E-Paper
Advertisement

Actress Poorna: మళ్లీ తల్లిగా ప్రమోట్ అయిన పూర్ణ.. ఈసారి పాప? బాబా?

Actress Poorna: మళ్లీ తల్లిగా ప్రమోట్ అయిన పూర్ణ.. ఈసారి పాప? బాబా?
Advertisement

Actress Poorna: సినిమా ఇండస్ట్రీలో ఒకవైపు వరుస విషాదాలు.. మరొకవైపు వరుస శుభవార్తలు సినీ ఇండస్ట్రీని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఈ క్రమంలోనే ఈరోజు ఉదయం ప్రముఖ నిర్మాత ఎం అర్జున్ రాజు మరణించారు అన్న వార్తను అభిమానులు జీర్ణించుకోలేకపోయారు.ఆ బాధ నుండి బయటపడే ప్రయత్నం చేస్తుండగా ఇంతలోనే టాలీవుడ్ కి ఒక శుభవార్త వినిపించింది. అదే ప్రముఖ హీరోయిన్ పూర్ణ (Poorna ) మళ్లీ పండంటి బిడ్డకు జన్మనిచ్చారు. ఈ మేరకు ఆమె ఒక ఎమోషనల్ పోస్టు పంచుకున్నారు.

పండంటి బిడ్డకు జన్మనిచ్చిన పూర్ణ.. ఎమోషనల్ పోస్ట్..

గత ఏడాది ఆగస్టులో గర్భం దాల్చిన ప్రముఖ నటి పూర్ణ తాజాగా తనకు బంగారు తల్లి జన్మించింది అంటూ ఒక ఎమోషనల్ పోస్టు షేర్ చేసుకున్నారు. ఈ క్రమంలో ఆమె.. “దేవుడి ఆశీస్సులతో ఈరోజు (మార్చి 14 2026) ఉదయం 4:25 గంటలకు మా కుటుంబంలోకి ఒక ఆడబిడ్డ వచ్చింది. దేవుడు ప్రసాదించిన అమూల్యమైన కానుక ఆమె. నా కొడుకుకి ఒక అందమైన చెల్లి లభించింది. నా కూతురి రాక మా కుటుంబానికి లభించిన ఒక గొప్ప వరం. ఎలాంటి సమస్యలు లేకుండా సురక్షితంగా సాఫీగా ప్రసవం జరిగేలా అనుగ్రహించిన దేవుడికి మేమెప్పుడూ రుణపడి ఉంటాము. మా బిడ్డను , మా కుటుంబాన్ని ఆశీర్వదించాలని దేవుడిని ప్రార్థిస్తున్నాను” అంటూ ఆమె రాసుకుంది. ఇక ప్రస్తుతం పూర్ణ పండంటి బిడ్డకు జన్మనిచ్చిందని తెలిసి సినీ సెలబ్రిటీలు, అభిమానులు ఆమెకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

పూర్ణ పెళ్లి, ప్రసవం..

Advertisement

ఇకపోతే ప్రముఖ నటి పూర్ణ 2022లో దుబాయ్ వ్యాపారవేత్త అయిన షానిద్ అసిఫ్ అలీ తో ఏడడుగులు వేసింది. 2023లో పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. ఇప్పుడు మళ్లీ పండంటి ఆడబిడ్డకు జన్మనివ్వడంతో ఆ కుటుంబం పరిపూర్ణమైందని అభిమానులు ఆ కుటుంబానికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ప్రస్తుతం పూర్ణ దంపతులకు కూతురు జన్మించిన నేపథ్యంలో సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

ALSO READ:ArjunDas: బ్రేకప్ పై తొలిసారి స్పందించిన అర్జున్ దాస్.. ఒక్క మాటతో కన్నీళ్లు తెప్పించావుగా!

పూర్ణ కెరియర్..

Advertisement

మోడల్ గా కెరియర్ ను ఆరంభించిన పూర్ణ.. ఆ తర్వాత నటిగా సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఈమె నటి మాత్రమే కాదు గొప్ప నృత్యకారిణి కూడా. రవిబాబు దర్శకత్వంలో వచ్చిన హారర్ తెలుగు మూవీ అవును చిత్రంలో నటించి తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఆ తర్వాత అవును 2 చిత్రంలో కూడా నటించింది. ఇక 2015లో వచ్చిన రాజుగారు గది చిత్రంలో దెయ్యం పాత్ర పోషించి మెప్పించింది ఈ ముద్దుగుమ్మ. వరుసగా సినిమాలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకున్న పూర్ణ ..మధ్యలో వివాహం చేసుకొని కొంతకాలం ఇండస్ట్రీకి దూరమైంది. మళ్లీ రీఎంట్రీలో గుంటూరు కారం సినిమాలో కుర్చీ మడత పెట్టీ సాంగ్ తో రీ ఎంట్రీ ఇచ్చి తన అద్భుతమైన డాన్స్ పెర్ఫార్మన్స్ తో అదరగొట్టేసింది. సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టిన ఈమె సినిమాలలో స్పెషల్ సాంగ్లు చేసింది. కానీ తాజాగా మళ్లీ ప్రెగ్నెన్సీ ధరించడంతో ఏడాది కాలంగా ఇండస్ట్రీకి దూరంగా ఉండిపోయింది పూర్ణ.

Related News

Shalini Pandey : బాపురే.. బాత్ రూమ్ వీడియోతో ‘అర్జున్ రెడ్డి’ బ్యూటీ రచ్చ.. తట్టుకోలేరమ్మ..!

‘ఇరుముడి’ రూ.200 కోట్ల దెబ్బ! ఇప్పుడు శివ నిర్వాణ వెనక పడుతున్న స్టార్ హీరోలు!

మళ్లీ వార్తల్లోకి పూనం పాండే.. ఈసారి వ్యభిచారంపై మైండ్ బ్లాకింగ్ కామెంట్స్!

ముంబైని షేక్ చేస్తున్న అనన్య పాండే గ్లామర్ షో.. ఆ పిక్స్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

తెలుగు హీరోలంటే క్రిమినల్స్, స్మగ్లర్స్.. టాలీవుడ్ సినిమాలపై కస్తూరి షాకింగ్ కామెంట్స్!

కళ్ళు చెదిరే అందం.. వరుస ఆఫర్స్.. మరి సక్సెస్ రేట్ ఎక్కడ చిట్టి?

అదంతా ఫేక్ ఎవరు మోసపోవద్దు.. స్కామ్ పై కల్కి 2 టీమ్ క్లారిటీ!

సరికొత్త రికార్డు సృష్టించి’ఏష నాగుల’…తొలి తెలుగు పాటగా !

Big Stories

Advertisement
×