Adarsha Kutumbam Trailer:‘ఆదర్శ కుటుంబం – హౌస్ నంబర్ 47’ ..విక్టరీ వెంకటేష్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో వస్తున్న ఈ సినిమా పై అంచనాలు ఎలా పెరిగిపోతున్నాయో తెల్సిందే.ఇక ఇప్పటికే విడుదలైన పాటలు, టీజర్ ఆకట్టుకోగా.. తాజాగా వచ్చిన ట్రైలర్ సినిమాపై మరింత హైప్ పెంచేసింది. ముఖ్యంగా వెంకటేష్‌ను తనదైన కామెడీ టైమింగ్‌తో చూడటంతో పాటు, యాక్షన్ సీన్లలో కూడా కొత్తగా చూపించడంతో ఈ సినిమాని ఎప్పుడెప్పుడు చూస్తామా అంటూ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు మూవీ లవర్స్.
మాములుగా వెంకీ మామ సినిమా అంటే ఫ్యామిలీ ఆడియన్స్ లో ఎంత క్రేజ్ ఉంటుందో చెప్పక్కర్లేదు. ‘నువ్వు నాకు నచ్చావ్’, ‘మల్లీశ్వరి’, ‘సంక్రాంతి’, ‘ఎఫ్2’, ‘ఎఫ్3’ లాంటి సినిమాలతో ఆయన సెట్ చేసిన ట్రెండ్ అలాంటిది మరి. మరోవైపు త్రివిక్రమ్ తన సినిమాల్లో ఫ్యామిలీ ఎమోషన్స్, కామెడీతో పాటు పంచ్ డైలాగ్స్ కి ఎంత ఇంపార్టెన్స్ ఉంటుందో తెల్సిందే. అలాంటిది ఈ ఇద్దరూ కలిసి సినిమా చేస్తున్నారంటే అంచనాలు ఏ రేంజ్‌లో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
ఇక తాజాగా విడుదలైన ‘ఆదర్శ కుటుంబం’ ట్రైలర్ చూస్తుంటే ఇందులో కామెడీ మాత్రమే కాకుండా యాక్షన్, ఎమోషన్, సస్పెన్స్ కూడా బాగానే ఉన్నట్లు కనిపిస్తోంది. కుటుంబంలో జరిగే సంఘటనలతో కథ మొదలై, ఆ తర్వాత ఊహించని మలుపులు తిరుగుతున్నట్లు ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది.అయితే మామూలు ఫ్యామిలీ డ్రామాలా కాకుండా కథలో కొన్ని థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ని గట్టిగానే దట్టించినట్టు తెలుస్తోంది. దీంతో హౌస్ నంబర్ 47 వెనుక ఏదైనా సీక్రెట్ ఉందా? వెంకటేష్ పాత్ర చుట్టూ ఎలాంటి సంఘటనలు జరుగుతాయి? అనే విషయాలు ఇపుడు ఆడియన్స్ లో క్యూరియాసిటీ పెంచేస్తున్నాయి .
ఇక వెంకటేష్ విషయానికి వస్తే.. ఈ సినిమాలో చాలా ఎనర్జిటిక్‌గా కనిపిస్తున్నారు. తనదైన కామెడీతో నవ్విస్తూనే, యాక్షన్‌తోనూ ఆకట్టుకునేలా ఉన్నారు. ఒకవైపు ఫ్యామిలీ ఆడియన్స్‌ను అలరించే సీన్స్, మరోవైపు యూత్ కి నచ్చే యాక్షన్, సస్పెన్స్ ఎలిమెంట్స్ తో సినిమా అన్ని వర్గాల ఆడియన్స్ ని టార్గెట్ చేస్తున్నట్లు కనిపిస్తోంది.
ఇక త్రివిక్రమ్ సినిమాల్లో డైలాగ్స్ కి ఎంత ఇంపార్టెన్స్ ఉంటుందో తెలిసిందే. ‘అత్తారింటికి దారేది’, ‘అల వైకుంఠపురములో’ వంటి సినిమాల్లో ఫ్యామిలీ ఎమోషన్స్‌తో పాటు ఎంటర్ టైన్ మెంట్ ని సరిగ్గా బ్లెండ్ చేశాడు గురూజీ. మరి ఇప్పుడు వెంకటేష్‌తో కలిసి చేస్తున్న ఈ సినిమాలోనూ అలాంటి మ్యాజిక్‌ను రిపీట్ చేస్తారా అన్నది ఆసక్తికరంగా మారింది.
మరోవైపు థమన్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ట్రైలర్‌కు హైలైట్ అని చెప్పాలి.యాక్షన్ సీన్లలో మ్యూజిక్ అదిరిపోయేలా ఉండగా, సస్పెన్స్ సన్నివేశాల్లో ఉత్కంఠను పెంచేలా ఉందనే చెప్పాలి. కామెడీ, ఎమోషన్, థ్రిల్లింగ్ సీన్లను కలిపి ట్రైలర్ ఇంట్రెస్టింగ్ డిజైన్ చేశారు మేకర్స్.
ఇక ఈ సినిమాలో క్యాస్టింగ్ విషయానికి వస్తే శ్రీనిధి శెట్టి, నారా రోహిత్, నివేదా పేతురాజ్, రావు రమేష్, సత్య, బ్రహ్మాజీ, వెన్నెల కిషోర్, రఘుబాబు తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇంతమంది యాక్టర్స్ ఉన్నారంటే కామెడీకి లోటు ఉండదనే చెప్పాలి.
ఇక హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై ఎస్. రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ సినిమా అక్టోబర్ 30న వరల్డ్ వైడ్ గా థియేటర్లలో రిలీజ్ కానున్న సంగతి తెల్సిందే. చూడాలి మరి రైటర్ గా మల్లీశ్వరీ, నువ్వు నాకు నచ్చావ్ అంటూ కల్ట్ సినిమాలని అందించిన త్రివిక్రమ్ అదే రోజున రానున్న కల్ట్ సినిమాని ఎలా ఎదుర్కుంటాడో !