E-Paper
Advertisement

Lip Pigmentation: పెదాలు నల్లగా మారాయా ? ఈ టిప్స్ పాటిస్తే బెస్ట్ రిజల్ట్

Lip Pigmentation: పెదాలు నల్లగా మారాయా ? ఈ టిప్స్ పాటిస్తే బెస్ట్ రిజల్ట్
Advertisement

Lip Pigmentation: పెదవుల చర్మం చాలా సున్నితంగా ఉంటుంది. హార్మోన్ల మార్పులు, ఎండకు ఎక్కువగా గురికావడం, ధూమపానం, నాణ్యత లేని కాస్మెటిక్స్ వాడటం లేదా నిర్జలీకరణం వంటి అనేక కారణాల వల్ల పెదవుల సహజ రంగు తగ్గి, నల్లగా లేదా పాలిపోయినట్లు కనిపిస్తాయి. ఈ పెదవుల పిగ్మెంటేషన్‌ను తగ్గించి, వాటికి మళ్లీ సహజమైన గులాబీ రంగును అందించడానికి ఉపయోగపడే 6 ప్రభావవంతమైన చిట్కాలు ఉన్నాయి.అవేంటో ఇప్పుడు తెలుకుందాం.

హోం రెమెడీస్:
1. నిమ్మరసం, తేనె, గ్లిజరిన్ :

Advertisement

ఒక టీస్పూన్ తేనె, కొద్ది చుక్కల నిమ్మరసం, కొద్దిగా గ్లిజరిన్‌ను బాగా కలపండి. ఇది పెదవుల పిగ్మెంటేషన్‌ను తగ్గించడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇలా తాయారు చేసిన ఈ మిశ్రమాన్ని రాత్రి పడుకునే ముందు పెదవులపై బాగా మసాజ్ చేసి.. రాత్రంతా అలాగే ఉంచండి. ఉదయం చల్లటి నీటితో శుభ్రం చేయండి. నిమ్మరసంలో ఉండే సిట్రిక్ యాసిడ్ సహజ బ్లీచింగ్ ఏజెంట్‌గా పనిచేసి.. నల్లదనాన్ని తగ్గిస్తుంది. తేనె, గ్లిజరిన్ తేమను అందించి, పెదవులు పొడిబారకుండా కాపాడతాయి.

2. రోజ్ వాటర్, బీట్రూట్ జ్యూస్:
బీట్‌రూట్ లో ఉండే సహజసిద్ధమైన ముదురు గులాబీ రంగు పెదవులకు రంగును అందించి.. నల్లటి మచ్చలను తగ్గిస్తుంది.
కొద్దిగా బీట్రూట్ జ్యూస్ తీసి, దానికి రెండు చుక్కల రోజ్ వాటర్‌ను కలపండి. దీనిని రాత్రి పడుకునే ముందు పెదవులపై అప్లై చేయండి. ఇది సహజమైన లిప్ టింట్ లాగా కూడా పనిచేస్తుంది.
బీట్‌రూట్‌లో బేటలైన్స్ అనే యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి చర్మాన్ని మృదువుగా ఉంచుతాయి. ఇందులోని రోజ్ వాటర్ పెదవులను చల్లబరుస్తుంది.

Advertisement

3. అలోవెరా జెల్:
కలబంద చర్మానికి చల్లదనాన్ని ఇవ్వడంలో.. గాయాలను మాన్పడంలో ప్రసిద్ధి చెందింది.తాజా కలబంద ఆకు నుంచి గుజ్జును తీయండి లేదా ఆర్గానిక్ అలోవెరా జెల్‌ను తీసుకోండి. రోజుకు రెండు సార్లు.. ముఖ్యంగా ఎండ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత.. ఈ గుజ్జును పెదవులపై సున్నితంగా మసాజ్ చేయండి. కలబందలో అలోసిన్ అనే సమ్మేళనం ఉంటుంది. ఇది మెలనిన్ ఉత్పత్తిని నిరోధించి, పిగ్మెంటేషన్‌ను తగ్గిస్తుందని అధ్యయనాలు సూచిస్తున్నాయి.

4. పసుపు, పాలు:
పసుపు ఒక అద్భుతమైన ఆయుర్వేద ఔషధం. ఇందులో చర్మాన్ని ప్రకాశవంతం చేసే గుణాలు ఉన్నాయి. చిటికెడు పసుపును కొద్దిగా పాల (లేదా పెరుగు)తో కలిపి పేస్ట్‌లా చేయండి. ఈ పేస్ట్‌ను పెదవులపై అప్లై చేసి.. సుమారు 15 నిమిషాల తర్వాత శుభ్రం చేయండి. పసుపులో ఉండే కర్కుమిన్ పిగ్మెంటేషన్‌ను తగ్గించడంలో సహాయపడుతుంది. పాలలో ఉండే లాక్టిక్ యాసిడ్ పెదవులను మృదువుగా మారుస్తుంది.

Also Read: పాదాల్లో కనిపించే 6 ఆరోగ్య హెచ్చరికలు.. అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు !

5. చక్కెర స్క్రబ్ :
నల్లబడిన పెదవులపై ఉన్న మృతకణాలను తొలగించడానికి స్క్రబ్బింగ్ చాలా అవసరం. ఒక టీస్పూన్ చక్కెరను కొద్దిగా తేనె లేదా ఆలివ్ ఆయిల్‌తో కలపండి.
ఈ మిశ్రమంతో మీ పెదవులను సున్నితంగా 1-2 నిమిషాలు మసాజ్ చేయండి. తర్వాత కడిగి.. మాయిశ్చరైజర్ అప్లై చేయండి. చక్కెర సహజమైన ఎక్స్‌ఫోలియేటర్‌గా పనిచేసి, పైపొరలోని నల్లబడిన కణాలను తొలగిస్తుంది. దీని ద్వారా పెదవుల కింద ఉన్న తాజా.. గులాబీ రంగు చర్మం బయటపడుతుంది.

6. బాదం నూనె:
బాదం నూనెలో చర్మాన్ని కాంతివంతం చేసే, పోషకాలను అందించే గుణాలు పుష్కలంగా ఉన్నాయి. స్వచ్ఛమైన బాదం నూనెను తీసుకోండి. ప్రతి రోజు రాత్రి పడుకునే ముందు 2-3 చుక్కల నూనెను పెదవులపై రాసి, మసాజ్ చేయండి. బాదం నూనెలో విటమిన్ ఇ, ఇతర ఎమోలియంట్స్ ఉంటాయి. ఇవి పెదవులకు లోతుగా తేమను అందించి.. మెలనిన్‌ను తగ్గిస్తాయి. అంతే కాకుండా పెదాలను ఎర్రగా మార్చడానికి కూడా ఉపయోగపడతాయి.

Related News

గ్రీన్ టీ తాగుతున్నా బరువు తగ్గట్లేదా? అయితే మీరు ఈ 5 తప్పులు చేస్తున్నట్టే!

గుండెపోటు వెనక అసలు విలన్ ప్లాస్టిక్కేనా? మెడికల్ హిస్టరీలోనే షాకింగ్ నిజాలు!

మ్యూజిక్ లవర్స్‌కి పండగే..తక్కువ ధరలో ఎక్కువ బేస్ ఇచ్చే క్రేజీ బడ్స్!

మీ బంధువులు, స్నేహితులను ఈ 4 ప్రశ్నలు ఎప్పుడూ అడగకూడదు.. రిలేషన్ దెబ్బతింటుంది

ఛార్జింగ్ అవసరం లేని.. ఈ మ్యాజికల్ వేరబుల్ డివైస్ విశేషాలివే!

ఐలైనర్ సరిగ్గా రావడం లేదా? పర్ఫెక్ట్ లుక్ కోసం ఈజీ మేకప్ ట్రిక్స్‌ ఇవిగో

ఇంటి ఖర్చులకు నెలజీతం సరిపోవడం లేదా? అదనపు ఆదాయం ఇలా సంపాదించండి

భోజనం చేసినా, ఏదైనా తాగినా వెంటనే లిప్‌స్టిక్ పాడవుతోందా? రోజంతా పెదాలు కలర్‌ఫుల్‌గా ఉండేందుకు చిట్కాలు

Big Stories

Advertisement
×