E-Paper
Advertisement

Meenakshi Chaudary: డాక్టర్ అయ్యాను.. యాక్టర్ అయ్యాను..ఇక టార్గెట్ అదే..

Meenakshi Chaudary: డాక్టర్ అయ్యాను.. యాక్టర్ అయ్యాను..ఇక టార్గెట్ అదే..
Advertisement

Meenakshi Chaudary: మీనాక్షి చౌదరి తెలుగు సినీ ప్రేక్షకులకు పరిచయం అవసరం లేని పేరు. ఇచట వాహనములు నిలపరాదు అనే సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు హీరోయిన్గా పరిచయమైన ఈమె తదుపరి టాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస సినిమా అవకాశాలను అందుకుంటు కెరియర్ పరంగా బిజీగా ఉన్నారు. గోట్, లక్కీ భాస్కర్, సంక్రాంతికి వస్తున్నాం వంటి బ్యాక్ టు బ్యాక్ సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన మీనాక్షి చౌదరి (Meenakshi Chaudhary)ప్రస్తుతం తెలుగు, తమిళ భాషలలో మాత్రమే కాకుండా బాలీవుడ్ సినిమా అవకాశాలను అందుకుంటూ బిజీగా గడుపుతున్నారు.

అనగనగా ఒక రాజు ..

ఇక ఈ సంక్రాంతి పండుగను పురస్కరించుకొని మీనాక్షి చౌదరి నటించిన అనగనగా ఒక రాజు (anaganaga Oka Raju)సినిమా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది. గత ఏడాది సంక్రాంతికి వస్తున్నాం అంటూ సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈమె సూపర్ హిట్ సినిమాని తన ఖాతాలో వేసుకున్నారు. ఇక ఈ ఏడాది సంక్రాంతి సందర్భంగా అనగనగా ఒక రాజు అనే ఫ్యామిలీ ఎంటర్టైనర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సినిమా జనవరి 14వ తేదీ విడుదల కాబోతున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలను కూడా నిర్వహిస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా మీనాక్షి వరుస ఇంటర్వ్యూలకు హాజరవుతున్నారు.

డెంటిస్ట్ గా మీనాక్షి చౌదరి..

Advertisement

ఈ నేపథ్యంలోనే ఒక ఇంటర్వ్యూ సందర్భంగా ఈమె తన కెరియర్ గురించి ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. మీనాక్షి చౌదరి యాక్టర్ అవడం కంటే ముందుగా డాక్టర్ అయిన విషయం తెలిసిందే. ఈమె డెంటిస్ట్ అనే సంగతి అందరికీ తెలుసు. అయితే డాక్టర్ అవ్వాలనుకొని పొరపాటున యాక్టర్ అయ్యారా? అసలైన ప్రొఫెషన్ ఏది అంటూ ఈమెకు ప్రశ్న ఎదురయింది. తాను చదువు పరంగా డాక్టర్ అయినప్పటికీ వృత్తిపరంగా మాత్రం నటిగా కొనసాగుతున్నానని తెలియజేశారు.

నా టార్గెట్ ఐపీఎస్..

Advertisement

నిజానికి తనకు మూడు డ్రీమ్స్ ఉండేవి మిస్ ఇండియా అవాలనుకున్నాను ఆ కోరిక నెరవేరింది. ఆ తర్వాత డాక్టర్ అవ్వాలనుకున్న అది కూడా తీరిపోయింది అయితే నేను కాలేజీ చదివే సమయంలోనే గ్రూప్స్ కి కూడా ప్రిపేర్ అయ్యానని ఐపీఎస్(IPS) కావాలన్నదే నా టార్గెట్ అంటూ ఈవెంట్ తెలియజేశారు కానీ అనుకోకుండా మిస్ ఇండియా తరువాత మోడలింగ్ రంగంలో బిజీగా మారిపోయాయని తద్వారా సినిమా అవకాశాలు కూడా రావడంతో ప్రస్తుతం ఇండస్ట్రీలో బిజీగా ఉన్నానని మీనాక్షి చౌదరి తెలియజేశారు. ఇలా నటిగా కూడా నా డ్రీమ్ నెరవేరిందని ఇక తన టార్గెట్ ఐపీఎస్ మాత్రమే అంటూ ఈ సందర్భంగా ఈమె చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.. మీనాక్షి చేసిన ఈ కామెంట్లపై నెటిజన్లు కూడా స్పందిస్తూ ఈమె టార్గెట్ చేరుకోవాలి అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇక అనగనగా ఒక రాజు సినిమా విషయానికి వస్తే నవీన్ పోలిశెట్టి మీనాక్షి చౌదరి హీరో హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమా కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

Also Read:  Mega 158:  మెగా158 కోసం రాంచరణ్ మ్యూజిక్ డైరెక్టర్.. హీరోయిన్ గా స్టార్ బ్యూటీ?

Related News

హైదరాబాద్‌లో ‘వైఫ్ ఎక్స్ఛేంజ్’ కల్చర్ ఉందంటూ హీరోయిన్ మాధవీలత సంచలన వ్యాఖ్యలు!

మగాళ్ల హత్యల పై షాకింగ్ కామెంట్స్.. కొడుకు కోసం ఆందోళన పడుతున్న కాజల్..

నేను దేశ ద్రోహిని కాదు.. బీజేపీ తీరుపై నటుడు నరేష్ ఫైర్..

హిట్ కొట్టిన రోజా,నాగదుర్గ.. పాపం ఐశ్వర్య, లయ!

నేషనల్ అవార్డు విన్నింగ్ పై మెగాస్టార్ ట్వీట్.. నిహారిక క్రేజీ కామెంట్స్!

కన్నీటి పర్యంతమవుతున్న ‘మహారాజ’ బ్యూటీ.. అసలేం జరిగిందంటే?

డ్యాన్స్ మాస్టర్స్ అసోసియేషన్ వివాదం..ఫిలిం ఫెడరేషన్ అత్యవసర సమావేశం!

ఉత్తమ బాలల చిత్రంగా నేషనల్ అవార్డు అందుకున్న తొలి తెలుగు చిత్రం ఏంటో తెలుసా?

Big Stories

Advertisement
×