E-Paper
Advertisement

Anasuya Bhardwaj: అందుకే నేను హీరోయిన్ అయ్యాను.. అనసూయ పోస్ట్ వైరల్!

Anasuya Bhardwaj: అందుకే నేను హీరోయిన్ అయ్యాను.. అనసూయ పోస్ట్ వైరల్!
Advertisement

Anasuya Bhardwaj: అనసూయ భరద్వాజ్ గత కొద్దిరోజులుగా పెద్ద ఎత్తున వివాదాలలో నిలుస్తున్న సంగతి తెలిసిందే. ఈమె ఏ విషయాన్ని అయినా నిర్మొహమాటంగా ముక్కుసూటిగా మాట్లాడటంతో ఎన్నో వివాదాలను ఎదుర్కొంటూ ఉన్నారు. తన గురించి ఎవరైనా అసభ్యకరంగా కామెంట్లు చేసినా అటువైపు ఉన్నది ఎవరనేది లెక్కచేయకుండా వారికి తనదైన స్టైల్ లోనే అనసూయ సమాధానం ఇస్తూ ఉంటారు. ఇలా నిత్యం వివాదాలలో నిలుస్తున్న అనసూయ శివాజీ చేసిన వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించారు. ఈ నేపథ్యంలోనే కొంతమంది అనసూయకు మద్దతుగా నిలవగా మరికొందరు ఈమె పై విమర్శలు కురిపిస్తూ వచ్చారు..

సత్యం మాట్లాడే ధైర్యం..

ఈ వివాదం అనంతరం ఈమె నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన విషయాలను అభిమానులతో పంచుకుంటున్నారు . తాజాగా ఇంస్టాగ్రామ్ స్టోరీ ద్వారా అనసూయ హీరోయిన్ అసలు అర్థాన్ని తెలియజేస్తూ చేసిన పోస్ట్ వైరల్ అవుతుంది. హీరోయిన్ అంటే తెరపై కనిపించి సందడి చేసేవారు కాదని అనసూయ తెలియచేశారు.”సత్యం మాట్లాడే ధైర్యం.. సొంతదారిలో నడిచే శక్తి.. సరైన దానికి నిలబడే గుండె అదే నిజమైన హీరోయిన్.. మిగతావాళ్లు కేవలం నటులు మాత్రమే” అంటూ అనసూయ చేసిన పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది.

బుల్లితెర యాంకర్ గా సక్సెస్..

Advertisement

ఈ పోస్ట్ ద్వారా తాను ఏ విషయం గురించైనా నిజాలు మాట్లాడుతూ ధైర్యంగా పోరాటం చేస్తానని అందుకే తాను నిజమైన హీరోయిన్ అని చెప్పకనే చెప్పేశారు. ప్రస్తుతం ఈ పోస్టుపై విభిన్న రీతిలో కామెంట్లు వ్యక్తం అవుతున్నాయి. అనసూయ చెప్పిన మాటలు నిజమే కదా అంటూ కొంతమంది కామెంట్లు చేయగా, మరికొందరు యధావిధిగా విమర్శలు కురిపిస్తూ కామెంట్లు చేస్తున్నారు. ఇక అనసూయ విషయానికి వస్తే.. బుల్లితెర యాంకర్ గా సక్సెస్ అందుకున్న ఈమె వెండితెరపై సినిమాలలో అవకాశాలను అందుకొంటూ పలు సినిమాలలో నటించి సందడి చేశారు.

క్షమాపణలు చెప్పిన అనసూయ..

Advertisement

ఇటీవల కాలంలో అనసూయ పెద్దగా సినిమాలలో నటించడం లేదని తెలుస్తోంది. మరోవైపు బుల్లితెర కార్యక్రమాలకు కూడా దూరంగా ఉంటున్నారు. అయితే పెద్ద ఎత్తున షాపింగ్ మాల్స్ ప్రారంభోత్సవ కార్యక్రమాలలో పాల్గొంటూ బిజీగా ఉన్న అనసూయ సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన విషయాలతో పాటు ఇండస్ట్రీకి సంబంధించిన విషయాల గురించి కూడా స్పందిస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. ఇలా శివాజీ చేసిన వ్యాఖ్యలపై అనసూయ ఘాటుగా స్పందించడంతో వివాదంలో చిక్కుకున్నారు. ప్రస్తుతం మహిళలకు మద్దతుగా నిలిచిన అనసూయ గతంలో మహిళలను ఉద్దేశించి డబుల్ మీనింగ్ డైలాగులతో మాట్లాడిన వీడియోలను కూడా బయట పెడుతూ విమర్శలు కురిపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అనసూయ నటి రాశి గురించి గతంలో చేసిన వ్యాఖ్యలకు ఈమె క్షమాపణలు చెప్పిన సంగతి తెలిసిందే.

Also Read: Actor Suman:  శివాజీ మాటలు తప్పు.. అనసూయకు ఇచ్చి పడేసిన సుమన్?

Related News

రికార్డుల వేటలో ‘ది ఒడిస్సీ’..మన మేకర్స్ ఇప్పటికైనా మారతారా?

విదేశాల్లో షాట్లు.. ఏపీలో ఓట్లు! టాలీవుడ్ స్టార్స్‌పై అంబికా కృష్ణ మార్కు కౌంటర్లు!

‘టాక్సిక్’ దెబ్బకి ప్లాన్స్ ఛేంజ్? రవితేజ ‘ఇరుముడి’ రిలీజ్ డేట్‌పై లేటెస్ట్ అప్‌డేట్!

హైదరాబాద్‌లో ‘వైఫ్ ఎక్స్ఛేంజ్’ కల్చర్ ఉందంటూ హీరోయిన్ మాధవీలత సంచలన వ్యాఖ్యలు!

మగాళ్ల హత్యల పై షాకింగ్ కామెంట్స్.. కొడుకు కోసం ఆందోళన పడుతున్న కాజల్..

నేను దేశ ద్రోహిని కాదు.. బీజేపీ తీరుపై నటుడు నరేష్ ఫైర్..

హిట్ కొట్టిన రోజా,నాగదుర్గ.. పాపం ఐశ్వర్య, లయ!

నేషనల్ అవార్డు విన్నింగ్ పై మెగాస్టార్ ట్వీట్.. నిహారిక క్రేజీ కామెంట్స్!

Big Stories

Advertisement
×