Actress Mirchi Madhavi: తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో కొంతమంది క్యారెక్టర్ ఆర్టిస్టులు ఉన్నారు. అందులో మిర్చి మాధవి ఒకరు. ఈమె ఎన్ని సినిమాలు చేసినా కూడా కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన మిర్చి సినిమా మంచి గుర్తింపు తీసుకొచ్చింది. మంచి ఎడ్యుకేషనల్ బ్యాక్ గ్రౌండ్ కూడా ఈమెకు ఉంది. అయితే సినిమా పరిశ్రమలో ఎప్పుడూ కొన్ని కామెంట్స్ వినిపిస్తూ ఉంటాయి. కాస్టింగ్ కౌచ్, కమిట్మెంట్ అనే పదాలు ఎప్పటినుంచో వింటూ వస్తున్నాం. ఇప్పటికి కూడా చాలామంది కమిట్మెంట్ అడుగుతున్నారు అని చెబుతూనే ఉంటారు.
ఇక రీసెంట్ గా మిర్చి మాధవి ఒక ప్రముఖ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇస్తూ ఫిల్మ్ ఇండస్ట్రీలో తనకు జరిగిన అనేక దారుణమైన సంఘటనలను బయటకు చెప్పారు. ప్రస్తుతం తనకు సినిమాల్లో కంటే కూడా సీరియల్స్ లోనే ఎక్కువ డిమాండ్ ఉంది అని చెప్పారు. చాలామంది క్యారెక్టర్ కోసం ఆఫీస్ కి వెళ్తే బాగా లావు అయిపోయారండి. అయ్యో మాధవి గారు మీరు నాకు తెలుసండి అని చెబుతూ ఉంటారు. ఎవరైనా నేను తెలియదు అని చెబితే కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతాను.
మాధవి మాట్లాడుతూ.. 12 సంవత్సరాల క్రితం ఒక దర్శకుడు నేను ఇంకో ఆఫీస్ పెట్టలేదు మీ ఇంటికి వచ్చి కలిసి ఒకసారి మాట్లాడుతాను అని చెప్పారు. సరే రండి సార్ అని చెప్పాను. అతను వచ్చారు నేను అప్పుడు పంజాబీ డ్రెస్ లో ఉంటే అటు ఇటు నడవండి అని నడిచి చూపించాడు.
ఆడిషన్ అంటే ఇలానే ఉంటుందేమో అనుకొని నేను అటు ఇటు నడిచి చూపించాను. తర్వాత సారి వేసుకుని రండి అని చెప్పారు. నేను కాటన్ సారీ వేసుకొని వచ్చాను. కొంచెం మీ నడుము చూపిస్తారా అని అడిగారు. అలా అడిగిన వెంటనే చెప్పు తీసుకొని కొడతా బయటికి పో అని చెప్పాను. అలా చెప్పి బయటకు గెంటేసాను నేను అలా షాక్ లో ఉండిపోయా
అసలు ఆ డైరెక్టర్ ఏమనుకున్నాడు, ఇంట్లో ఎవరూ లేరు అని అనుకున్నాడా.? నేను ఇదే మాట మా అమ్మకు చెప్తే కింద వాచ్మెన్ ఉన్నాడు. పట్టుకొని ఉంచండి వాళ్ళని పిలుద్దాము. ఎందుకట్లా రానిచ్చావు అని మా అమ్మ అడిగింది. తెలియనితనంలో అలా పిలవడం వలన భయపడిపోయాను.
నేను చాలా భయంతో ఉండిపోయాను. తలుపు వేసి ఏమైనా చేసి ఉంటే ఏంటి పరిస్థితి ఇంట్లో ముగ్గురం ఆడవాళ్ళమే ఉన్నాం. అని చాలా భయపడిపోయాను. అలాంటి ఎక్స్పీరియన్స్ ఇంకెప్పుడూ జరగలేదు అది మాత్రం జీవితంలో మర్చిపోలేను అని మిర్చి మాధవి చెప్పారు.
అలానే 100% లవ్ సినిమా తర్వాత భాస్కర్ అనే వ్యక్తి ఫోన్ చేసి ప్రకాష్ రాజ్ పక్కన క్యారెక్టర్ ఉంది. మేము ఐదుగురుము ఉన్నాము కమిట్మెంట్ కి ఓకే అయితే మీకు క్యారెక్టర్ కన్ఫర్మ్ అయిపోయినట్లే అని చెప్పాడు. సారీ అండి నేను ఇంకా అలాంటి దాన్ని కాదు ఒకవేళ అదే టైప్ అయితే ఆ పని చేసుకునేదాన్ని కదా డబ్బులు ఇంకా ఎక్కువ వస్తాయని చెప్పేశాను అని చెప్పారట మాధవి.
Also Read: Bigg Boss 9 Promo : నీ గేమ్ ఏముందో రీతూ? పవన్ తో ప్యాచప్ అవుతావ్, మరోసారి సంజన వర్సస్ రీతు