Gundeninda GudiGantalu Today episode October 18th : రోహిణి ఎలాగైనా సరే చీకట్లో వీళ్ళకి కనిపించకుండా వెళ్ళిపోవాలి అని అనుకుంటుంది. అయితే మనోజ్ వెనకాల నుంచి వెళ్ళిపోతూ ఉండగా మనోజ్ కి తగలడంతో దొంగ దొంగ అంటూ రోహిణి పట్టుకొని గట్టిగా అందరు కొట్టేస్తారు. ఫీజు పెట్టడానికి వెళ్లిన బాలు దాని పెట్టగానే కరెంట్ వస్తుంది అయితే ఆ దొంగని రోహిణి అని తెలుసుకుని ఏంటి నువ్వే దొంగతనానికి వచ్చావా అని శృతి అంటుంది నేను దొంగతనానికి కాదు పైనుంచి కిందకి వచ్చాను ఫోన్ కిందపడితే తీసుకుంటూ ఉండగా మనోజ్ కి తగిలింది దాంతో మనోజ్ నన్ను దొంగ దొంగ అని కొట్టాడు అని చాలా ఫీల్ అవుతుంది. అయితే ఇందాక అలా వెళ్ళింది కూడా నువ్వేనా అంతే లేదు నేను ఎక్కడికి వెళ్ళలేదు నేను ఇప్పుడే పైనుంచి వస్తున్నాను అని రోహిణి అంటుంది అయితే అందరూ నిజమే అని అనుకుంటారు.
బాలుకి ఏదైనా జరుగుతుందేమో అని మీన మాత్రం టెన్షన్ పడిపోతూనే ఉంటుంది. బాలుని ఎలాగైనా కాపాడుకోవాలి ఆయనకి ఏం కాకుండా చూసుకోవాలి అని కంగారు పడిపోతూనే ఉంటుంది. అయితే బాలు మాత్రం మీనాని ఆ ఆలోచన నుంచి పక్కకు తీసుకొని రావాలని చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. అప్పుడే చింటూ దగ్గరికి వెళ్ళేసి వస్తాము అని అంటారు కానీ కారుకిస్ కనిపించలేదు అని వెతుకుతూ ఉండగా మనోజ్ ఇక్కడే ఉన్నాయి రా అని తెచ్చి ఇస్తాడు. ఇక అందరూ కలిసి చింటు దగ్గరికి ఎందుకు అని అడుగుతారు కానీ బాలు ఆ సుగుణమ్మ దగ్గరికి వెళ్లి ఆ బాబును తీసుకొని వస్తాము అని అంటారు.
రోహిణి మీద అందరికీ అనుమానం వస్తుంది కానీ ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చేస్తుంది. అయితే రోహిణి అలా చేయడంపై అందరూ ఏదో ఒకటి అనుకుంటూనే ఉంటారు. ఎలాగైనా సరే రోహిణి ఏదో చేసింది అని మీనాకి కూడా అనుమానం వస్తుంది. ఇక అందరూ పడుకున్న తర్వాత రోహిణి తన గదికి మెల్లగా వెళుతుంది అక్కడే కూర్చుని ఉన్న మనోజ్ కి అనుమానం వస్తుంది. ఏం జరిగింది ఎందుకు నువ్వు వెళ్ళావ్? ఏం పని చేయడానికి వెళ్లావు నువ్వు అని ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తాడు. మీ అరుపులు వినే నేను కిందికి వచ్చాను నీ వల్ల నేను కిందపడ్డాను అందరు నన్ను కొట్టారు అని అనగానే సంతోషం ఎప్పుడో కొట్టాల్సింది ఇప్పుడు కొట్టారు అని మనోజ్ అనగానే రోహిణి నేనంటే నీకు ఆ మాత్రం కూడా ఇష్టం లేదా అని అంటుంది.
రోహిణి పైనుంచి రావాలి కానీ పైకి ఎక్కుతూ ఉన్నప్పుడు మనోజ్ గాడు పట్టుకున్నాడు కదా.. అని అనుమానం వ్యక్తపరుస్తాడు. అయితే మనోజ్ పొరపాటున అలా అనుకున్నాడా లేకపోతే పార్లర్ పైనుంచి వచ్చిందా అన్నది నాకు చాలా తేడాగా ఉంది రోహిణి మీద నాకు అనుమానం ఇంకాస్త పెరిగిపోతుంది అని బాలు అంటాడు. అయితే మీనా మాత్రం ఊరుకోండి మీరు మీ అనుమానాలు రోహిణి ఏదో దాస్తుందని తెలుస్తుంది కానీ మరి ఇలా దొంగగా ఏదో ఒక చేస్తుందని నేను అసలు ఊహించలేదు అని అంటుంది మరి నిజంగానే రోహిణి ఏదో దాస్తుందని బాలుకి కూడా అనుమానం వస్తుంది. మరి ఏం జరుగుతుంది అన్నది ముందు ముందు ఎపిసోడ్లో తెలిసే అవకాశం ఉంది.
ఉదయం లేవగానే బాలు మీనా రెడీ అయ్యి బయటికి వెళ్తూ ఉండగా ప్రభావతి ఆపి ఎక్కడికి వెళ్తున్నారు? ఇద్దరు కలిసి వెళ్తున్నారంటే ఏదో చేస్తున్నారని అర్థమైంది ఎక్కడికి వెళ్తున్నారు అని అడ్డుపడి అడుగుతుంది ఇవాళ చింటూ వాళ్ళ స్కూల్ కి వెళ్తున్నాను వాళ్ళ అమ్మతో మాట్లాడటానికి అని బాలు అనగానే రోహిణి టెన్షన్ పడిపోతూ ఉంటుంది. బాలు బయటికి వెళ్లే ముందు తన కారు కేసు ఎక్కడో పడిపోయాయని వెతుకుతూ ఉంటాడు అయితే మనోజ్ ఒక చివర కార్ కిస్ కనిపించడంతో దాన్ని తీసుకొని మరి ఇక్కడే ఉన్నాయి రా అని ఇస్తాడు బయటికి వెళ్ళగానే కారుని చెక్ చేస్తున్న బాలుని చూసి గుణ మనుషులు ఒకవేళ డిక్కీ ఓపెన్ చేస్తే మనం దొరికిపోతామేమో అని ఆలోచిస్తూ ఉంటారు. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది మరి బాలు నిజంగానే అడిగి ఓపెన్ చేసి తనని తాను కాపాడుకుంటాడా లేదా అడ్డంగా ఇరుక్కుంటాడు అన్నది సోమవారం ఎపిసోడ్లో మిస్ అవ్వకుండా చూడాల్సిందే..
Also Read :Podarillu Today Episode : నారాయణకు అడ్డంగా దొరికిన జమున.. కన్నా సీరియస్.. ఇదేం ట్విస్ట్..