E-Paper
Advertisement

Actress Vahini : క్యాన్సర్ తో పోరాడుతున్న నటి.. ఆర్థిక సాయం కోరుతూ పోస్ట్..

Actress Vahini : క్యాన్సర్ తో పోరాడుతున్న నటి.. ఆర్థిక సాయం కోరుతూ పోస్ట్..

Actress Vahini : సినీ ఇండస్ట్రీ ఒక అందమైన రంగుల ప్రపంచం.. ఎప్పుడు ఎవరికి అదృష్టం వరిస్తుందో.. ఎప్పుడూ ఎవరి పరిస్థితి దారుణంగా మారుతుందో చెప్పడం కష్టం.. అందుకే చాలామంది ఆర్టిస్టులు దీపం ఉండగానే ఇంటిని చక్క పెట్టుకుంటున్నారు. సినిమాల్లో వరసగా అవకాశాలు వస్తున్న సమయంలోనే బాగా ఆస్తులను కూడబెట్టుకోవడమో, పలు వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టడం చేస్తూ లాభాలను అర్జిస్తున్నారు. కొందరి పరిస్థితి మాత్రం దారుణంగా.. ఇండస్ట్రీలో అవకాశాలు రాకపోవడంతో ఆర్థిక ఇబ్బందులు, మరోవైపు అనారోగ్య సమస్యలతో పోరాడుతున్నారు.. తాజాగా మరో నటి పరిస్థితి దారుణంగా మారిపోయింది.. ఆమె క్యాన్సర్ తో పోరాడుతూ ఆర్థిక సాయం కోసం ఎదురుచూస్తుంది. ఆ నటి మరెవరో కాదు వాహిని.. ఎన్నో సినిమాలు, సీరియల్స్‌లో నటించి గుర్తింపు తెచ్చుకున్న ఆమె ఆరోగ్యం క్షీణించి ప్రస్తుతం ఐసీయూలో చికిత్స పొందుతున్నారు.. ఆమె పరిస్థితి గురించి నటి కరాటే కళ్యాణి ఎమోషనల్ పోస్ట్ చేశారు.. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతుంది.

క్యాన్సర్ తో పోరాడుతున్న సినీ నటి..

టాలీవుడ్‌లో సహాయ నటి‌గా ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించిన వాహిని అలియాస్ పద్మక్క గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎన్నో సినిమాల్లో నటించి ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. ఒక్కో సినిమాతో తన నటనతో ప్రేక్షకులను అలరించిన నటి వాహిని ప్రస్తుతం క్యాన్సర్ తో పోరాడుతుంది..గత కొన్ని నెలలుగా ఆమె రొమ్ము క్యాన్సర్తో బాధపడుతూ చికిత్స పొందుతున్నారు. పరిస్థితి అత్యంత క్లిష్టంగా మారి బహుళ అవయవాల పనితీరులో లోపాలు కనిపించడంతో ఆమె పరిస్థితి దారుణంగా మారడంతో ఆమె ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు వైద్యులు. ప్రస్తుతం కీమోథెరపీ, ఆపరేషన్ లు చెయ్యాల్సి ఉన్నాయి. దానికి దాదాపు 35 లక్షల వరకు ఖర్చు అవుతుందని తెలుస్తుంది. ఆమె ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉండడంతో సాయం కోసం ఎదురుచూస్తున్నారు..

Also Read : అఖండ 2 మూవీలో ప్రభాస్ సర్ప్రైజ్.. అస్సలు ఊహించలేదు..!

ఆర్థిక సాయం కోసం కరాటే కళ్యాణి పోస్ట్..

నటి వాహిని పరిస్థితి గురించి తెలుసుకున్న సినీ నటి కరాటే కళ్యాణి ఎమోషనల్‌ అయ్యారు.. అంతే కాదు ప్రస్తుతం ఆమె పరిస్థితి ఎలా ఉంది అని తను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆ పోస్ట్ లో.. పోస్ట్‌తో వాహిని ఆరోగ్య పరిస్థితి అందరికీ తెలిసిందే. వాహిని తమకు చిన్నప్పటి నుంచి తెలిసిన వ్యక్తి అని, విజయనగరంలో ఆమె ఇంటి పక్కనే ఉండేవారమని గుర్తుచేసుకున్నారు. పరిశ్రమలో ఎన్నో పాత్రలు చేసినా, ఇప్పుడు జీవన్మరణ యుద్ధంలో ఉన్న వాహినికి మన సహాయం అత్యవసరం.. ఎన్నో సినిమాలతో అలరించిన ఆమె ప్రాణాలతో పోరాడుతుంది. మీరు ఆమెకు ఆర్థిక సాయాన్ని అందించింది చేయూతను ఇవ్వాలని కోరుతున్నాని కళ్యాణి పోస్ట్ లో రాసుకొచ్చారు. ప్రస్తుతం ఆ పోస్టు వైరల్ అవ్వడంతో చాలామంది సాయం చేసేందుకు ముందుకు వస్తున్నారని తెలుస్తుంది.. అంతే కాదు ఆమె త్వరగా కోలుకొని మళ్ళీ సినిమాలు, సీరియల్స్ చేయాలని కోరుకుంటున్నారు..

https://www.facebook.com/share/p/1B4ShZXzZu/

Related News

అభిమానిపై ‘రాకింగ్ స్టార్’ రియల్ ప్రేమా.. క్యాన్సర్ బాధితుడికి వీడియో కాల్ చేసిన యష్!

పెద్ది’ మూవీ రివ్యూ: రామ్ చరణ్ ఊరమాస్ జాతర.. బుచ్చిబాబు హిట్ కొట్టాడా?

పెద్ది ఓటీటీ లాక్….అప్పుడే డిజిటల్ స్ట్రీమింగ్ పై క్లారిటీ వచ్చేసిందిగా!

ప్రభాస్ ‘స్పిరిట్’ లొకేషన్ సెల్ఫీ లీక్.. లుక్ చూస్తే పూనకాలే!

బన్నీ-లోకేష్ కనగారాజ్ సినిమా క్యాన్సిల్ అయిందా? …. అసలు నిజం తెలిస్తే షాకవ్వాల్సిందే!

చరణ్ ‘పెద్ది’ బాక్సాఫీస్ బ్యాటింగ్ స్టార్ట్.. సమంత, వరుణ్ తేజ్ రివ్యూస్ వైరల్.. ‘మెగా 158’ టీమ్ స్పెషల్ విష్

పెద్ది’ రిలీజ్ వేళ రచ్చ.. రామ్ చరణ్ విగ్రహంపై దారుణంగా ట్రోల్స్, క్షమాపణలు చెప్పిన ఫ్యాన్స్!

ఇది కదా క్యారెక్టర్ డెడికేషన్ అంటే! ‘పెద్ది’ గెటప్‌లో రోడ్లపై తిరిగిన జగ్గూభాయ్..

Big Stories

×