాటగా !

విడాకులు తీసుకున్న దునియా విజయ్.. భరణం తెలిస్తే షాక్!

ఎన్టీఆర్ డ్రాగన్ లో బాలీవుడ్ స్టార్స్… ఏం ప్లాన్ చేస్తున్నావ్ నీల్?

RC16పై మాస్ అప్డేట్..చరణ్–సుకుమార్ మూవీ గ్రాండ్ లాంచ్ ఎప్పుడో తెలుసా?

క్యాస్టింగ్ కౌచ్ పై పొలిమేర బ్యూటీ హాట్ కామెంట్స్.. చాలా ఇబ్బంది పెట్టేవారు?

Big Stories

Advertisement
×