Suresh Gopi: సినిమా ఇండస్ట్రీలో కొనసాగి సెలబ్రిటీలు రాజకీయాలలో కూడా తమ హవా కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. ఇలా ఎంతో మంది సెలబ్రిటీలు ఎంపీలుగాను ఎమ్మెల్యేలుగా మంత్రులుగా కొనసాగుతూ ఉన్నారు. ఈ క్రమంలోనే మలయాళ చిత్ర పరిశ్రమకు చెందిన నటుడు సురేష్ గోపి(Suresh Gopi) ప్రస్తుతం కేంద్ర మంత్రిగా బాధ్యతలు తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా కేంద్రమంత్రి కనిపించడం లేదు అంటూ ఫిర్యాదులు రావడంతో ఒక్కసారిగా ఆయన అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అసలు సురేష్ గోపి కనిపించకపోవడం ఏంటీ? అటు ఆరా తీయడం మొదలుపెట్టారు. అసలు ఏం జరిగింది? సురేష్ గోపి కనిపించకపోవడం ఏంటి అనే విషయానికి వస్తే..
కనిపించకుండా పోయిన కేంద్రమంత్రి…
భారతీయ జనతా పార్టీ(BJP) సీనియర్ నాయకుడు, కేంద్ర మంత్రి సురేష్ గోపి తన నియోజకవర్గం, జిల్లా ప్రజలకు అందుబాటులో లేకుండా పోయారు. ఇలా గత కొన్ని నెలలుగా ఈయన నియోజకవర్గ పరిధిలో పర్యటనలు చేయని నేపథ్యంలో కేరళ విద్యార్థి సంఘం (కెఎస్‌యు) నాయకుడు ఆదివారం ఆరోపిస్తూ.. ఎంపీ సురేష్ గోపి కనిపించడం లేదు అంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే ఆయన ఆచూకీ తెలియ చేయాలంటూ ఈ ఫిర్యాదులో పేర్కొన్నారు. సురేష్ గోపి త్రిస్సూర్ లోక్ సభ ఎంపీగా (Thrissure MP)పనిచేస్తున్నారు. అయితే గత మూడు నెలలుగా ఈయన తమ నియోజకవర్గ పరిధిలో కనిపించలేదు.
క్రైస్తవ ఓటర్లను ఆకర్షించడం కోసమే…
ఇటీవల ఛత్తీస్‌గఢ్‌లో కేరళకు చెందిన ఇద్దరు కాథలిక్ సన్యాసినులను అరెస్టు చేయడం జరిగింది అయితే ఈ అరెస్టు గురించి కూడా సురేష్ గోపి ఎక్కడ స్పందించడం లేదు. ఇలా ఈయన మౌనం వహించిన నేపథ్యంలో అసలు ఈయన నియోజకవర్గం పరిధిలోనే ఉన్నారా? నియోజకవర్గ ప్రజల సమస్యలను గమనిస్తున్నారా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలోనే కేరళ విద్యార్థి సంఘం ఈయన కనిపించలేదు అంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. గత ఎన్నికల ప్రచార సమయంలో భాగంగా ఈయన క్రైస్తవ ఓటర్లను ఆకర్షించడం కోసం ఏకంగా చర్చిలో బంగారు కిరీటాన్ని కూడా అందజేశారు.
దయచేసి ఆచూకీ తెలపండి…
ఇలా కేవలం ఓటర్ల దృష్టిని ఆకర్షించడం కోసమే ఇలాంటి చర్యలు చేశారని ప్రస్తుతం కాథలిక్ సన్యాసినులను అరెస్టు చేస్తే మాత్రం మౌనం వహిస్తున్నారని మండిపడ్డారు. అలాగే త్రిస్సూర్ కార్పొరేషన్ కింద అమలు చేయబడిన ఒక ప్రధాన కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టును ప్రారంభించడానికి సురేష్ గోపి హాజరు కాకపోవడంతో విద్యార్థి సంఘాలు ఆందోళన చేపట్టాయి. ఈ క్రమంలోనే తమ ఎంపీ కనిపించకుండా పోయారు అంటూ ఫిర్యాదులు చేస్తున్నారు. ఈ క్రమంలోనే కేఎస్ యు నాయకుడు ఆదివారం ఉదయం ఈమెయిల్ ద్వారా తూర్పు పోలీసులకు కనిపించకుండా పోయిన ఫిర్యాదు చేయడమే కాకుండా కచ్చితంగా ఆయన ఎక్కడ ఉన్నారో ఆచూకీ తెలపాలంటూ కే ఎస్ యు నాయకుడు గోకుల్ డిమాండ్ వ్యక్తం చేశారు. అయితే ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉంటూ ప్రజలకు అందుబాటులో లేకుండా పోవడంతోనే కేరళ విద్యార్థి సంఘాలు ఆయనపై ఇలాంటి ఫిర్యాదులు చేశారని స్పష్టమవుతుంది.
Also Read: ‘వాడి జడలు ముట్టుకుంటే వాడికి సర్రునా’… పారడైజ్ నుంచి కొత్త వీడియో