Flipkart Black Friday Sale: ప్రముఖ ఇ-కామర్స్ ప్లాట్‌ఫామ్ ఫ్లిప్‌కార్ట్ బ్లాక్ ఫ్రైడే సేల్ సందర్భంగా అనేక స్మార్ట్‌ఫోన్స్‌పై కనీవినీ ఎరుగని విధంగా డిస్కౌంట్స్ అందిస్తోంది. ప్రముఖ టెక్ బ్రాండ్‌ల నుంచి వివో, శామ్‌సంగ్, రియల్‌మీ, పోకో, మోటోరోలా వంటి స్మార్ట్‌ఫోన్‌లు అతి తక్కువ ధరలకే అందుబాటులో ఉన్నాయి. మీరు మంచి ఆఫర్ కోసం ఎదురు చూస్తున్నట్లయితే.. ఇదే సరైన సమయం అనుకోండి. ఈ నేపథ్యంలో ఫ్లిప్‌కార్ట్ బ్లాక్ ఫ్రైడే సేల్‌లో అందుబాటులో ఉన్న ఐదు ఖతర్నాక్ స్మార్ట్‌ఫోన్స్‌పై ఉన్న డీల్స్ గురించి తెలుసుకుందాం.
ఫ్లిప్‌కార్ట్ బ్లాక్ ఫ్రైడే డీల్‌లో తక్కువ ధరలో మొదటగా.. శామ్‌సంగ్ గెలాక్సీ S24 5G ఫోన్ అందుబాటులో ఉంది. ఈ హ్యాండ్ సెట్ అసలు ధర రూ.74,999. కానీ, ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో ఈ ఫోన్ రూ.40,999 ధరకే లభిస్తోంది. అదనంగా ఈ ఫోన్‌పై బెస్ట్ ఎక్స్ఛేంజ్ ఆఫర్ కూడా ఉంది. ఈ వెసులుబాటు ఫోన్ ధరను మరింత తగ్గిస్తుంది.
ఈ వివో T4 అల్ట్రా 5G అసలు ధర రూ.40,999. అయితే, ఫ్లిప్‌కార్ట్ బ్లాక్ ఫ్రైడే సేల్ సమయంలో ఈ హాండ్ సెట్‌ను రూ.35,999 ధరకే కొనుగోలు చేయొచ్చు. అంటే.. దీనిపై ఏకంగా రూ.5వేల డిస్కౌంట్ లభిస్తోంది. అంతేకాదు.. కొన్ని బ్యాంక్ క్రెడిట్, డెబిట్ కార్డులతో అదనంగా రూ.1,000 ఇన్‌స్టంట్ తగ్గింపు కూడా పొందే అవకాశం ఉంది.
Read Also: బ్లాక్‌బస్టర్ డీల్.. శాంసంగ్ 5G ఫోన్ ఆఫర్ ధర తెలిస్తే BUY NOW నొక్కేస్తారు!
మోటరోలా G86 పవర్ 5G ఫోన్ అన్నిటి కంటే చాలా తక్కువ ధరకే అందుబాటులో ఉంది. ప్రారంభంలో సంస్థ ఈ ఫోన్‌ను రూ.19,999 ధరకు లాంచ్ చేసింది. అయితే, ఇప్పుడీ ఫోన్ రూ.17,999 ధరకే అందుబాటులో ఉంది. అంతేకాదు.. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఈఎమ్‌ఐ ఎంపికలతో అదనంగా రూ.1,500 తగ్గింపు కూడా పొందవచ్చు. అలాగే ఈఎమ్‌ఐలు కాని వాటిపై కొన్ని బ్యాంక్ క్రెడిట్ కార్డులతో రూ.1,000 తగ్గింపు కూడా అందుబాటులో ఉంది.
7000 mAh బిగ్ బ్యాటరీ కలిగి ఉన్న రియల్‌మీ P4 5G స్మార్ట్‌ఫోన్.. ఫ్లిప్‌కార్ట్ బ్లాక్ ఫ్రైడే సేల్‌లో చాలా తక్కువ ధరకు లభిస్తుంది. ఈ సేల్‌లో ఈ హాండ్ సెట్‌ను కేవలం రూ.16,999 ధరకే కొనుగోలు చేయవచ్చు. అంతేకాదు.. ఎంపిక చేసిన బ్యాంక్ క్రెడిట్, డెబిట్ కార్డులపై ఫ్లాట్ రూ.1,000 తగ్గింపు కూడా అందుబాటులో ఉంది.
రూ.10వేల లోపు 5G స్మార్ట్‌ఫోన్ కోసం చూస్తున్నట్లయితే.. ఫ్లిప్‌కార్ట్ బ్లాక్ ఫ్రైడే సేల్‌లో పోకో M7 5Gని కొనేయొచ్చు. ఈ ఫోన్ లాంచ్ అయిన ప్రారంభంలో దీని అసలు ధర రూ.12,999. అయితే, ఈ ఫోన్ పై రూ.4,000 ఫ్లాట్ తగ్గింపు తర్వాత దీనిని రూ.8,999 ధరకే కొనేసుకోవచ్చు. ఈ పరికరంపై ఎక్స్ఛేంజ్ ఆఫర్ కూడా అందుబాటులో ఉంది.
Read Also: ఐఫోన్ ఎయిర్‌పై దిమ్మతిరిగే డిస్కౌంట్.. బ్లాక్ ఫ్రైడే సేల్‌లో ఏకంగా రూ.65వేలు తగ్గింపు!