Gautam Gambhir Shocking Reaction Naman Dhir: టీమిండియా వర్సెస్ వెస్టిండీస్ మధ్య చిన్నస్వామి స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్ రద్దు అయినప్పటికీ… స్టేడియానికి వచ్చిన అభిమానులకు యంగ్ క్రికెటర్ నమన్ ధీర్ (Naman Dhir) అదిరిపోయే ట్రీట్ ఇచ్చాడు. ఆరో వికెట్ కు బరిలోకి దిగిన నమన్… 400 స్ట్రైక్ రేట్ తో ఇరగదీశాడు. మూడు సిక్సర్లు, ఓ బౌండరీ తో కేవలం ఆరు బంతుల్లోనే 24 పరుగులు పిండుకున్నాడు. ఈ క్రమంలోనే నమన్ ధీర్ కొట్టిన సిక్సర్లు చూసి డగౌట్ లో కూర్చున్న టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ( Gautam Gambhir ) కూడా షాక్ అయ్యాడు. ఇన్ని రోజులు ఎక్కడ దాక్కున్నావ్ రా ? మంచినీళ్లు తాగినంత ఈజీగా సిక్సర్లు కొట్టేస్తున్నావ్ ? అంటూ బిత్తర పోయాడు. ఈ క్రమంలో గౌతమ్ గంభీర్ రియాక్షన్స్ వైరల్ గా మారాయి.
టీమిండియా వర్సెస్ శ్రీలంక మధ్య చిన్నస్వామి స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్ సందర్భంగా కీమా పాల్ బౌలింగ్ లో నమన్ ధీర్ దుమ్ము లేపాడు. ఈ టోర్నమెంట్లో టీమిండియా ప్లేయర్లను రెచ్చగొడుతూ వికెట్లు పడగొట్టిన కీమా పాల్ ను నమన్ ధీర్ కావాలనే టార్గెట్ చేశాడు. అతని బౌలింగ్ లో రెండు సిక్సర్లతో పాటు ఓ బౌండరీ బాది చుక్కలు చూపించాడు. కీమా పాల్ బౌలింగ్ లో నమన్ ధీర్ సిక్సర్లు కొట్టినందుకు గౌతమ్ గంభీర్ ఫుల్ హ్యాపీ అయినట్టు వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఇది ఇలా ఉండగా చిన్నస్వామి స్టేడియం వేదికగా నిన్న జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా అర్ధాంతరంగా రద్దయింది. మధ్యలో వర్షం తగ్గి మ్యాచ్ 9 ఓవర్లకు కుదించినప్పటికీ ఫలితం దక్కలేదు. టీమిండియా 7 ఓవర్లు బ్యాటింగ్ చేసేసరికి మళ్ళీ వర్షం పడింది. దీంతో మ్యాచ్ నిర్వహించలేని పరిస్థితులను గమనించిన అంపైర్లు రద్దు చేస్తూ ప్రకటన చేశారు. సిరీస్ 2-2 తేడాతో సమం అయింది.
టీమిండియాలోకి కొత్తగా వచ్చిన నమన్ ధీర్ ( Naman Dhir) మంచి ఆల్ రౌండర్. పంజాబ్ రాష్ట్రంలో పుట్టి పెరిగిన ఇతడు… ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ ద్వారా వెలుగులోకి వచ్చాడు. ముంబై ఇండియన్స్ తరఫున అద్భుతంగా రానించి టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చాడు. కుడి చేతి వాటం బ్యాటింగ్ తో పాటు ఆఫ్ బ్రేక్ బౌలింగ్ చేస్తాడు. టీమిండియాలో రవీంద్ర జడేజా స్థానాన్ని భర్తీ చేసేందుకు నమన్ ధీర్ ను తీసుకువచ్చారు. దానికి తగ్గట్టుగానే వెస్టిండీస్ టూర్ లో అద్భుతంగా రానిస్తున్నాడు.
– Batting like Hardik Pandya.
– Bowling like Peak Ravindra Jadeja.
– Helmet Inside look like Virat Kohli.GAUTAM GAMBHIR REACTION ON NAMAN DHIR HARD HITTING 🔥 pic.twitter.com/P1srofi1gb
— Sam (@cricsam02) October 17, 2026