E-Paper
Advertisement

AK 64: అజిత్ కుమార్ Ak 64 అప్డేట్..షూటింగ్ ఎప్పుడో చెప్పేసిన డైరెక్టర్!

AK 64: అజిత్ కుమార్ Ak 64 అప్డేట్..షూటింగ్ ఎప్పుడో చెప్పేసిన డైరెక్టర్!
Advertisement

AK 64: కోలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్న వారిలో నటుడు అజిత్ కుమార్(Ajith Kumar) ఒకరు. ఈయన ఎన్నో అద్భుతమైన బ్లాక్ బస్టర్ సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి సక్సెస్ అందుకున్నారు. ఇక ఈయనకు కోలీవుడ్ ఇండస్ట్రీలో మాత్రమే కాకుండా టాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న సంగతి తెలిసిందే. ఇకపోతే అజిత్ చివరిగా గుడ్ బ్యాడ్ అగ్లీ అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా ఎంతో అద్భుతమైన విజయాన్ని అందుకున్న నేపథ్యంలో తదుపరి సినిమా గురించి కూడా ఎన్నో మంచి అంచనాలు ఉన్నాయి.

AK 64 ప్రీ ప్రొడక్షన్స్ పూర్తి..

అజిత్ కుమార్ తన తదుపరిచిత్రాన్ని డైరెక్టర్ అధిక్ రవిచంద్రన్ (Adhik Ravichandran)దర్శకత్వంలో చేయబోతున్నట్టు అధికారికంగా ప్రకటించారు. అయితే ఈ సినిమా షూటింగ్ ఎప్పుడు ఏంటి అనే వివరాలను మాత్రం వెల్లడించడం లేదు. దీంతో ఈ సినిమా నుంచి ఏదైనా అప్డేట్ వస్తే బాగుండని అభిమానులు కూడా ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు అయితే తాజాగా డైరెక్టర్ అధిక్ రవిచంద్రన్ ఈ సినిమా గురించి బిగ్ అప్డేట్ వెల్లడించడంతో అభిమానులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా డైరెక్టర్ అధిక్ మాట్లాడుతూ AK 64 ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు అన్ని పూర్తి అయ్యాయని తెలిపారు.

2026 ఫిబ్రవరిలో షూటింగ్..

Advertisement

ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తి కావడంతో షూటింగ్ లొకేషన్లో కోసం వేట మొదలైందని, ప్రస్తుతం లొకేషన్ లను సెర్చ్ చేస్తున్నామని తెలియజేశారు. ఇక ఈ సినిమా 2026 ఫిబ్రవరిలో సెట్స్ పైకి వెళ్ళబోతుందని అధిక్ రవిచంద్రన్ వెల్లడించారు. ఈ సినిమా తన కెరీయర్ కు చాలా కీలకమని ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకురాబోతున్నట్లు తెలిపారు. ఇలా అజిత్ సినిమా ఫిబ్రవరి నుంచి రెగ్యులర్ షూటింగ్ పనులు జరుపుకోనుందనే విషయం వెల్లడించడంతో అభిమానులు కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

అజిత్ కు అరుదైన అవార్డు..

Advertisement

ఇక అజిత్ కుమార్ ఒకవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు తనకెంతో ఇష్టమైన రేసింగ్ పోటీలలో పాల్గొంటున్న సంగతి తెలిసిందే. ఇప్పటికీ ఈయన వివిధ దేశాలలో రేసింగ్ పోటీలలో పాల్గొంటూ ఎన్నో పథకాలను సాధించారు. ఈ విధంగా అజిత్ రేసింగ్ పట్ల చూపించిన శ్రద్ధ అలాగే రేసింగ్ లో ఈయన సాధించిన పేరు ప్రఖ్యాతలను దృష్టిలో పెట్టుకొని ఇటీవల ఈయనకు జెంటిల్మెన్ డ్రైవర్ ఆఫ్ ది ఇయర్ 2025(Gentlman driver of the year 2025) అవార్డు కూడా వచ్చిన సంగతి తెలిసిందే. ఇలా ఈ ప్రతిసాత్మక అవార్డును అందుకోవడంతో అభిమానులు కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇలా రేసింగ్ పోటీలలో కూడా అజిత్ పాల్గొంటున్న నేపథ్యంలో సినిమాలు కూడా కాస్త ఆలస్యం అవుతున్నాయని చెప్పాలి.

Also Read: Rahul sipligunj -Harinya: రాహుల్ సిప్లిగంజ్ హరిణ్య సంగీత్.. కాబోయే భార్యకు బిగ్ సర్ప్రైజ్ ఇచ్చిన సింగర్!

Related News

‘ఇరుముడి’ రూ.200 కోట్ల దెబ్బ! ఇప్పుడు శివ నిర్వాణ వెనక పడుతున్న స్టార్ హీరోలు!

మళ్లీ వార్తల్లోకి పూనం పాండే.. ఈసారి వ్యభిచారంపై మైండ్ బ్లాకింగ్ కామెంట్స్!

ముంబైని షేక్ చేస్తున్న అనన్య పాండే గ్లామర్ షో.. ఆ పిక్స్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

తెలుగు హీరోలంటే క్రిమినల్స్, స్మగ్లర్స్.. టాలీవుడ్ సినిమాలపై కస్తూరి షాకింగ్ కామెంట్స్!

కళ్ళు చెదిరే అందం.. వరుస ఆఫర్స్.. మరి సక్సెస్ రేట్ ఎక్కడ చిట్టి?

అదంతా ఫేక్ ఎవరు మోసపోవద్దు.. స్కామ్ పై కల్కి 2 టీమ్ క్లారిటీ!

సరికొత్త రికార్డు సృష్టించి’ఏష నాగుల’…తొలి తెలుగు పాటగా !

విడాకులు తీసుకున్న దునియా విజయ్.. భరణం తెలిస్తే షాక్!

Big Stories

Advertisement
×