Mohamed Siraj : టీమిండియా క్రికెటర్ మహ్మద్ సిరాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ముఖ్యంగా ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్ తరువాత సిరాజ్ నిత్యం వార్తల్లో నిలుస్తున్నాడు. దీంతో మహ్మద్ సిరాజ్ పై పలువురు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ముఖ్యంగా అతని ఫిట్ నెస్ కు ఫిదా అయిపోయారు. ఇంగ్లాండ్ సిరీస్ లో టీమిండియా ఈ సిరీస్ ను 2-2తో సమం చేయడంలో తనవంతు పాత్ర పోషించాడు. ఈ సిరీస్ లో మొత్తం 23 వికెట్లతో అత్యధిక వికెట్లు సాధించిన బౌలర్ గా నిలిచాడు. ఈ నేపథ్యంలో అతడు ఏకంగా 185.3 ఓవర్లు బౌలింగ్ చేశాడు. ముఖ్యంగా ఓవల్ లో జరిగిన చివరి టెస్ట్ మ్యాచ్ లో అద్భుతంగా రాణించాడు. ప్రధానంగా 374 పరుగుల లక్ష్య ఛేదనలో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ ను 367 కే కట్టడి చేయడంలో కీలక పాత్ర పోషించాడు.
Also Read : Travis head – SRH Fan: ఆస్ట్రేలియా గడ్డపై SRH ఫ్యాన్స్ రచ్చ చూడండి.. హెడ్ ను అడ్డంగా పట్టుకొని
సిరాజ్ స్టైల్ లో..
తాజాగా సిరాజ్ గురించి ఓ వార్త వైరల్ అవుతోంది. సిరాజ్ ఓవల్ టెస్ట్ లో ఎలా మ్యాజిక్ చేశాడో.. ఓ యువకుడు కూడా అదే స్టైల్ లో యార్కర్ వేసి వికెట్లను పడగొట్టాడు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ అవుతోంది. దీనిని బట్టి చూస్తే.. టీమిండియా బౌలర్ సిరాజ్ ని ఫాలో అయ్యేవారి సంఖ్య భారీగానే ఉందని తెలుస్తోంది. మరోవైపు ఇంగ్లాండ్ ఈ సిరీస్ లో రెండు సార్లు అయిదు వికెట్ల ప్రదర్శనా చేశాడు. ఈ క్రమంలో అతను ఏకంగా 185.3 ఓవర్లు అంటే.. 1113 బంతులు బౌలింగ చేశాడు. ముఖ్యంగా ఓవల్ లో జరిగిన చివరి టెస్ట్ మ్యాచ్ లో అద్భుతంగా రాణించాడు. 374 పరుగుల లక్ష్య ఛేదనతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ ను 367 పరుగులకే కట్టడి చేయడంలో కీలక పాత్ర పోషించాడు. ఈ మ్యాచ్ లో టీమిండియా 6 పరుగుల తేడాతో విజయం సాధించింది.
సిరాజ్ పై ప్రశంసలు
ఇక ఈ మ్యాచ్ లో టీమిండియా తరపున 5 కి ఐదు మ్యాచ్ లు ఆడిన ఏకైక బౌలర్ గా నిలిచాడు సిరాజ్. మరోవైపు ఈ విషయం పై ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ డేవిడ్ గోవర్ సిరాజ్ ని కొనియాడారు. అలాగే సిరాజ్ ఏం తీసుకుంటాడో.. అతను ఏం తింటాడో.. ఏం తాగుతాడో తెలుసుకోవాలనుకుంటున్నానని తన మనస్సులోని మాటను బయటపెట్టాడు. ఈ సిరీస్ విశ్రాంతి తీసుకోకుండా 5 టెస్ట్ మ్యాచ్ ల్లోనూ ఆడాడు. ముఖ్యంగా రెండో ఇన్నింగ్స్ లో 30 ఓవర్లపాటు బౌలింగ్ వేశాడు. అతను అస్సలు తగ్గలేదు. కనీసం అలిసిపోయినట్టు కూడా కనిపించలేదని గోవర్ ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. సిరాజ్ బౌలింగ్ తో పాటు అతని ఫిట్ నెస్ పై కూడా ప్రశంసించాడు. గెలవాలనే సంకల్పం, ఫిట్ నెస్ విషయంలో సిరాజ్ మేటిగా నిలిచాడు. ఇంగ్లాండ్ బౌలింగ్ దళం మాత్రం కొన్ని సంవత్సరాలుగా ఫిట్ నెస్ సమస్యలతో బాధపడుతోంది.
Mohamed Siraj’s Oval magical delivery recreate.. awesome 😃 #Cricket pic.twitter.com/KfEQfD2rMN
— Nibraz Ramzan (@nibraz88cricket) August 11, 2025