E-Paper
Advertisement

కల్కి 2 పై అప్డేట్ ఇచ్చిన నాగ్ అశ్విన్..10 రోజులు మాత్రమే అంటూ!

కల్కి 2 పై అప్డేట్ ఇచ్చిన నాగ్ అశ్విన్..10 రోజులు మాత్రమే అంటూ!
Advertisement

Nag Ashwin: పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా గడుపుతున్నారు. ఇక ప్రభాస్ కొత్త సినిమాలతో పాటు మరికొన్ని సీక్వెల్ సినిమా పనులలో కూడా బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఇలా ప్రభాస్ సినిమాల కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాలలో కల్కి 2 ఒకటి. ప్రముఖ దర్శకుడు నాగ్ అశ్విన్ డైరెక్షన్లో ప్రభాస్ హీరోగా వైజయంతి మూవీస్ బ్యానర్ పై ఈ సినిమా తెరకెక్కుతుంది. ఇదివరకే ఈ బ్యానర్ నుంచి వచ్చిన మొదటి భాగం కల్కి భారీ స్థాయిలో సక్సెస్ అందుకున్న నేపథ్యంలో సీక్వెల్ సినిమాపై అంతకుమించి అంచనాలు ఏర్పడ్డాయి.

కల్కి 2 అప్డేట్ ఇచ్చిన డైరెక్టర్..

ఇప్పటికే కల్కి 2 సినిమా షూటింగ్ పనులు ప్రారంభమైన సంగతి తెలిసిందే. అయితే ఇప్పటివరకు ఈ సినిమాకు సంబంధించి ఎలాంటి అప్డేట్ మేకర్ తెలియచేయకపోవడంతో అభిమానులు ఈ సినిమా అప్డేట్ కోసం ఎదురుచూస్తున్నారు. ఇలాంటి తరుణంలోనే దర్శకుడు నాగ్ అశ్విన్ తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఒక బిగ్ అప్డేట్ తెలియజేశారు. ఇటీవల నాగ్ అశ్విన్ నటుడు దుల్కర్ సల్మాన్ హీరోగా నటించిన ఐమ్ గేమ్ సినిమా ప్రీ రిలీజ్ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సినిమా సెప్టెంబర్ మూడో తేదీ విడుదల కాబోతున్న నేపథ్యంలో హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహించారు.

ప్రభాస్ బిజీ షెడ్యూల్ వల్ల ఆలస్యం..

Advertisement

ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాగ్ అశ్విన్ ను అభిమానులు కల్కి సినిమా అప్డేట్ ఇవ్వాలని కోరడంతో నాగ్ అశ్విన్ మాట్లాడుతూ.. కల్కి 2 సినిమాకు సంబంధించి ఇప్పటివరకు కేవలం 10 రోజుల షూటింగ్ మాత్రమే పూర్తి అయిందని తెలిపారు. ఈ సినిమా షూటింగ్ కేవలం ప్రారంభ దశలో ఉందని ప్రస్తుతం ప్రభాస్ ఇతర సినిమా పనులలో బిజీగా ఉన్న నేపథ్యంలో షూటింగ్ ఆలస్యం అవుతుందని తెలిపారు. ప్రభాస్ ఇతర కమిట్మెంట్స్ పూర్తి అయిన తర్వాత తదుపరి షెడ్యూల్ షూటింగ్ ప్రారంభమవుతుందని నాగ్ అశ్విన్ వెల్లడించారు.ఇలా ఈ సినిమా కేవలం పది రోజులు షూటింగ్ మాత్రమే జరుపుకుందనే విషయాన్ని తెలియజేయడంతో అభిమానులు కాస్త నిరుత్సాహం వ్యక్తం చేస్తున్నారు.

కల్కి 2 నుంచి తప్పుకున్న దీపిక..

Advertisement

ప్రభాస్ బిజీ షెడ్యూల్ కారణంగానే షూటింగ్ ఆలస్యమవుతుంది. ఇక ఈ సినిమాలో సీనియర్ నటులు కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్ కీలక పాత్రలో కనిపించబోతున్నారు. ఇక మొదటి భాగంలో హీరోయిన్ గా దీపిక పదుకొనే సుమతి పాత్రలో నటించారు అయితే పలు కారణాలవల్ల దీపికా పదుకొనేను ఈ సినిమా నుంచి చిత్ర నిర్మాతలు తప్పించిన సంగతి తెలిసిందే. ఇలా దీపిక ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకోవడంతో సుమతి పాత్ర కోసం ఎవరిని ఎంపిక చేయబోతున్నారు అంటూ అభిమానులు సందేహాలు వ్యక్తం చేశారు. ఇక సుమతి పాత్రలో భాగంగా అనుష్క, సాయి పల్లవి, కృతి సనన్, అలియా భట్ వంటి తదితర హీరోయిన్ల పేర్లు తెరపైకి వచ్చాయి కానీ ఇప్పటివరకు చిత్ర నిర్మాతల నుంచి మాత్రం అధికారకంగా ఎలాంటి ప్రకటన రాలేదు.

Also Read: పెళ్లిపీటలెక్కిన ‘జగధాత్రి’ సీరియల్ నటి…ఫోటోలు వైరల్!

Related News

ఈ జనరేషన్‌కు మరో బ్రహ్మానందం దొరికేశాడు.. కోనా వెంకట్ కామెంట్స్!

గ్లామర్ మాత్రమే కాదు.. చీరకట్టులోనూ త్రిష అందం అదుర్స్!

రజనీకాంత్‌కు తిరుగులేదుగా.. ‘జైలర్ 2’ కలెక్షన్ల లెక్క ఇదే!

గ్యాంగ్‌స్టర్ సినిమా అనుకుంటే.. చిరంజీవి సినిమాలో అసలు ట్విస్ట్ ఇదే!

రేవంత్ రెడ్డి, కేసీఆర్‌తో పరిచయాలున్నా.. ఆ పని మాత్రం చేయలేదు!

స్పెషల్ అట్రాక్షన్ గా రణబీర్ వాచ్.. రాముడు, హనుమంతుడితో ప్రత్యేక డిజైన్..

దాసరి సినిమా షూటింగ్‌లో అసలేం జరిగింది? దివ్యవాణి బయటపెట్టిన విషయాలు

రణబాలి విషయంలో నేను చెప్పిందే జరిగింది.. విజయ్ కామెంట్స్ వైరల్!

Big Stories

Advertisement
×