Sumalatha -Yash: కన్నడ స్టార్ హీరో, రాకింగ్ స్టార్ యశ్(Yash) ప్రస్తుతం పాన్ ఇండియా స్థాయిలో హీరోగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. కే జి ఎఫ్ సినిమా ద్వారా రాత్రికి రాత్రే పాన్ ఇండియా హీరోగా గుర్తింపు పొందిన ఈయన ప్రస్తుతం వరుస పాన్ ఇండియా సినిమాలకు కమిట్ అవుతూ ఎంతో బిజీగా ఉన్నారు. కే జి ఎఫ్ 2 విడుదలైన దాదాపు మూడు సంవత్సరాల తర్వాత యష్ నటించిన టాక్సిక్ (Toxic)సినిమా ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ఎన్నో అంచనాల నడుమ ఆగస్టు 26వ తేదీ విడుదల అయింది.
లేడీ డైరెక్టర్ గీతు మోహన్ దాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఎన్నో అంచనాల నడుమ విడుదల అయినప్పటికీ అనుకున్న స్థాయిలో ప్రేక్షకుల అంచనాలను చేరుకోకపోవడమే కాకుండా ఈ సినిమాపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ సినిమాలో కొన్ని అభ్యంతరకర సన్నివేశాల పట్ల నటుడు యష్ పై విమర్శలు కురిపిస్తున్న సంగతి తెలిసిందే. ఇలా హీరో యష్ గురించి ఈ విధమైనటువంటి విమర్శలు వస్తున్న నేపథ్యంలో ఇప్పటికే హీరో తల్లి ఈ విషయంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇకపోతే తాజాగా సీనియర్ నటి సుమలత(Sumalatha) సైతం టాక్సిక్ సినిమా గురించి వస్తున్నటువంటి విమర్శల పట్ల స్పందిస్తూ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.
టాక్సిక్ సినిమా గురించి సోషల్ మీడియాలో వస్తున్న విమర్శల గురించి సుమలత స్పందిస్తూ..హీరో యశ్ ఎదుగుదలను చూసి ఓర్వలేక కొంతమంది కావాలనే తన సినిమా పట్ల నెగిటివ్ ప్రచారం చేస్తున్నారని ఈమె మండిపడ్డారు. ఈ సినిమాలో యశ్ తన నటనతో యాక్టింగ్ అదరగొట్టారని ఈమె ప్రశంసలకు కురిపించారు. అది చూసి తట్టుకోలేకే కొంతమంది దుష్ప్రచారం చేస్తున్నారని సుమలత వ్యాఖ్యానించారు. రాబోయే రోజులలో యష్ కే జి ఎఫ్ సినిమాను మించి సక్సెస్ అందుకుంటారని తెలిపారు. యశ్ ఒక సామాన్యమైన కుటుంబంలో పుట్టి ఏ విధమైనటువంటి సినీ బ్యాక్ గ్రౌండ్ లేకుండా స్వయంకృషితో ఇండస్ట్రీలో సక్సెస్ అయ్యారని, అలాంటి వ్యక్తిని చూసి కొందరు భయపడుతున్నారంటూ ఈమె తెలిపారు.
ఒక సామాన్యమైన వ్యక్తి నుంచి పాన్ ఇండియా స్టార్ హీరోగా యష్ ఎదగడం కొంతమందికి జీర్ణం కాలేదని అందుకే ఇలాంటి దుష్ప్రచారం చేస్తున్నారని సుమలత చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. అయితే యశ్ గురించి వస్తున్నటువంటి ఈ విమర్శలపై ఆయన తల్లి పుష్ప కూడా తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలా కొంతమంది ఉద్దేశపూర్వకంగానే టాక్సిక్ సినిమా పట్ల విమర్శలు కురిపించగా, మరి కొంతమంది సెలబ్రిటీలు మాత్రం ఈయనకు మద్దతుగా కామెంట్లు చేస్తున్నారు ఇటీవల కాంతార హీరో రిషబ్ శెట్టి సైతం టాక్సిక్ సినిమా గురించి మాట్లాడుతూ..యష్ టాక్సిక్ సినిమా చేయడం ఒక సాహసమైన ప్రయోగం అంటూ ప్రశంసలు కురిపించిన సంగతి తెలిసిందే.
Also Read: కల్కి 2 పై అప్డేట్ ఇచ్చిన నాగ్ అశ్విన్..10 రోజులు మాత్రమే అంటూ!