Dog Attack: శ్రీసత్యసాయి జిల్లా మదూడి గ్రామంలో దారుణమైన ఘటన చోటుచేసుకుంది. కాలనీలో పెంచుతున్న ఓ పెంపుడు కుక్క ఆకస్మాత్తుగా రెచ్చిపోయి గ్రామంలోని పలువురిపై దాడి చేసింది. ఒక్కసారిగా జరిగిన ఈ ఘటనతో గ్రామస్తులు భయాందోళన చెందారు. ఈ దాడిలో ఏకంగా ఎనిమిది మంది గ్రామస్తులు ఉండగా.. వారిలో చిన్న పిల్లలు కూడా ఉండడం పరిస్థితి మరింత తీవ్రంగా మారింది.
కుక్క దాడి కారణంగా గాయపడిన వారిలో కొందరికి తీవ్ర గాయాలు కావడంతో వెంటనే వారిని సమీప ఆసుపత్రికి తరలించారు. పిల్లలు గాయపడటంతో గ్రామస్తుల్లో ఆందోళనతో పాటు ఆగ్రహం కూడా చెలరేగింది. పెంపుడు జంతువును సరిగా నియంత్రించడంలో యజమాని నిర్లక్ష్యం వహించాడన్న భావన గ్రామంలో బలంగా వ్యక్తమైంది.
దీంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన గ్రామస్తులు ఆ కుక్కను కొట్ట చంపేశారు. అడ్డొచ్చిన కుక్క యజమానిపై కూడా గ్రామస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామస్తులు కోపాన్ని, ఆవేశాన్ని చూసి యాజమాని కూడా ఏమీ మాట్లాడలేని పరిస్థితిలో సైలెంట్ అయిపోయాడు.
8 మందిపై కుక్క దాడి.. కొట్టి చంపిన గ్రామస్తులు
శ్రీ సత్యసాయి జిల్లా అగళి మండలం మదూడి ఎస్సీ కాలనీలో విషాదం చోటుచేసుకుంది. ఒక పెంపుడు కుక్క ఒక్కసారిగా ఉగ్రరూపం దాల్చి కాలనీలోని 8 మందిపై విచక్షణారహితంగా దాడి చేసి గాయపరిచింది. కుక్క దాడితో ఆగ్రహానికి లోనైన స్థానికులు, ప్రాణరక్షణ… pic.twitter.com/liCDkMg5zP
— ChotaNews App (@ChotaNewsApp) January 7, 2026