E-Paper
Advertisement

Sree Leela: సైబర్ మోసాలపై శ్రీలీల కామెంట్స్.. కళ్ళు తెరిచేలోపే మొత్తం లూటీ!

Sree Leela: సైబర్ మోసాలపై శ్రీలీల కామెంట్స్.. కళ్ళు తెరిచేలోపే మొత్తం లూటీ!
Advertisement

Sree Leela: టాలీవుడ్ లో తన డాన్స్‌లతో, చురుకైన నటనతో కుర్రకారు మనసు గెలుచుకున్న యంగ్ సెన్సేషన్ బ్యూటీ శ్రీలీల (Sree Leela). ఈమె ‘పెళ్ళిసందD’ మూవీతో ఇండ్రస్ట్రీకి పరిచయం అయ్యింది. ఆ తరువాత వరుస సినిమాలతో టాలీవుడ్ యంగ్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్నది. ఇక ఇప్పుడు ఒక సామాజిక బాధ్యతతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. నేటి డిజిటల్ యుగంలో అమాయక ప్రజలను నిలువునా దోచుకుంటున్న నకిలీ లోన్ యాప్‌ల పట్ల ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. కేవలం సినిమాలతోనే కాకుండా, తన అభిమానుల భద్రత కోసం ఆమె ఇచ్చిన ఈ పిలుపు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. ఆ వివరాలు ఇలా వున్నాయి..

నకిలీ లోన్ యాప్‌ల మాయాజాలం.. శ్రీలీల హెచ్చరిక:

ఇప్పుడు యువత తొందరగా డబ్బు సంపాదించాలన్న ఆతృతతో నకిలీ లోన్ యాప్ ల బారిన పడుతున్నారు. అది ఎంత ప్రమాదం అన్నది డబ్బు తీసుకునేటప్పుడు తెలియదు. లోన్ ఇచ్చిన తర్వాత డబ్బు కోసం ఆ యాప్ వారు చేసే ఫోన్లతో మెసేజ్ లతో యువత ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆన్లైన్లో ప్రస్తుతం తక్కువ వడ్డీ.. మీరు డాక్యుమెంట్ సబ్మిట్ చేయక్కర్లేదు అనే ప్రకటనలతో నకిలీ లోన్ యాప్ లు ఎన్నో పుట్టుకొస్తూ ఉన్నాయి .

Advertisement

వీటిపై స్పందించిన శ్రీలీల.. గుర్తుతెలియని వ్యక్తులు పంపే ఏపీకే (APK) ఫైల్స్‌ను ఎట్టి పరిస్థితుల్లోనూ డౌన్‌లోడ్ చేయవద్దని సూచించారు. ఇలాంటి ఫైల్స్ వల్ల మీ ఫోన్ హ్యాక్ అయ్యి, వ్యక్తిగత సమాచారం, ఫోటోలు సైబర్ నేరగాళ్ల చేతికి వెళ్లే ప్రమాదం ఉందని ఆమె వివరించారు. ఒక్కసారి యాప్ ఇన్‌స్టాల్ చేస్తే, మన కాంటాక్ట్ లిస్ట్ మొత్తం వారి గుప్పిట్లోకి వెళ్లిపోతుందని, ఆపై వేధింపులు మొదలవుతాయని ఆమె హెచ్చరించారు. ఆకర్షణీయమైన ఆఫర్ల వెనుక ఉండే చీకటి కోణాన్ని గుర్తించాలని ఆమె విజ్ఞప్తి చేశారు.

వెండితెరపై శ్రీలీల సందడి.. వరుస ప్రాజెక్టులతో బిజీ:

సామాజిక అంశాలపై స్పందిస్తూనే, శ్రీలీల తన సినీ కెరీర్‌ను జెట్ స్పీడ్‌తో ముందుకు తీసుకెళ్తున్నారు.బాలకృష్ణ ‘భగవంత్ కేసరి’మూవీ,తరువాత రవితేజతో ‘ధమాకా’ వంటి విజయాల తర్వాత ఈ అమ్మడు ప్రస్తుతం టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్‌గా మారిపోయింది. ప్రస్తుతం ఆమె పవన్ కళ్యాణ్ సరసన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ వంటి ప్రతిష్టాత్మక చిత్రాల్లో నటిస్తోంది. కేవలం గ్లామర్ పాత్రలకే పరిమితం కాకుండా, నటనకు ప్రాధాన్యం ఉన్న కథలను ఎంచుకుంటూ తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటోంది. షూటింగ్స్ లో ఎంత బిజీగా ఉన్నా, ఇలాంటి సీరియస్ ఇష్యూస్ పై స్పందించి తన పరిణతిని చాటుకుంటోంది ఈ బ్యూటీ.

Advertisement

also read:Tamannaah: బంధం చాలా ప్రమాదకరం.. బ్రేకప్ పై మిల్కీ బ్యూటీ కామెంట్!

సైబర్ భద్రత మన బాధ్యత.. అప్రమత్తతే ఆయుధం:

చివరిగా శ్రీలీల చెప్పినట్లుగా, మన వ్యక్తిగత సమాచారమే మన ఆస్తి. అవసరం కోసం తీసుకునే చిన్న లోన్, జీవితాంతం తీరని భారంగా మారకూడదంటే అప్రమత్తంగా ఉండటం ఒక్కటే మార్గం. ఆర్బీఐ గుర్తింపు లేని ఏ యాప్‌ను నమ్మవద్దు. తన ఫాన్స్ కోసం, ముఖ్యంగా యువత కోసం ఆమె చేసిన ఈ చిన్న ప్రయత్నం తో కొందరైనా నకిలీ లోన్ యాప్ బారిన పడకుండా ఉంటారని ఆశిద్దాం.

Related News

‘ఇరుముడి’ రూ.200 కోట్ల దెబ్బ! ఇప్పుడు శివ నిర్వాణ వెనక పడుతున్న స్టార్ హీరోలు!

మళ్లీ వార్తల్లోకి పూనం పాండే.. ఈసారి వ్యభిచారంపై మైండ్ బ్లాకింగ్ కామెంట్స్!

ముంబైని షేక్ చేస్తున్న అనన్య పాండే గ్లామర్ షో.. ఆ పిక్స్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

తెలుగు హీరోలంటే క్రిమినల్స్, స్మగ్లర్స్.. టాలీవుడ్ సినిమాలపై కస్తూరి షాకింగ్ కామెంట్స్!

కళ్ళు చెదిరే అందం.. వరుస ఆఫర్స్.. మరి సక్సెస్ రేట్ ఎక్కడ చిట్టి?

అదంతా ఫేక్ ఎవరు మోసపోవద్దు.. స్కామ్ పై కల్కి 2 టీమ్ క్లారిటీ!

సరికొత్త రికార్డు సృష్టించి’ఏష నాగుల’…తొలి తెలుగు పాటగా !

విడాకులు తీసుకున్న దునియా విజయ్.. భరణం తెలిస్తే షాక్!

Big Stories

Advertisement
×