Ram Charan- Bunny: తెలుగు సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోలుగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో నటుడు రామ్ చరణ్, (Ramcharan)అల్లు అర్జున్(Allu Arjun) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మెగా హీరోలుగా ఇండస్ట్రీలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్న ఈ ఇద్దరు హీరోలు ప్రస్తుతం పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు సంపాదించుకొని వరుస సినిమాల షూటింగ్ పనులలో బిజీగా ఉన్నారు. అయితే ఇటీవల కాలంలో రామ్ చరణ్అ, ల్లు అర్జున్ మధ్య పెద్దగా మాటలు లేవని తెలుస్తోంది. అయితే ఈ దూరం ఇప్పటికి కాదని సుమారు 18 సంవత్సరాల నుంచి ఈ ఇద్దరి మధ్య సరిగ్గా మాటలు లేవని సమాచారం. అయితే రామ్ చరణ్, అల్లు అర్జున్ మధ్య ఇలాంటి దూరం పెరగడానికి ఒక హీరోయిన్ కారణం అంటూ ఒక వార్త చక్కర్లు కొడుతుంది.
నేహా శర్మ ప్రేమ ప్రేమలో అల్లు అర్జున్?
రామ్ చరణ్ ఎన్టీఆర్ మద్య గొడవకు కారణమైన ఆ హీరోయిన్ ఎవరు? వీరి మధ్య దూరానికి గల కారణం ఏంటి అనే విషయానికి వస్తే .. రామ్ చరణ్ హీరోయిన్ గా చిరుత(Chirutha) అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అయితే ఈ సినిమాలో నేహా శర్మ(Neha Sharma) హీరోయిన్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అయితే ఈ సినిమా షూటింగ్ సమయంలోనే రామ్ చరణ్ ఆమెతో ప్రేమలో పడ్డారని, రహస్యంగా వివాహం కూడా చేసుకున్నారంటూ ఒకానొక దశలో వార్తలు కూడా వచ్చాయి. అయితే రామ్ చరణ్ కంటే ముందుగానే నేహా శర్మ ప్రేమ ప్రేమలో అల్లు అర్జున్ ఉన్నారు. అయితే చరణ్ తో చిరుత సినిమా చేసిన తర్వాత అల్లు అర్జున్ నేహా మధ్య విభేదాలు మొదలయ్యాయని తెలుస్తుంది.
నేహా శర్మ వల్లే విభేదాల?
ఇలా ఇద్దరి మధ్య విభేదాలు రావడానికి కారణం రామ్ చరణ్ అని ఒకానొక సమయంలో వార్తలు వైరల్ అయ్యాయి. ఇక ఈ విషయంలోనే అప్పటినుంచి వీరిద్దరి మధ్య పెద్దగా మాటలు లేవని తెలుస్తోంది. ఇక ఇటీవల ఇద్దరి మధ్య పెద్ద ఎత్తున పోటీ ఏర్పడటమే కాకుండా ఎన్నికల సమయంలో చోటుచేసుకున్న వివాదం కారణంగా అల్లు మెగా కుటుంబం మధ్య దూరం కూడా పెరిగిందని తెలుస్తోంది. ఇక నేహా శర్మ రామ్ చరణ్ గురించి వార్తలు వచ్చిన నేపథ్యంలో ఈ వార్తలపై రామ్ చరణ్ స్పందిస్తూ ఖండించారు.
పాన్ ఇండియా హీరోలుగా గుర్తింపు..
నేహా శర్మ తన గురించి సోషల్ మీడియాలో రూమర్లు వచ్చిన సమయానికే తాను ఉపాసనతో ప్రేమలో ఉన్నానని అయితే ఆమె కూడా ఈ వార్తలను చాలా సరదాగా తీసుకొని కొట్టి పారేసారని తెలిపారు. ఇక ప్రస్తుతం తాను పెళ్లి చేసుకుని వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టాను. ఇలాంటి వార్తలు నా వ్యక్తిగత జీవితానికి ఎంతో ఆటంకాన్ని కలిగిస్తాయని ఈయన ఈ వార్తలను ఖండించారు. ఇక తన తండ్రి కూడా ఈ విషయంపై స్పందిస్తూ సినిమా ఇండస్ట్రీలో ఉన్న సమయంలో ఇలాంటి వార్తలు రావడం సర్వసాధారణమని వీటిని సీరియస్ గా తీసుకోవద్దు అడ్డు సలహాలు కూడా ఇచ్చారని రామ్ చరణ్ గతంలో ఒక ఇంటర్వ్యూ సందర్భంగా తెలియజేశారు. ఇలా 18 సంవత్సరాల క్రితం వీరి మధ్య గొడవలు మొదలయ్యాయి అంటూ తాజాగా మరోసారి ఈ వార్తలు వెలుగులోకి రావడంతో ఇది కాస్త వైరల్ అవుతుంది. ఇక రాంచరణ్ ప్రస్తుతం పెద్ది సినిమా(Peddi Movie) పనులలో ఎంతో బిజీగా ఉండగా అల్లు అర్జున్ పుష్ప2 సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి ప్రస్తుతం అట్లీ డైరెక్షన్లో చేయబోతున్న సినిమా పనులలో బిజీగా ఉన్నారు.
Also Read: Suresh Gopi: అదృశ్యమైన సినీ నటుడు, ఎంపీ సురేష్ గోపీ… ఆచూకీ చెప్పాలంటూ ఫిర్యాదులు!