Jailer Artist : టాలెంటు ఎవడికి సొత్తు కాదు అని ఇప్పటికే ఎంతోమంది అంటూ ఉంటారు. టాలెంట్ కి వయసుకి సంబంధం లేదు అని మరి కొంతమంది నిరూపించిన విషయం కూడా తెలిసిందే.. ఇదంతా ఇప్పుడు ఎందుకు చెబుతున్నారు అని చాలామందికి డౌట్ రావచ్చు. నిజానికి అంత పెద్ద డౌట్ రావడానికి అనేక సందర్భాలు కూడా ఉన్నాయి. వయసుతో సంబంధం లేకుండా టాలెంట్ ని నమ్ముకొని చాలామంది ఇప్పుడు అందరినీ ఔరా అనిపిస్తున్నారు. తాజాగా రజినీకాంత్ సినిమాలో నటించిన ఓ బుడ్డోడు బ్యాక్ గ్రౌండ్ ఇప్పుడు అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఆ బుడ్డోడు గురించి హీరోయిన్ మీర్న మీనన్ కూడా సంచలన విషయాలు బయటపెట్టడంతో ప్రస్తుతం అతడి గురించి సోషల్ మీడియాలో చర్చలు మొదలయ్యాయి. ఇంతకీ ఆ బుడ్డోడి బ్యాగ్రౌండ్ ఏంటి? అందరినీ ఆశ్చర్యపరిచేలా అతను ఏం చేస్తున్నాడు అన్నది కాస్త వివరంగా తెలుసుకుందాం..
జైలర్ సినిమాలో రజనీకాంత్ మనవడి పాత్రలో నటించిన ఏడేళ్ల కుర్రాడి గురించి ఇప్పుడు ఆసక్తికరమైన చర్చ నడుస్తుంది. చూడడానికి అతి చిన్న వయసులో ఉన్న పిల్లాడే కానీ అతని బ్యాగ్రౌండ్ మాత్రం నిజంగానే అందరిని అవాక్కయ్యేలా చేస్తుంది. అసలు ఈ బుడ్డోడు ఇంత టాలెంటెడ్ గా ఉన్నాడు ఏంటి అని అందరికీ ఆశ్చర్యం కూడా కలుగుతుంది. ఎందుకంటే అతనికి ఒక సాఫ్ట్వేర్ కంపెనీ ఉందని, యూట్యూబ్ ఛానల్ ని కూడా సొంతంగా నడుపుతున్నాడని క్రేజీ హీరోయిన్ మీనా మీనన్ బయట పెట్టడంతో ఇతని గురించి మరోసారి వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇదే హార్ట్ టాపిక్ గా మారింది. ఏడేళ్ల వయసులో ఆడుకోవాల్సిన పిల్లలు ఇలా అద్భుతాలు సృష్టించడంతో రజనీకాంత్ అభిమానులు ఆ కుర్రాడి గురించి ముచ్చటిస్తూ ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇంత చిన్న వయసులోనే అంత సాహసం చేస్తున్నాడు కాబట్టి పెద్దయిన తర్వాత ఇంకా గొప్పవాడు అవుతాడు అంటూ సోషల్ మీడియా వేదికగా కామెంట్లు పెడుతున్నారు.
తమిళ సూపర్స్టార్ రజనీకాంత్ నటించిన జైలర్ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకోవడంతో ఆ సినిమాకి సీక్వెల్ గా వచ్చిన జైలర్ 2 సినిమా కూడా బాక్స్ ఆఫీస్ వద్ద సందడి చేస్తుంది. ఇటీవలే రిలీజ్ అయిన ఈ సినిమా తమిళ ప్రేక్షకులతో పాటుగా తెలుగు ప్రేక్షకులను కూడా బాగా ఆకట్టుకుంటూ వస్తుంది. మొదటి భాగం కన్నా రెండో భాగం ఆసక్తికరంగా ఉండడంతో ఈ సినిమాకు మొదటి రోజు నుంచే మంచి కలెక్షన్స్ కూడా వసూల్ అవుతున్నాయని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇకపోతే ఈ సినిమాకు సీక్వల్ గా జైలర్ 3 కూడా రాబోతుంది అని అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే.. త్వరలోనే ఆ సినిమా గురించి పూర్తి వివరాలను వెల్లడించే అవకాశం ఉందని ఫిలింనగర్ లో ఒక టాక్ వినిపిస్తుంది. మరి రజినీకాంత్ ఈ సినిమా తర్వాత ఇంకా ఎలాంటి సినిమాలు చేస్తారు అన్నది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది..