E-Paper
Advertisement

India EU Trade Deal: ట్రంప్‌కు దిమ్మతిరిగే షాక్.. EU డీల్‌తో తగ్గనున్న ధరలు..

India EU Trade Deal: ట్రంప్‌కు దిమ్మతిరిగే షాక్.. EU డీల్‌తో తగ్గనున్న ధరలు..
Advertisement

India EU Trade Deal: భారత్, యూరోపియన్ యూనియన్ (EU) మధ్య కుదిరిన చారిత్రాత్మక స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (FTA) దేశీయ మార్కెట్లో పెను మార్పులకు నాంది పలకనుంది. సుమారు 18 ఏళ్ల సుదీర్ఘ చర్చల తర్వాత “మదర్ ఆఫ్ ఆల్ డీల్స్”గా అభివర్ణించబడుతున్న ఈ ఒప్పందం ఖరారైంది. దీనివల్ల యూరప్ నుండి దిగుమతి అయ్యే లగ్జరీ కార్లు, వైన్, బీర్, ఇతర ఆహార పదార్థాల ధరలు సామాన్యులకు సైతం అందుబాటులోకి రానున్నాయి. ఈ ఒప్పందం ద్వారా రెండు ఆర్థిక వ్యవస్థల మధ్య సుమారు 2 బిలియన్ల జనాభాకు లబ్ధి చేకూరనుంది.

లగ్జరీ కార్ల ధరల్లో భారీ ఊరట
ఈ ఒప్పందంలో అత్యంత కీలకమైన అంశం ఆటోమొబైల్ రంగంపై సుంకాల తగ్గింపు. ప్రస్తుతం ఈయూ దేశాల నుండి దిగుమతి అయ్యే ప్రీమియం కార్లపై భారత్ విధిస్తున్న 110 శాతం టారిఫ్‌ను దశలవారీగా కేవలం 10 శాతానికి తగ్గించనున్నారు. తొలి విడతగా ఏడాదికి 2,50,000 వాహనాల కోటా వరకు ఈ తగ్గింపు వర్తిస్తుంది. దీనివల్ల మెర్సిడెస్ బెంజ్, బీఎండబ్ల్యూ, ఆడి, వోక్స్‌వ్యాగన్ వంటి లగ్జరీ కార్ల ధరలు గణనీయంగా తగ్గి, వాహన ప్రియులకు భారీగా ఆదా అవుతుంది.

Advertisement

Also Read: నా చావుకు మా అమ్మ, నాన్నే కారణం.. కొడుకు సెల్ఫీ సూసైడ్

అందుబాటులోకి విదేశీ మద్యం, ఆహార పదార్థాలు కేవలం కార్లే కాకుండా, ఐరోపా నుండి వచ్చే వైన్, బీర్ వంటి పానీయాలపై కూడా టారిఫ్‌లు భారీగా తగ్గనున్నాయి. వైన్‌పై ఉన్న 150 శాతం సుంకాన్ని తక్షణమే 75 శాతానికి, అటుపై 20 శాతానికి తగ్గించనున్నారు. అలాగే బీర్ ధరలు కూడా 110 శాతం నుండి 50 శాతానికి దిగిరానున్నాయి. ఆలివ్ ఆయిల్, చాక్లెట్లు, బిస్కెట్లు, ఇతర ప్రాసెస్ చేసిన ఆహార పదార్థాలపై ప్రస్తుతం ఉన్న 45-50 శాతం సుంకాలు పూర్తిగా తొలగిపోవడంతో ఇవి మరింత చవకగా లభించనున్నాయి.

Advertisement

ఆర్థిక ప్రయోజనాలు, ఎగుమతుల జోరు..
ఈ వాణిజ్య ఒప్పందం ద్వారా ఏడాదికి సుమారు 4 బిలియన్ యూరోల మేర సుంకాలు ఆదా అవుతాయని అంచనా. ఈయూ దేశాలకు భారత్ నుండి ఎగుమతి అయ్యే వస్త్రాలు (Textiles), చర్మ ఉత్పత్తులు, రసాయనాలు, జ్యువెలరీ రంగాలకు కూడా ఈ ఒప్పందం పెద్ద పీట వేసింది. దాదాపు 96 శాతానికి పైగా వస్తువులపై టారిఫ్‌లు తొలగిపోవడంతో భారత్-ఈయూ మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం 2032 నాటికి రెట్టింపు అయ్యే అవకాశం ఉంది.

Related News

హోటల్ బిల్లులో సర్వీస్ ఛార్జ్.. 41 రెస్టారెంట్లపై కఠిన చర్యలు

పసిడి ప్రియులకు షాక్.. రెండు రోజులుగా మళ్లీ పెరుగుతున్న బంగారం ధరలు.. ఎంత పెరిగిందంటే?

Credit Cards: షాకింగ్ నిజాలు.. కొత్త క్రెడిట్ కార్డులు, సగానికి జెన్ జీలదే హవా, వారంతా అక్కడి వారే

ఆ 3 సెకన్ల వెనుక కోట్ల వ్యాపారం.. Mutual Funds యాడ్స్ స్పీడ్ వెనుక ఉన్న మైండ్ గేమ్ ఇదే!

కూతురు ఉందా? రూపాయి ఖర్చు లేకుండా ఆమె పెళ్లి, చదువు బాధ్యతలు తీరిపోయే సూపర్ స్కీమ్ ఇదే!

ధర ఏమో ఆకాశానికి.. సైజు ఏమో చిన్నగా.. భాగ్యనగరంలో గుడ్డు రేట్ల ఘాటు!

ప్రైవేట్ జాబ్ చేస్తున్నారా? రిటైర్మెంట్ తర్వాత కూడా రాజాలా బతకాలంటే ఇప్పుడే ఇలా చేయండి!

సైబర్ వలలో కార్పొరేట్ కంపెనీలు.. అలజడి రేపుతోన్న ‘బాస్ స్కామ్’!

Big Stories

Advertisement
×