E-Paper
Advertisement

Chandrahas: చంద్రహాస్ పాట వివాదం.. శంబాల హీరో ఊహించని రియాక్షన్!

Chandrahas: చంద్రహాస్ పాట వివాదం.. శంబాల హీరో ఊహించని రియాక్షన్!
Advertisement

Chandrahas:ప్రముఖ సీరియల్ నటుడు, బుల్లితెర మెగాస్టార్ గా పేరు సొంతం చేసుకున్న ప్రభాకర్ (Prabhakar) గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. విలక్షణమైన నటనతో ఒకవైపు నటుడిగా మరొకవైపు షోలలో తన కామెడీతో ఊహించని పాపులారిటీ సొంతం చేసుకున్నారు. అలాంటి ఈయన వారసుడు చంద్రహాస్ (Chandrahas) హీరోగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. ఇప్పటికే పలు చిత్రాలలో నటిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న ఈయన తాజాగా నటిస్తున్న చిత్రం ‘బరాబర్ ప్రేమిస్తా’.. ఇక ఫిబ్రవరి 6వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఘనంగా నిర్వహించారు.

చంద్రహాస్ పాట వివాదం.. స్పందించిన ఆది సాయికుమార్..

ఈ ఈవెంట్ లో చంద్రహాస్ పాడిన పాట అలాగే ఆ సినిమాలో పాట వివాదంగా మారింది. దీంతో పలు సెక్షన్ల కింద ఈయనపై కేసు నమోదు కాగా, తాజాగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన ‘ఆది శంబాల’ హీరో ఆది సాయికుమార్ (Adhi Sai Kumar) ఎక్స్ వేదికగా స్పందించి ఊహించని కామెంట్లు చేశారు. తాజాగా ఆది సాయికుమార్ మాట్లాడుతూ.. ప్రముఖ నటుడు ప్రభాకర్ ఆహ్వానం మేరకే ‘బరాబర్ ప్రేమిస్తా’ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి గెస్ట్ గా వెళ్లినట్లు ఆయన ఎక్స్ వేదికగా వెల్లడించారు.” పాట వివాదాన్ని నేను ఊహించలేదు. ఎంతోమందిని ప్రభావితం చేసే అలాంటి ఈవెంట్లలో బాధ్యతాయుతంగా ప్రవర్తించాల్సిన అవసరం కచ్చితంగా ఉంది” అంటూ తన అభిప్రాయంగా వ్యక్తపరిచారు ఆది సాయి కుమార్. ప్రస్తుతం ఈయన చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

చంద్రహాస్ పై కేసు నమోదు చేయాలంటూ డిమాండ్లు..

Advertisement

ఇకపోతే చంద్రహాస్ పాట వివాదంగా మారడానికి కారణం ఏమిటంటే.. చంద్రహాస్ తాజాగా నటిస్తున్న బరాబర్ సినిమాలోని ఒక పాటలో హిందూ దేవుళ్లను ముఖ్యంగా శివుడిని కించపరిచేలా పదజాలం ఉందంటూ పలువురు అభ్యంతరం వ్యక్తం చేశారు. ముఖ్యంగా ఆయన ఈ పాటను పాడిన తీరు భక్తుల మనోభావాలు దెబ్బతీసేలా.. అందుకే ఈ పాట చిత్రీకరణ సాహిత్యం ఉన్నాయని ఆరోపిస్తూ కొంతమంది వ్యక్తులు పోలీసులను ఆశ్రయించారు. చిత్ర నటుడు అలాగే చిత్ర బృందంపై తగిన చర్యలు తీసుకోవాలని ముఖ్యంగా విభాగాస్పదంగా ఉన్న ఈ పాటను వెంటనే తొలగించాలని, సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ల నుండి కూడా ఆ పాటను తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇకపోతే ఫిర్యాదు పై స్పందించిన పోలీసులు కేసును పరిశీలించి తదుపరి చర్యలు తీసుకుంటామని వెల్లడించిన విషయం తెలిసిందే.

ALSO READ:Peddi: రిలీజ్ డేట్ ఓకే.. మరి టికెట్ హైక్ సంగతేంటి?

పలు సెక్షన్ల కింద చంద్రహాస్ పై కేసు ఫైల్..

Advertisement

అయితే ఇప్పుడు ఈ విషయంపై హీరో చంద్రహాస్ పై పలు సెక్షన్ల కింద కేసు నమోదు అయ్యింది.ఇకపోతే తాజాగా హీరో చంద్రహాస్ పై హైదరాబాదులో మాదాపూర్ పోలీసులు పలు సెక్షన్ల కింద కేసుల నమోదు చేశారు. బిఎన్ఎస్ 296, 296 (A), 296 (B), 351 (2), 67 యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. ఇకపోతే బరాబర్ ప్రేమిస్తా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చంద్రహాస్ లైవ్ లో పాడిన పాటలో బూతు పదాలు ఉండడంతో పాటు బెదిరింపులకు పాల్పడ్డారు అని కేసు పెట్టడం తోనే ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.

Related News

టాక్సిక్ ..500కోట్లు అయ్యే పనేనా ?

మా ఆయన కోసమే గాయమైనట్టుంది… పెళ్లి తర్వాత మూడు నెలలు కలవలేదంటూ!

శ్రీకృష్ణుడిగా రౌడీ హీరో విజయ్ దేవరకొండ.. దిల్ రాజు క్రేజీ రీమేక్ ప్లాన్

బన్నీ ట్రిపుల్ రోల్‌పై కొత్త ట్విస్ట్.. ‘రాకా’ కథ మొత్తం మారిపోయిందా?

డెనిమ్‌లో మాల్వి మల్హోత్రా.. బ్లూ బ్యూటీని చూస్తే చూపు తిప్పుకోవడం కష్టమే!

ఇరుముడి బాక్సాఫీస్ రన్.. రూ.300 కోట్లు సాధ్యమేనా?

ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి కొడుకు కేసులో బిగ్ ట్విస్ట్…

ఇరుముడి సీక్వెల్ సినిమాలో రామ్ చరణ్.. ఫాన్స్ కు పూనకాలే!

Big Stories

Advertisement
×