E-Paper
Advertisement

Rahul sipligunj -Harinya: రాహుల్ సిప్లిగంజ్ హరిణ్య సంగీత్.. కాబోయే భార్యకు బిగ్ సర్ప్రైజ్ ఇచ్చిన సింగర్!

Rahul sipligunj -Harinya: రాహుల్ సిప్లిగంజ్ హరిణ్య సంగీత్.. కాబోయే భార్యకు బిగ్ సర్ప్రైజ్ ఇచ్చిన సింగర్!
Advertisement

Rahul Sipligunj -Harinya Pre wedding: సినీ ఇండస్ట్రీలో ప్లే బ్యాక్ సింగర్ గా ఎంతో మంచి సక్సెస్ అందుకున్న రాహుల్ సిప్లిగంజ్(Rahul Sipligunj) త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్న సంగతి తెలిసిందే. ఈ నెల 27వ తేదీ ఈయన వివాహపు వేడుక ఎంతో అంగరంగ వైభవంగా జరగబోతోంది. ఈ వివాహ వేడుకకు సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన సెలబ్రిటీలతో పాటు రాజకీయ నాయకులూ కూడా హాజరు కాబోతున్నారు స్వయంగా రాహుల్ హరిణ్య (Harinya)తెలంగాణ ముఖ్యమంత్రిని కలిసి తమ పెళ్ళికి రావాలి అంటూ ఆహ్వానించిన సంగతే తెలిసిందే.

రాహుల్ హరిణ్య సంగీత్…

ఇలా మరికొద్ది రోజులలో వీరి పెళ్లి జరగబోతున్న నేపథ్యంలో ఇప్పటికే ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ మొదలయ్యాయి. తాజాగా సంగీత్(Sangeeth) వేడుకను ఎంతో ఘనంగా నిర్వహించారని తెలుస్తోంది. ఇక ఈ కార్యక్రమంలో భాగంగా కాబోయే వధువు వరులు స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు. అంతేకాకుండా ఈ కార్యక్రమానికి పలువురు సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన సెలెబ్రిటీలు కూడా హాజరై సందడి చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన కొన్ని ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోలు చూసిన అభిమానులు ముందుగానే ఈ దంపతులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

సంగీత్ వేడుకలో యూసీ చాహల్ ..

Advertisement

ఇదిలా ఉండగా ఈ సంగీత్ వేడుకలో భాగంగా రాహుల్ తనకు కాబోయే భార్య హరిణ్యకు ఊహించని సర్ప్రైజ్ ఇచ్చారు. హరిణ్య కు క్రికెటర్ యూసీ చాహల్ (U.C.Chahal)అంటే విపరీతమైన అభిమానమట. ఈ క్రమంలోనే రాహుల్ తన సంగీత్ వేడుకకు చాహల్ ను ఆహ్వానించడంతో హరిణ్య ఆనందానికి అవధులు లేకుండా పోయాయని చెప్పాలి. ప్రస్తుతం చాహల్ తో కలిసి దిగిన ఫోటోలను హరిణ్య రెడ్డి సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ తన సంతోషాన్ని వ్యక్తపరిచారు. తనకు ఇలాంటి సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చినందుకు రాహుల్ కు హిరణ్య ప్రత్యేకంగా థాంక్స్ చెబుతూ ఈ ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేయడంతో ఇవి కాస్త వైరల్ అవుతున్నాయి.

Advertisement

ఇకపోతే రాహుల్ ఎప్పటికప్పుడు తన కాబోయే భార్యకు ఇలాంటి సర్ప్రైజ్ ఇస్తూ సంతోషపడుతున్నారు . నిశ్చితార్థ సమయంలో కూడా ఈయన హరిణ్య కోసం ఖరీదైన హ్యాండ్ బ్యాగ్ గిఫ్ట్ గా ఇచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా క్రికెటర్ ను ఇన్వైట్ చేసి ఆమెను మరింత సంతోష పరిచారు. ఇక రాహుల్ హరిణ్య ఇద్దరూ ప్రేమ వివాహం చేసుకుంటున్న విషయం తెలిసిందే. వీరిద్దరూ గత కొంతకాలంగా ప్రేమలో ఉంటూ పెద్దల సమక్షంలో ఎంతో ఘనంగా వివాహం చేసుకోబోతున్నారు. ఇక హరిణ్య రాజకీయ కుటుంబానికి సంబంధించిన అమ్మాయని తెలుస్తుంది. ఇక వీరి పెళ్లికి రెండు రోజుల సమయం మాత్రమే ఉన్న నేపథ్యంలో సంగీత్, హల్దీ వంటి వేడుకలను ఎంతో ఘనంగా నిర్వహించబోతున్నారు.

Also Read: IBomma Ravi: వామ్మో ఇదేం క్రేజ్ సామీ.. ఐ బొమ్మ రవికి మద్దతుగా పొట్టపై టాటూ..

Related News

Nagarjuna:ఇండస్ట్రీకి నాగార్జున స్ట్రాంగ్ హెచ్చరిక!

Lenin: వాటి కోసమే అఖిల్ ఇన్నేళ్లు ఎదురు చూసాడు.. నాగార్జున ఎమోషనల్!

మెగా ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. ఒక్కొక్కరికి రూ.5లక్షలు ప్రకటన!

నేరుగా ఓటీటీలోకి రాబోతున్న మృణాల్ సస్పెన్స్ థ్రిల్లర్!

చిన్న సినిమా.. విపరీతమైన క్రేజ్.. 72వ జాతీయ అవార్డుల్లో ‘కమిటీ కుర్రోళ్లు’ రచ్చ!

కుంభమేళా వైరల్ గర్ల్ మోనాలిసా లైఫ్‌లో బిగ్ ట్విస్ట్.. తండ్రిపై సంచలన ఆరోపణలు

స్పిరిట్ కథ లీక్: ఆ ఒక్క ట్విస్ట్‌తో థియేటర్లు షేక్ అవ్వడం ఖాయం!

మరో సినిమాతో ‘రాజు వెడ్స్ రాంబాయి’ దర్శకుడు.. హీరో ఎవరో తెలుసా ?

Big Stories

Advertisement
×