E-Paper
Advertisement

Sai Kamakshi Bhaskarla: నీకు ఏ పొజీషన్ ఇష్టం అంటూ నెటిజన్ అసభ్యకర ప్రశ్న.. గట్టిగా ఇచ్చి పడేసిన ‘పొలిమేరు’ భామ

Sai Kamakshi Bhaskarla: నీకు ఏ పొజీషన్ ఇష్టం అంటూ నెటిజన్ అసభ్యకర ప్రశ్న.. గట్టిగా ఇచ్చి పడేసిన ‘పొలిమేరు’ భామ
Advertisement

Sai Kamakshi Bhaskarla: సినిమా ఇండస్ట్రీలో కొనసాగే హీరో హీరోయిన్లకు ఎంతో మంది అభిమానులు ఉంటారు. అయితే ఒకానొక సమయంలో వారి అభిమాన హీరో హీరోయిన్ల గురించి తెలుసుకోవాలి అంటే కేవలం సినీ వార్తాపత్రికల ద్వారా మాత్రమే తెలుసుకునేవారు. కానీ ఇప్పుడు సోషల్ మీడియా బాగా అభివృద్ధి చెందిన తర్వాత అభిమానులకు స్వయంగా వారికి ఇష్టమైన సెలబ్రిటీలతో మాట్లాడే అవకాశం ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఇలాంటి అవకాశాలను కొంతమంది తప్పుగా ఉపయోగిస్తూ సెలబ్రిటీలను ఇబ్బంది పెడుతూ ఉంటారు.

నాకు ఇష్టమైన పొజిషన్ ఇదే..

సోషల్ మీడియా వేదికగా హీరోయిన్ల గురించి తప్పుడు కామెంట్లు అసభ్యకరమైన కామెంట్లు చేస్తూ ఉంటారు అయితే కొంతమంది ఇలాంటి వాటిని చూసి చూడనట్టు వదిలేగా, మరికొందరు తమదైన స్టైల్ లోనే నెటిజన్లకు కౌంటర్లు ఇస్తూ ఉంటారు. తాజాగా ఇలాంటి చేదు అనుభవం పొలిమేర నటి కామాక్షి భాస్కర్లకు(kamakshi bhaskarla) ఎదురైంది. ఈ కామెంట్ పట్ల ఈమె స్పందిస్తూ.. నాకు ఇష్టమైన పొజిషన్ గురించి అడుగుతున్నారు నేను కూడా నిజాయితీగానే సమాధానం చెబుతాను అంటూ..”నేను ఎక్కడైతే గౌరవింపబడతానో ,ప్రశాంతంగా ఉండి నా ఎంపికపై నియంత్రణ ఉండే స్థానాన్ని ఇష్టపడతాను. ఎందుకంటే విశ్వాసం అనేది ఆధిపత్యం చెలాయించడం కాదు… మనకు ఉన్న స్పష్టత గురించి” అంటూ తనదైన స్టైల్ లోనే కామాక్షి నేటిజన్ కు దిమ్మతిరిగే సమాధానం ఇచ్చారు.

దిమ్మ తిరిగే సమాధానం..

Advertisement

ఇలా ఈ విషయంపై స్పందిస్తూ కామాక్షి చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. సదరు నెటిజన్ చేసిన కామెంట్ పట్ల కామాక్షి స్పందిస్తూ దిమ్మ తిరిగే సమాధానం ఇవ్వడంతో బాగా బుద్ధి చెప్పారు అంటూ ఈమె పోస్ట్ పై కామెంట్లు చేస్తున్నారు. ఇలా నిత్యం హీరోయిన్ల విషయంలో కొంతమంది ఆకతాయిలు ఇలాంటి అభ్యంతరకరమైన కామెంట్లను చేస్తూ సెలబ్రిటీలను ఇబ్బందులకు గురి చేస్తూ ఉంటారు. ఇక ఈమె నటిగా పలు విభిన్న సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

Advertisement

కామాక్షి పొలిమేర లాంటి హర్రర్ థ్రిల్లర్ సినిమా ద్వారా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు. ఇక ఇటీవల ఈమె అల్లరి నరేష్ హీరోగా నటించిన 12 A రైల్వే కాలనీ అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా కూడా హర్రర్ నేపథ్యంలోనే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ సినిమా అనుకున్న స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది.ఇలా కెరియర్ మొదటి నుంచి కూడా కామాక్షి భాస్కర్ల ఎంతో విభిన్నమైన సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఇక పొలిమేర సినిమా ఈమెకు మంచి గుర్తింపును తీసుకువచ్చింది.

Also Read: Anasuya Bhardwaj: అందుకే నేను హీరోయిన్ అయ్యాను.. అనసూయ పోస్ట్ వైరల్!

Related News

ఉత్తమ బాలల చిత్రంగా నేషనల్ అవార్డు అందుకున్న తొలి తెలుగు చిత్రం ఏంటో తెలుసా?

నేషనల్ అవార్డ్స్ రేసులో ధనుష్ రికార్డ్… ‘కలాం’ బయోపిక్‌పై హైప్!

ఆ హీరోతో అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్?

Sharmiela mandre :చడీ చప్పుడు లేకుండా పెళ్లి చేసుకున్న అల్లరి నరేష్ హీరోయిన్.. వరుడు ఎవరంటే?

38ఏళ్ల తర్వాత తండ్రి నాగబాబు రికార్డును రిపీట్ చేసిన నిహారిక!

సైలెంట్ గా నిశ్చితార్థం.. పెళ్లికి సిద్ధమైన టాలీవుడ్ హీరో!

కళ్ళు లేవు.. మైమరిపించే గాత్రానికి నేషనల్ అవార్డు.. ఎవరీ సింగర్?

విజువల్ వండర్ గా రామాయణ ట్రైలర్.. అఫీషియల్ ఎప్పుడంటే?

Big Stories

Advertisement
×