E-Paper
Advertisement

Rashmika: పెళ్లయిన తర్వాత రష్మిక ఖాతాలో అరుదైన ఘనత.. సంతోషంలో ఫాన్స్!

Rashmika: పెళ్లయిన తర్వాత రష్మిక ఖాతాలో అరుదైన ఘనత.. సంతోషంలో ఫాన్స్!
Advertisement

Rashmika: నేషనల్ క్రష్ రష్మిక మందన్న (Rashmika mandanna) గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. అందం, అభినయంతో, నటనతో పాన్ ఇండియా వైడ్ గుర్తింపు తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ.. ఎట్టకేలకు తన ప్రియుడు, ప్రాణ స్నేహితుడు అయిన విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) తో ఏడడుగులు వేసింది. ఇక వివాహం అనంతరం తమ సినిమా షూటింగ్లో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. అందులో భాగంగానే తన భర్త విజయ్ దేవరకొండతో కలిసి ‘రణబాలి’ సినిమా చేస్తున్నారు. ఇప్పటికే రాయలసీమ ప్రాంతానికి సంబంధించిన షూటింగ్ ను కూడా కంప్లీట్ చేసుకున్న విషయం తెలిసిందే. అంతేకాదు విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ మీట్ కూడా ఏర్పాటు చేసి రాయలసీమ అభిమానులకు ధన్యవాదాలు కూడా తెలియజేశారు.

అంతర్జాతీయంగా అరుదైన గౌరవాన్ని అందుకున్న రష్మిక..

ఇదిలా ఉండగా రష్మిక మందన్న ఇప్పుడు వివాహం అనంతరం మరింత జోరు పెంచిందని చెప్పాలి. ఒకవైపు తన కెరియర్ లో భాగంగా వరుస సినిమాలలో అవకాశాలు అందుకుంటూ బిజీగా మారుతుంటే.. మరొకవైపు తన ఖాతాలో అరుదైన గౌరవాలను కూడా ఆమె దక్కించుకుంటుంది. అసలు విషయంలోకి వెళ్తే.. అంతర్జాతీయ ఘనతను ఇప్పుడు ఈమె సొంతం చేసుకుంది. జపాన్ లో అత్యంత ప్రతిష్టాత్మకమైన “క్రంచీరోల్ యానిమే” అవార్డుల వేడుకలో వరుసగా రెండవసారి ప్రజెంటర్ గా వ్యవహరించే అరుదైన అవకాశాన్ని రష్మిక సొంతం చేసుకుంది . 2024 లో ఈ వేదికపై మెరిసిన రష్మిక.. ఇప్పుడు మరొకసారి ఈ వేదికపై అలరించబోతోంది. అలా రెండుసార్లు ఈ గౌరవం పొందిన తొలి భారతీయ సినీ సెలబ్రిటీగా రికార్డు క్రియేట్ చేయడం గమనార్హం.

క్రంచీరోల్ యానిమే అవార్డుల ప్రదానోత్సవం..

Advertisement

ఇకపోతే యానిమేటెడ్ చిత్రాలు, వెబ్ సిరీస్ లలో ప్రతిభ కనబరిచిన వారికి ఈ పురస్కారాల 10వ ఎడిషన్ వేడుక మే 23వ తేదీన జపాన్ రాజధాని అయిన టోక్యోలో ఘనంగా జరగనుంది. ఈ సందర్భంగా హాలీవుడ్ ప్రముఖులతో కలిసి రష్మిక విజేతలకు అవార్డులు అందజేయనున్నారు.ఇకపోతే సుకుమార్ దర్శకత్వంలో , అల్లు అర్జున్ హీరోగా వచ్చిన పుష్ప సినిమాలోని శ్రీవల్లి పాత్రతో రష్మికకు అటు జపాన్లో కూడా భారీ క్రేజ్ ఏర్పడింది. పైగా ఈ సినిమాతో జపాన్ లో అభిమానులను కూడా సంపాదించుకుంది రష్మిక .
ఈ క్రేజ్ కారణంగానే ఈమెకు ప్రెజెంటర్ గా వ్యవహరించే అవకాశం లభించడం గమనార్హం.

ALSO READ:పెళ్లితో ఫ్యాన్స్ కు సడన్ సర్ప్రైజ్ ఇచ్చిన షణ్ముఖ్.. ఫోటోలు వైరల్!

రష్మిక మందన్న సినిమాలు..

Advertisement

గత రెండు మూడు సంవత్సరాలుగా వరుస సినిమాలు చేస్తూ.. ఆ సినిమాలతో బ్లాక్ బస్టర్ విజయాలను అందుకుంటూ మరింత బిజీగా మారిపోయింది ఈ ముద్దుగుమ్మ. ఇక ఇటీవల విజయ్ దేవరకొండ తో ఏడడుగులు వేసిన ఈమె.. ఒకవైపు విజయ్ దేవరకొండ తో కలిసి రణబాలి సినిమా చేస్తోంది. అలాగే మరో చిత్రం మైసా.. ఇందులో కూడా ఈమె హీరోయిన్గా నటిస్తోంది . ఈ చిత్రం లేడీ ఓరియంటెడ్ గా వస్తున్న విషయం తెలిసిందే. ఈ రెండు భారీ చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు త్వరలోనే రాబోతోంది.

Related News

వారికి అభినందనలు తెలిపిన ఏపీ డిప్యూటీ సీఎం!

వారణాసి షూటింగ్ పై క్రేజీ అప్డేట్.. జక్కన్న ఏం ప్లాన్ చేస్తున్నావయ్యా?

ఎమోషనల్ గా ‘చెన్నై లవ్ స్టోరీ’ ట్రైలర్.. కిరణ్ ఖాతాలో మరో హిట్?

ఫిగర్ బాలేదని టార్చర్.. 40 ఏళ్లొచ్చాకే ఆ నరకం నుండి బయటపడ్డానంటున్న తారక్ హీరోయిన్

యాంకర్ సుమ హీరోయిన్‌గా నటించిన ఏకైక సినిమా ఏంటో తెలుసా ?

‘టాక్సిక్’ ట్రైలర్ డేట్ ఫిక్స్..ఇదైనా ఖాయమా యష్?

72వ జాతీయ అవార్డుల్లో సత్తా చాటిన తెలుగు సినిమాలు.. ఉత్తమ చిత్రం ఏదంటే?

విక్రమ్ 1 సక్సెస్.. చిరు ఫిదా: ప్రైవేట్ రాకెట్ ప్రయోగంపై మెగాస్టార్ క్రేజీ రియాక్షన్!

Big Stories

Advertisement
×