E-Paper
Advertisement

Actress Rohini: అమ్మాయి అంటే ఇలానే ఉండాలా… శివాజీ, అనసూయకు ఇచ్చి పడేసిన నటి

Actress Rohini: అమ్మాయి అంటే ఇలానే ఉండాలా… శివాజీ, అనసూయకు ఇచ్చి పడేసిన నటి
Advertisement

Actress Rohini: సౌత్ సినీ ఇండస్ట్రీలో సీనియర్ నటిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న రోహిణి ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ లో భాగంగా వరుస సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా బిజీగా ఉన్నారు. తల్లి పాత్రలలో ఇట్టే ఇమిడిపోయి తల్లి పాత్రలకే ప్రాణం పోస్తున్న రోహిణి ఏదైనా సభ వేదికలపై చాలా ఉన్నతంగా మాట్లాడుతూ అభిమానుల మనుషులను దోచుకుంటున్నారు అయితే తాజాగా రోహిణి CITU 18వ అఖిల భారత మహాసభలకు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా రోహిణి మహిళల గురించి ఎన్నో విషయాలను మాట్లాడారు.

ఇద్దరు సమానమే..

ఈ కార్యక్రమంలో భాగంగా పరోక్షంగా ఈమె శివాజీ అనసూయకు కూడా కౌంటర్ ఇచ్చారనే తెలుస్తోంది. ఈ సమాజంలో మహిళలు అంటే కేవలం పనిచేయటానికి మాత్రమే అనే భావనలో అందరూ ఉన్నారని ఆ భావన నుంచి బయటపడాలని కోరారు. మహిళలు జీతం లేని శ్రామికులు అంటూ చెప్పుకువచ్చారు. ప్రతి ఒక్క రంగంలో కూడా మహిళలు రాణిస్తున్నారు కానీ ఇప్పటికీ చాలా ఉంది కేవలం ఇంటికి మాత్రమే పరిమితమయ్యారని తెలిపారు.

అబ్బాయిలు కూడా ఇంటి పనులు చేయొచ్చు..

Advertisement

మహిళ అంటే ఇంట్లో పనులు మాత్రమే చేయాలనే ఆలోచన ధోరణిలో కొంతమంది ఉన్నారని అమ్మాయి ఇలాగే ఉండాలని ఏమీ లేదు. అబ్బాయిలు కూడా ఇంటి పనులు, వంట పనులు చేయొచ్చని ఈమె తెలిపారు. ఇక మహిళల వస్త్ర ధారణ గురించి కూడా ఈమె మాట్లాడుతూ.. మన ఇంట్లో మన పెద్దవాళ్లు మహిళలు ఇలాగే ఉండాలి ఇలాగే చీర వేసుకోవాలని చెబుతూ ఉంటారు అలాగే మగవారికి కూడా వస్త్రధారణలో కొన్ని పద్ధతులు ఉన్నాయని తెలిపారు.. ఇక్కడ ఎవరు ఎక్కువ, తక్కువ కాదు ఇద్దరు సమానమేనని ఇద్దరికీ సమాన హక్కులు ఉంటాయి అంటూ పరోక్షంగా శివాజీ, అనసూయకు తనదైన శైలిలోనే కౌంటర్ ఇస్తూ రోహిణి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

Advertisement

ఇక శివాజీ హీరోయిన్ల వస్త్రధారణ గురించి మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపై దీంతో కొంతమంది శివాజీకి పూర్తిస్థాయిలో మద్దతు తెలిపారు శివాజీ చెప్పిన మాటలలో నిజం లేదని తెలియజేశారు అయితే ఈ వివాదం పై అనసూయ గట్టిగా పోరాటం చేశారు. కొంతమంది అనసూయను తప్పు పట్టగా మరి కొందరు అనసూయకు మద్దతు తెలియజేస్తున్నారు. ఇప్పటికీ ఈ వివాదం పై పెద్ద ఎత్తున డిబేట్ లు జరగడం, సోషల్ మీడియాలో కూడా చర్చలు జరుగుతున్నాయి. తాజాగా ఇదే అంశం గురించి రోహిణి మాట్లాడుతూ ఆడ మగ అనే తేడా లేకుండా ఇద్దరూ సమానమేనని ఈ సందర్భంగా తెలియజేశారు. ఇలా రోహిణి చేసిన ఈ వ్యాఖ్యల పట్ల అభిమానులు కూడా విభిన్న రీతిలో స్పందిస్తూ కామెంట్లు చేస్తున్నారు. మీరు చెప్పింది అక్షర సత్యం అని, చాలా ఉన్నతంగా మాట్లాడారు అంటూ రోహిణి వ్యాఖ్యలపై కామెంట్లు వ్యక్తం అవుతున్నాయి.

Also Read: Sri Reddy :కామాన్ని కంట్రోల్ చేసుకోండి.. న్యూ ఇయర్ వేళ అమ్మాయిలకు శ్రీ రెడ్డి సలహాలు

Related News

ప్రమాదానికి గురైన అలీ..కాలికి పెద్ద కట్టుతో అలా..ఏమైందంటే?

యశ్ ‘టాక్సిక్’ ఇంగ్లీష్ వెర్షన్ రిలీజ్ డేట్ ఫిక్స్.. అక్కడైనా సక్సెస్ అయ్యేనా?

అరుదైన ఘనత సాధించిన రష్మిక మందన్న!

అన్నపూర్ణ స్టూడియోస్ పై అల్లరి నరేష్ షాకింగ్ కామెంట్స్!

రామాయణంలోకి అమీర్ ఖాన్ కూతురు.. ఆ 5 నిమిషాలే కీలకమట!

ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు పూనకాలు తెప్పించే న్యూస్.. ఆ రూమర్స్ కు చెక్..

మమిత బైజుకు ఏమైంది..? సినిమాలకు గుడ్ బై..?

టాక్సిక్ ..500కోట్లు అయ్యే పనేనా ?

Big Stories

Advertisement
×