E-Paper
Advertisement

డబ్బు కాదు నైతిక విలువలే ముఖ్యం.. కోట్ల రూపాయలను కాలదన్నిన మ్యూజిక్ డైరెక్టర్!

డబ్బు కాదు నైతిక విలువలే ముఖ్యం.. కోట్ల రూపాయలను కాలదన్నిన మ్యూజిక్ డైరెక్టర్!
Advertisement

GV Prakash kumar: సాధారణంగా సినిమా , క్రీడా రంగాలకు చెందిన అగ్ర నటులు కాస్త పాపులారిటీ అందుకున్నారు అంటే చాలు.. వారితో తమ ఉత్పత్తులను ప్రమోట్ చేయించి ఆదాయాన్ని పొందుతున్నారు. అయితే అందులో సెలబ్రిటీలు కూడా కొంతమంది స్పృహతో వ్యవహరిస్తే.. మరి కొంతమంది డబ్బు కోసం కక్కుర్తి పడి చివరికి విమర్శలు కూడా ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే సాధారణంగా కొంతమంది సినిమా, స్పోర్ట్స్ రంగాలకు చెందిన అగ్ర నటులు , గొప్ప క్రీడాకారులు ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకుంటారన్న విషయం అందరికీ తెలిసిందే.

డబ్బు కాదు నైతిక విలువలే ముఖ్యం – జీవీ

కానీ వృత్తిపరంగా తీసుకునేంత రేంజ్ లో ఇప్పుడు వాణిజ్య ప్రకటనలకు కూడా భారీ మొత్తంలోనే తీసుకుంటున్నారు. అవకాశం వచ్చినప్పుడే ఉపయోగించుకోవాలి అనే రేంజ్ లో.. దొరికిన ప్రతి బ్రాండ్లకు ప్రచారం చేసి బ్యాంకు బ్యాలెన్స్ ను పెంచుకుంటున్నారు. మరి కొంతమంది సమాజ హితం కోరి ప్రజలకు హాని కలిగించే వస్తువులకు ప్రమోట్ చేయకుండా దూరంగా వ్యవహరిస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. అలాంటి వారిలో సంగీత దర్శకుడు జీవీ ప్రకాష్ కుమార్ (GV Prakash kumar) కూడా ఒకరు. ముఖ్యంగా ఈయన తీసుకున్న నిర్ణయం అందరి చేత శభాష్ అనిపిస్తోంది. మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం..

కోట్ల రూపాయల ఆఫర్ ను తిరస్కరించాను – జీవీ

Advertisement

అసలు విషయంలోకి వెళ్తే.. సంగీత దర్శకుడు జీవీ ప్రకాష్ కుమార్ బ్రాండ్ ఎండార్స్మెంట్ విషయంలో కీలక ప్రకటన చేశారు. “భారీ రెమ్యూనరేషన్ ఇస్తామని ఆఫర్లు వచ్చినప్పటికీ.. నేను మాత్రం మద్యం, జూదాన్ని ప్రచారం చేయను. ఈ అంశంలో కొంతమంది నన్ను సంప్రదించారు. భారీ మొత్తంలో డబ్బు కూడా ఇస్తామని ఆఫర్ చేశారు. పలుమార్లు నన్ను పదే పదే చాలామంది సంప్రదించినప్పటికీ నిరంతరం నేను నిరాకరిస్తూనే వచ్చాను. ముఖ్యంగా ప్రముఖ కంపెనీకి చెందిన ఒక సాఫ్ట్ డ్రింక్ బ్రాండ్ ను ప్రచారం చేయడానికి నాకు కోట్ల రూపాయలు ఆఫర్ చేశారు. అయితే నా వ్యక్తిగత విలువలకు అనుగుణంగా లేకపోవడంతోనే నేను దాని సున్నితంగా తిరస్కరించాను.

సమాజ హితమే ధ్యేయం – జీవీ

కీర్తితో పాటు సమాజం పట్ల బాధ్యతగా ఉండాలి. అందుకే నేను వాటికి దూరంగా ఉంటున్నాను. డబ్బు కంటే నైతిక విలువలకే నేను ఎక్కువ ప్రాధాన్యతనిస్తాను” అంటూ తన అభిప్రాయాలను వ్యక్తపరిచారు జీవి ప్రకాష్.. మొత్తానికైతే సమాజ హితం కోరి నైతిక విలువలకు ప్రాధాన్యతనిస్తూ.. తన అభిప్రాయాన్ని చెప్పడంతో అభిమానులు, నెటిజన్స్ కూడా జీవీ ప్రకాష్ కుమార్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు.

Advertisement

ALSO READ:విష్ణుప్రియ ఇన్‌స్టాగ్రామ్ సబ్‌స్క్రిప్షన్ పై జేడీ రియాక్షన్!

జీవి ప్రకాష్ కుమార్ కెరియర్..

జీవి ప్రకాష్ కుమార్ విషయానికి వస్తే.. సంగీత దర్శకుడిగా పనిచేస్తూనే ఇటీవల హీరోగా కూడా మంచి పేరు సొంతం చేసుకున్నారు.. యుగానికి ఒక్కడు , ఆకాశం నీ హద్దురా, మదరాసు పట్టణం, అమరన్ , లక్కీ భాస్కర్ , పరాశక్తి , ఇడ్లీ కొట్టు వంటి చిత్రాలకు సంగీతం అందించిన ఈయన హీరోగా కూడా సత్తా చాటారు. ఇకపోతే డార్లింగ్ అనే సినిమాతో హీరోగా ఇండస్ట్రీకి పరిచయమయ్యారు జీవి ప్రకాష్ కుమార్. రెబెల్, సెల్ఫీ, అయంగరన్ , సర్వం తాళమయం ఇలా పలు చిత్రాలలో హీరోగా నటించారు..

Related News

కృష్ణాష్టమి రోజున కల నెరవేరిందంటున్న ఉపాసన.. పోస్ట్ వైరల్!

Shalini Pandey : బాపురే.. బాత్ రూమ్ వీడియోతో ‘అర్జున్ రెడ్డి’ బ్యూటీ రచ్చ.. తట్టుకోలేరమ్మ..!

‘ఇరుముడి’ రూ.200 కోట్ల దెబ్బ! ఇప్పుడు శివ నిర్వాణ వెనక పడుతున్న స్టార్ హీరోలు!

మళ్లీ వార్తల్లోకి పూనం పాండే.. ఈసారి వ్యభిచారంపై మైండ్ బ్లాకింగ్ కామెంట్స్!

ముంబైని షేక్ చేస్తున్న అనన్య పాండే గ్లామర్ షో.. ఆ పిక్స్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

తెలుగు హీరోలంటే క్రిమినల్స్, స్మగ్లర్స్.. టాలీవుడ్ సినిమాలపై కస్తూరి షాకింగ్ కామెంట్స్!

కళ్ళు చెదిరే అందం.. వరుస ఆఫర్స్.. మరి సక్సెస్ రేట్ ఎక్కడ చిట్టి?

అదంతా ఫేక్ ఎవరు మోసపోవద్దు.. స్కామ్ పై కల్కి 2 టీమ్ క్లారిటీ!

Big Stories

Advertisement
×