Hyderabad SIR: స్వేచ్ఛ బ్యూరో: ఓటరు జాబితాలోని తప్పులను సరి చేయటంతో పాటు బోగస్, రిపీటెడ్, డూప్లికేట్ ఓట్ల ఏరివేత కోసం నిర్వహించిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్) ప్ర్రక్రియలో భాగంగా ఇటీవల జారీ చేసిన ఓటరు జాబితా ముసాయిదాలో సర్ 2002 సమాచారం సమర్పించని ఓటర్లకు హైదరాబాద్ జిల్లాలో జీహెచ్ఎంసీ జారీ చేస్తున్న నోటీసులకు స్పందన కరువైంది. హైదరాబాద్ జిల్లాలోని 15 నియోజకవర్గాల్లో మొత్తం 12 లక్షల 53 వేల పై చిలుకు ఓటర్లకు నోటీసులు జారీ చేయాల్సి ఉండగా, ఇప్పటి వరకు జీహెచ్ఎంసీ 4 లక్షల 19 వేల 158 మంది ఓటర్లకు సర్ 2002 సమాచారంతో పాటు తగిన ఆధారాలు, 12 రకాల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసిన గుర్తింపు కార్డులతో విచారణకు హాజరు కావాలని నోటీసులు జారీ చేయగా, చాలా నోటీసులకు ఓటర్ల నుంచి స్పందన కరువైంది.
మరో 8 లక్షల 34 వేల 715 నోటీసులను జీహెచ్ఎంసీ జారీ చేయాల్సి ఉంది. ఇప్పటి వరకు జారీ చేసిన నోటీసుల్లో సుమారు 98 వేల 705 మంది ఓటర్లు విచారణకు వచ్చేందుకు నిరాకరించగా, వీటిలో పది మంది ఓటర్ల విచారణకు సమయం, వేదికను రీ షెడ్యూల్ చేశారు. కాగా, ఆగస్టు 17వ తేదీన ఓటరు జాబితా ముసాయిదాను జారీ చేసిన జిల్లా ఎన్నికల అధికారులు మరుసటి రోజైన 18వ తేదీన నుంచి సోమవారం వరకు గడిచిన 13 రోజుల్లో కేవలం 10 వేల 33 హియరింగ్ లు మాత్రమే నిర్వహించారు.
వీటిలో ఓటర్లు ఎలాంటి ఆధారాల్లేకుండా కేవలం నోటీసుల పట్టుకుని విచారణకు హాజరవుతుండటంతో, బర్త్, సర్టిఫికెట్ గానీ, టెన్త్ మెమో గానీ, పాస్ పొర్టు గానీ సమర్పించాలని అసిస్టెంట్ ఎలక్ట్రోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ సూచించిన తర్వాత తిరిగి వెళ్లి ఆధారాలు పట్టుకోస్తుండటంతో విచారణ ప్రక్రియ చాలా ఆలస్యమవుతుందని ఎలక్షన్ వింగ్ అధికారులు తెలిపారు. హైదరాబాద్ జిల్లాలోని 15 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఇప్పటి వరకు అత్యధికంగా 3 వేల 33 విచారణల యాకుత్ పురా నియోజకవర్గంలో నిర్వహించగా, అన్నింటి కన్నా తక్కువ హియరింగ్ లో జూబ్లీహల్స్ నియోజకవర్గంలో కేవలం నాలుగు విచారణలు మాత్రమే నిర్వహించారు. కోర్ అర్బన్ రీజియన్ పరిధిలోని హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లాల్లో కూడా సర్ విచారణలు అధికారులు ఆశించిన స్థాయిలో జరగటం లేదని తెల్సింది.
Also read: చాణక్య నీతి.. ఈ 6 సందర్భాల్లో మౌనంగా ఉండటమే తెలివైన నిర్ణయం
సర్ ప్రక్రియకు ముందు హైదరాబాద్ జిల్లాలోని 15 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఓటర్ల సంఖ్య 47 లక్షల 36 వేల 669 మంది ఉండగా, సర్ ఫారాల స్వీకరణ ముగిసిన తర్వాత జారీ చేసిన ముసాయిదాలో సుమారు 12 లక్షల 53 వేల పై చిలుకు ఓటర్లు నాన్ మ్యాపింగ్, సర్ 2002 వివరాలు సమర్పించని, ఆబ్సెంట్, షిఫ్టెడ్, డెత్, డూప్లికేట్, రిపీటెడ్ ఓటర్లుగా తేలింది. వీరందరికీ జిల్లా ఎన్నికల విభాగం నోటీసులు జారీ చేసినా, వీరిలో నూటికి 99 శాతం మంది ఓటర్లు స్పందించటం లేదు. విచారణకు హాజరు కావటం లేదు. ఎందకు అన్న విషయాన్ని ఎలక్షన్ వింగ్ అధికారులు పరిశీలించగా, హైదరాబాద్ జిల్లాలోని మొత్తం ఓటర్లలో 40 శాతం అంటే సుమారు 19 లక్షల 41 వేల మంది ఓటర్లు నాన్ మ్యాపింగ్, అనమాలిస్, ఆబ్సెంట్, షిఫ్టెడ్, డెత్ ఓటర్లుగా గుర్తించారు.
వీరిలో అత్యధిక మంది ఓటర్లు విద్య, ఉపాధి, ఉద్యోగం, వ్యాపారాల నిమిత్తం హైదరాబాద్ లో నివాసముంటూ ఇక్కడ ఓటర్లుగా నమోదు చేయించుకోవటంతో పాటు వారి స్వస్థలాల్లో సర్ ఎన్యుమరేషన్ ఫారాలు సమర్పించి, అక్కడే ఓటరు గా కొనసాగాలని భావిస్తున్నందున, హైదరాబాద్ జిల్లాలోని తమ ఓటు హక్కును కోరుకోకపోవటం వల్లే వారు విచారణకు హాజరుకావటం లేదన్న విషయాన్ని అధికారులు గుర్తించారు. దీంతో పాటు హైదరాబాద్ జిల్లాలో ఇంకా నాలుగు నియోజకవర్గాలు మలక్ పేట, అంబర్ పేట, ఖైరతాబాద్, సనత్ నగర్ నియోజకవర్గాల్లో ఇంకా హియరింగ్ లు మొదలు పెట్టలేదు.
క్యూర్ పరిధిలోని హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లాల్లో మొత్తం 38 లక్షల 94 వేల 648 నోటీసులు జారీ చేయాల్సి ఉండగా, ఇప్పటి వరకు 8 లక్షల 28 వేల 115 నోటీసులు జారీ చేసి, ఇప్పటి వరకు కేవలం 41 వేల 910 విచారణలు మాత్రమే నిర్వహించారు. హైదరాబాద్ లో 10 వేల 33, రంగారెడ్డి జిల్లాలో 15 వేల 436, మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లాలో 16 వేల 441 మాత్రమే విచారణలు నిర్వహించారు. వీటిలో గడువు ముగిసిపోయిన నోటీసులు రంగారెడ్డి జల్లాలో లక్షా 70 వేల 843 ఉండగా, హైదరాబాద్ జిల్లాలో 98 వేల 705 కాగా, మేడ్జల్ మల్కాజ్ గిరి జిల్లాలో 3 లక్షల 92 వేల 47 నోటీసులున్నాయి.
Also read: ఓడిపోతామనే భయం.. కుట్రలకు తెరలేపారు, వైసీపీపై సీఎం చంద్రబాబు ఫైర్