E-Paper
Advertisement

అమల్లోకి కొత్త ట్రాఫిక్ ఫైన్స్.. అలా చేశారో రూ. 25 వేలు జరిమానా!

అమల్లోకి కొత్త ట్రాఫిక్ ఫైన్స్.. అలా చేశారో రూ. 25 వేలు జరిమానా!
Advertisement

New Traffic Fines Announced: కేంద్ర ప్రభుత్వం ట్రాఫిక్ నిబంధనలను కట్టుదిట్టం చేస్తూ కొత్త జరిమానాలను ప్రకటించింది. రోడ్డు ప్రమాదాలను తగ్గించడం, ప్రజల భద్రతను మెరుగుపరచడం లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. కొత్త రూల్స్ పాటించకపోతే, మొదటి సారి తక్కువ జరిమానా ఉన్నప్పటికీ, రెండోసారి తడిసిమోపెడు కానుంది.  కొన్ని సందర్భాల్లో లైసెన్స్ రద్దు లేదా జైలు శిక్ష కూడా ఉంటుంది.

సెల్‌ఫోన్ డ్రైవింగ్ చేస్తే రూ. 5000 జరిమానా

హెల్మెట్ లేకుండా వాహనం నడిపితే, మొదటిసారి రూ.100 జరిమానా విధిస్తారు. అదే తప్పు మళ్లీ చేస్తే రూ.1000 ఫైన్‌తో పాటు మూడు నెలల పాటు డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేస్తారు. అటు డ్రైవింగ్ చేస్తున్నప్పుడు సెల్‌ఫోన్ ఉపయోగిస్తే కఠిన చర్యలు తీసుకుంటున్నారు. మొదటిసారి రూ.500 ఫైన్ ఉండగా, రెండోసారి అదే తప్పు చేస్తే రూ.5000 వరకు జరిమానా విధిస్తారు.

డ్రైవింగ్ లైసెన్స్ లేకుంటే 6 నెలల జైలు

Advertisement

డ్రైవింగ్ లైసెన్స్ లేదా పొల్యూషన్ సర్టిఫికేట్ లేకుండా వాహనం నడిపితే పరిస్థితి మరింత సీరియస్ గా ఉంటుంది. మొదటిసారి రూ.1000 జరిమానా పడుతుంది. అదే, రెండోసారి పట్టుబడితే రూ.10,000 వరకు జరిమానా విధించడంతో పాటు ఆరు నెలల వరకు జైలు శిక్ష కూడా ఉండే అవకాశం ఉంది.

ఓవర్ స్పీడ్ కు రూ. 20 వేల జరిమానా

ఓవర్ స్పీడ్ ప్రమాదాలకు ప్రధాన కారణంగా ఉండడంతో దీనిపై కూడా కఠిన చర్యలు తీసుకుంటున్నారు. వేగం మించితే మొదటిసారి రూ.2000 జరిమానా వేస్తారు. అదే తప్పు మళ్లీ చేస్తే రూ.20,000 వరకు భారీ ఫైన్ విధిస్తారు. అలాగే అంబులెన్స్‌కు దారి ఇవ్వకపోవడం కూడా ఇకపై సీరియస్ అంశం కానుంది. మొదటిసారి రూ.1000 జరిమానా విధిస్తారు.  రెండోసారి రూ.10,000 వరకు పెరుగుతుంది.

Advertisement

ఇక సిగ్నల్ జంప్ చేయడం కూడా కఠినంగా పరిగణించబడుతోంది. మొదటిసారి రూ.500 ఫైన్ పడుతుంది. అదే తప్పు మళ్లీ చేస్తే రూ.5000 జరిమానా విధిస్తారు. చిన్న తప్పుగా భావించే త్రిబుల్ రైడింగ్‌పై కూడా చర్యలు ఉన్నాయి. మొదటిసారి రూ.100 జరిమానా ఉండగా, రెండోసారి రూ.1000 వరకు పెరుగుతుంది.

మైనర్ డ్రైవింగ్ కు రూ. 25 వేల జరిమానా

18 ఏళ్లు నిండని వారు వాహనం నడిపితే కఠిన చర్యలు తప్పవు. డ్రైవ్ చేస్తూ ప్రమాదానికి కారణమైతే, మొదటిసారి రూ.2500 జరిమానా విధిస్తారు. అదే తప్పు మళ్లీ జరిగితే రూ.25,000 జరిమానా, మూడు సంవత్సరాల జైలు శిక్ష విధించబడుతుంది. అంతేకాకుండా, వారికి 25 ఏళ్లు వచ్చే వరకు డ్రైవింగ్ లైసెన్స్ ఇవ్వకుండా నిషేధం కూడా ఉంటుంది.ఈ కొత్త ట్రాఫిక్ రైల్స్ ప్రజల్లో బాధ్యతాయుత డ్రైవింగ్ అలవాట్లు పెంచడానికి తీసుకొచ్చినట్లు కేంద్రం తెలిపింది. చిన్న తప్పులే పెద్ద ప్రమాదాలకు దారి తీస్తాయని గుర్తుంచుకుని, ప్రతి ఒక్కరూ ఈ నిబంధనలు పాటించాలని సూచించింది.

Read Also: కక్కుర్తి గాళ్లు.. రైళ్లలో బెడ్ షీట్లు, టవల్స్ ఎత్తేస్తున్న ప్రయాణికులు, ఆ డివిజన్‌లోనే అత్యధికం!

Related News

భారత్ నుంచి లండన్‌కు బస్సు సర్వీస్.. అమ్మో.. అన్ని రోజుల ప్రయాణమా?

ఒక్క టికెట్ చాలు.. 56 రోజుల పాటు రైల్లో దేశమంతా చుట్టేయొచ్చు!

భారత్‌లో మరో అద్భుతం.. సముద్ర గర్భంలో బుల్లెట్ ట్రైన్.. సరికొత్త హిస్టరీ క్రియేట్ చేస్తున్న ఇండియా!

పాకిస్తాన్ లో జగన్నాథుడి రథయాత్ర.. చూసేందుకు రెండు కళ్లు చాలవనుకోండి!

వర్షాకాలంలో మాత్రమే పరుగులు తీసే హెరిటేజ్ రైలు.. ప్రకృతి ఒడిలో అద్భుత ప్రయాణం!

ఫ్యామిలీతో థీమ్ పార్క్ వెళ్లే మజానే వేరు.. ప్రపంచంలోని 8 బెస్ట్ థీమ్ పార్క్స్ ఇవే

‘మిర్చి’ సాంగ్ లోని ఈ ప్లేస్ గుర్తుందా? అది ఇప్పుడు ఘోస్ట్ టౌన్, జనాలంతా ఏమయ్యారు?

ట్రెక్కింగ్ నేర్చుకోవాలనుకుంటున్నారా? దేశంలో సురక్షితమైన 7 అద్భుతమైన ట్రెక్కింగ్ ప్రాంతాలివే

Big Stories

Advertisement
×