Peddi:రాజమౌళి (Rajamouli) దర్శకత్వంలో వచ్చిన ‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో ఏకంగా గ్లోబల్ స్టార్ ఇమేజ్ ను సొంతం చేసుకున్నారు రామ్ చరణ్ (Ram Charan)ఈ సినిమా తరువాత ప్రముఖ డైరెక్టర్ శంకర్(Shankar )దర్శకత్వంలో ‘గేమ్ ఛేంజర్’ సినిమా చేశారు. అయితే ఈ సినిమా డిజాస్టర్ గా నిలిచింది. విడుదలైన రెండు రోజుల్లోనే థియేటర్ నుంచి సినిమాను తొలగించడం అప్పట్లో సంచలనంగా మారిన విషయం తెలిసిందే. అలాంటి ఈ సినిమా తర్వాత ఇప్పుడు ‘ఉప్పెన’ సినిమాతో సంచలనం సృష్టించిన ప్రముఖ డైరెక్టర్ బుచ్చిబాబు సనా (Bucchibabu Sana) దర్శకత్వంలో భారీ బడ్జెట్లో ‘పెద్ది’ సినిమా చేస్తున్నారు రామ్ చరణ్.
గ్రామీణ నేపథ్యంలో స్పోర్ట్స్ డ్రామాగా సాగే కథగా ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పాటలు, టీజర్ ద్వారా స్పష్టమయ్యింది. ఇక ఇందులో ప్రముఖ బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ (Janhvi Kapoor) హీరోయిన్గా నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాను రామ్ చరణ్ పుట్టిన రోజు సందర్భంగా మార్చి 27వ తేదీన విడుదల చేస్తున్నట్లు గత ఏడాది అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే. కానీ తెలంగాణ హైకోర్టు తీర్పుతో ఈ సినిమాను మార్చి 27వ తేదీ నుండి వాయిదా వేశారు. దీనికి కారణం టికెట్ ధరల పెంపు. ముఖ్యంగా జనవరి చివరి వారంలో తెలంగాణ హైకోర్టు..” ఏ సినిమాకైనా టికెట్ ధరలు పెంచుకోవాలి అంటే, ఆ సినిమా విడుదలకు కనీసం 90 రోజుల ముందే ప్రభుత్వం నుండి అనుమతి పొందాలి” అని తీర్పునిచ్చింది. ఇక మార్చి 27వ తేదీన సినిమా విడుదల అంటే.. టికెట్ ధరలను పెంచుకోవాలి అంటే తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును దిక్కరించినట్లే అవుతుంది.
అందుకే ఆ సినిమా విడుదల తేదీని వాయిదా వేస్తూ ఇప్పుడు ఏప్రిల్ 30వ తేదీని లాక్ చేశారు మేకర్స్. దీంతో మళ్లీ ఈ టికెట్ ధరల ప్రస్తావన తెరపైకి వచ్చింది. వాస్తవానికి తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఈ 90 రోజుల గడువు ప్రజల నుండి అభ్యంతరాలు స్వీకరించడానికి వీలుగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఇకపోతే తెలంగాణ హైకోర్టు జనవరి చివరి వారంలో 90 రోజుల గడువును ప్రకటించింది. అయితే ఇప్పుడు ఏప్రిల్ 30వ తేదీన ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు.. ఇక దీన్ని బట్టి చూస్తే 90 రోజుల గడువును ఈ చిత్రం ఫాలో అవుతోంది కాబట్టే ఏప్రిల్ 30ని ప్రకటించారు.. మొత్తానికైతే కోర్టు ధిక్కరణ లేకుండా ముందుగానే ప్రభుత్వం అనుమతి పొంది టికెట్ ధరలు పెంచుకోవడానికి ఈ సినిమాను ఏప్రిల్ 30 కి వాయిదా వేసినట్లు తెలుస్తోంది.
ALSO READ:Soundarya Rajinikanth: కూలీ సినిమాపై రజనీకాంత్ కూతురు కామెంట్.. ఏంటీ దారుణం?
ఇకపోతే ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ తో కలిసి వృద్ధి సినిమా బ్యానర్ పై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్నారు. 300 కోట్లకు పైగా బడ్జెట్ తో రాబోతున్న నేపథ్యంలోనే సినిమా టికెట్ ధరను పెంచుకోవడానికి తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలను పాటిస్తూ ఏప్రిల్ 30 కి సినిమాను వాయిదా వేశారు.. ఈ చిత్రానికి ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు.. స్పోర్ట్స్ డ్రామాగా వస్తున్న ఈ సినిమా ఏప్రిల్ 30న ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.