E-Paper
Advertisement

ప్రభాస్ సలార్ 2 షూటింగ్ పై ప్రశాంత్ నీల్ బిగ్ అప్డేట్!

ప్రభాస్ సలార్ 2 షూటింగ్ పై ప్రశాంత్ నీల్ బిగ్ అప్డేట్!
Advertisement

Prabhas Salaar 2: పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ ప్రస్తుతం వరుస పాన్ ఇండియా సినిమాలకు కమిట్ అయిన సంగతి తెలిసిందే. ఇక నేడు ప్రభాస్ పుట్టిన రోజు(Prabhas Birthday) కావడంతో ఈయన కొత్త సినిమాలకు సంబంధించి వరుస అప్డేట్స్ మేకర్స్ తెలియజేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రభాస్ సలార్ 2(Salaar 2) సినిమాకు సంబంధించిన అప్డేట్ కోసం అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. తాజాగా డైరెక్టర్ ప్రశాంత్ నీల్(Prashanth Neel) సలార్ 2 సినిమాకు సంబంధించి క్రేజీ అప్డేట్ విడుదల చేశారు. ఈ సినిమా షూటింగ్ ఎప్పుడు ప్రారంభమవుతుంది అనే విషయాన్ని ఈయన తెలియజేస్తూ ఒక వీడియోని తన సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు.

2027 జూన్ నుంచి సలార్ 2 షూటింగ్..

ప్రశాంత్ నీల్ సమర్పణలో 418 సినిమా(418 Movie) విడుదలైన సంగతి తెలిసిందే. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా ప్రభాస్ సైతం ఒక వీడియోని విడుదల చేశారు. ఇందులో భాగంగా సలార్ 2 సినిమాకి సంబంధించిన అప్డేట్ కూడా తెలియజేశారు. ప్రభాస్ పుట్టినరోజు కావడంతో ఈయన డైరెక్టర్ ప్రశాంత్ తో మాట్లాడుతూ నా బర్త్ డే గిఫ్ట్ ఏది? అంటూ అడిగారు. వెంటనే ప్రశాంత్ ఈరోజు సాయంత్రం ఉంటుంది అని చెబుతూ.. సలార్ షూటింగ్ అప్డేట్ తెలియజేశారు. సలార్ 2 సినిమా 2027 జూన్ నుంచి రెగ్యులర్ షూటింగ్ పనులను జరుపుకుంటుందని తెలియజేశారు. ఇదే విషయాన్ని ప్రశాంత్ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ డైనోసార్ ఈజ్ బ్యాక్ అని తెలిపారు.

సలార్ పాత్రల పరిచయం మాత్రమే..

Advertisement

ఇదివరకే వీరిద్దరి కాంబినేషన్ లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సలార్ సినిమా ఎంతో మంచి సక్సెస్ అందుకుంది అయితే అసలు కథ మొత్తం సీక్వెల్స్ సినిమాలో ఉందని సలార్ సినిమా కేవలం పాత్రల పరిచయం మాత్రమేనని ప్రశాంత్ నీల్ తెలియజేశారు. ఇక ప్రస్తుతం ప్రభాస్ తో పాటు ప్రశాంత నీల్ కూడా ఇతర కమిట్మెంట్స్ తో బిజీగా ఉన్న నేపథ్యంలో ఈ సినిమా మరికొద్ది రోజులు ఆలస్యమవుతుందని తెలుస్తోంది. ప్రభాస్ ప్రస్తుతం ఫౌజీ సినిమాతో పాటు, స్పిరిట్ సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్నారు. ఈ సినిమాలు షూటింగ్ పూర్తి అయిన తరువాతనే సలార్ 2 షూటింగ్ లో పాల్గొనబోతున్నారు మరోవైపు కల్కి 2 షూటింగ్ కూడా జరుగుతున్న సంగతి తెలిసిందే.

Advertisement

ఇక డైరెక్టర్ ప్రశాంత్ నీల్ సైతం యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా డ్రాగన్ అనే వర్కింగ్ టైటిల్ తో షూటింగ్ పనులను జరుపుకుంటుంది. ఈ సినిమాని ప్రశాంత్ 2027 జూన్ 11వ తేదీ ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు ప్రకటించారు. ఇలా ఎన్టీఆర్ డ్రాగన్ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని విడుదల అయిన అనంతరం ప్రభాస్ తో సలార్ 2 సినిమా పనులు మొదలు పెట్టబోతున్నారని తెలుస్తోంది. ఇక ప్రభాస్ నటించిన ఫౌజీ చివరి దశ షూటింగ్ పనులను జరుపుకుంటుంది ఈ సినిమా డిసెంబర్లో విడుదల కావాల్సిందిగా కొన్ని కారణాలవల్ల డిసెంబర్ నుంచి తప్పుకొని వచ్చేయడాది మార్చి 19న విడుదలకు సిద్ధమవుతుంది.

Also Read: రాధేశ్యామ్ లాగా తీస్తే బాగుండదుగా.. ప్రభాస్ పై పంచ్ వేసిన ప్రశాంత్ నీల్!

Related News

ప్రభాస్ చేతిలో గన్.. ‘ఫౌజీ’ పోస్టర్ మామూలుగా లేదుగా!

ప్రేమ, పెళ్లి గురించి వెంకీ మామ కామెడీ.. స్టేజ్ మీద నవ్వులే నవ్వులు!

ఆదర్శ కుటుంబం ట్రైలర్ వచ్చేసింది.. కథలో ఏదో కొత్తగా ఉందే!

రాధేశ్యామ్ లాగా తీస్తే బాగుండదుగా.. ప్రభాస్ పై పంచ్ వేసిన ప్రశాంత్ నీల్!

కళే నా ప్రాణం.. కానీ నన్నే మోసం చేశారు.. గరివిడి లక్ష్మి కన్నీటి కథ!

హే యూ అంటూ హీట్ పెంచేసిన అనుపమ.. లుక్ మామూలుగా లేదుగా!

వెంకటేష్ తో కలసి స్టేజ్ పై అదిరిపోయే స్టెప్పులేసిన మల్లారెడ్డి కోడలు ప్రీతి!

Big Stories

Advertisement
×