E-Paper
Advertisement

Dacoit release date: అడివి శేష్ డాకాయిట్ విడుదల తేదీ వాయిదా.‌. మొత్తం ఆ స్టార్ హీరో వల్లే..!

Dacoit release date: అడివి శేష్ డాకాయిట్ విడుదల తేదీ వాయిదా.‌. మొత్తం ఆ స్టార్ హీరో వల్లే..!
Advertisement

Dacoit release date: టాలీవుడ్‌లో ఒక సినిమా విడుదల తేదీ మార్పు ప్రస్తుతం పెద్ద చర్చకు దారి తీసింది. హీరోగా నటిస్తున్న అడివి శేష్ తాజా సినిమా డాకాయిట్. ఈ సినిమాను మొదటగా 2026 మార్చి 19న విడుదల చేయాలని చిత్ర బృందం నిర్ణయించింది. కానీ తాజా ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం, ఇప్పుడు ఈ సినిమాను ఏప్రిల్ 10న విడుదల చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. దీనిపై ఇంకా అధికారిక ప్రకటన మాత్రం రావాల్సి ఉంది.

ఈ తేదీ మార్పుకు ప్రధాన కారణం అదే రోజున విడుదలకు సిద్ధంగా ఉన్న భారీ సినిమా ధురంధర్ 2: ది రివెంజ్. ఈ సినిమా ఐదు భాషల్లో విడుదల కానుంది. భారీ బడ్జెట్, పెద్ద స్థాయి ప్రమోషన్స్, పాన్ ఇండియా మార్కెట్‌లో ఉన్న క్రేజ్ వల్ల ఈ సినిమాకు దేశవ్యాప్తంగా ఎక్కువ థియేటర్లు దక్కే అవకాశం ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ‘డాకాయిట్’ లాంటి మీడియం రేంజ్ సినిమాకు థియేటర్లు, షోలు దొరకడం చాలా కష్టమని ట్రేడ్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. తెలుగులోనే కాకుండా ఇతర భాషల్లోనూ పోటీ ఎక్కువగా ఉండేది.

Advertisement

ఇంతకుముందు ఈ క్లాష్‌పై స్పందించిన అడివి శేష్, తన సినిమాకు ఎలాంటి ఇబ్బంది ఉండదని అన్నారు. 2022లో తన సినిమా ‘మేజర్’ కూడా పెద్ద సినిమాలతో పాటు విడుదలైందని గుర్తు చేశారు. ఆ సమయంలో కమల్ హాసన్ నటించిన విక్రమ్, అలాగే అక్షయ్ కుమార్ నటించిన సమ్రాట్ పృథ్వీరాజ్ కూడా థియేటర్లలోకి వచ్చాయి. అప్పట్లో “సముద్రంలో పెద్ద చేపలు ఉన్నా, మేము గోల్డ్ ఫిష్” అంటూ శేష్ చేసిన వ్యాఖ్య ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద ట్రోలింగ్‌కు కారణమైంది.

ఈసారి పరిస్థితి పూర్తిగా వేరు అని నెటిజన్లు అంటున్నారు. అప్పట్లో ఉన్న సినిమాలు ఒకలా ఉంటే, ఇప్పుడు ‘ధురంధర్’ లాంటి బ్లాక్‌బస్టర్‌కు సీక్వెల్‌తో పోటీ పడటం మరోలా ఉంటుందని వ్యాఖ్యానించారు. కొందరు గోల్డ్ ఫిష్ ముందు ఇప్పుడు షార్క్ ఉందంటూ సెటైర్లు కూడా వేశారు.

Advertisement

ఈ విమర్శలన్నింటి మధ్య ‘డాకాయిట్’ టీమ్ మౌనంగా విడుదల తేదీ మార్చినట్టు తెలుస్తోంది. భారీ హైప్, స్క్రీన్ కౌంట్, బజ్ ఉన్న సినిమాతో నేరుగా పోటీ పడటం కంటే, సేఫ్ డేట్ చూసుకోవడం మంచిదని సినీ వర్గాలు భావిస్తున్నాయి. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నారని, ఏప్రిల్‌లో విడుదలైతే ‘డాకాయిట్’కి మంచి అవకాశాలు ఉంటాయని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.

ALSO READ: Kalki 2: కల్కి 2 లో సుమతిగా సాయి పల్లవి.. రూమర్లపై స్పందించిన మూవీ టీమ్!

Related News

నవరాత్రుల వేళ హెబ్బా పటేల్ స్పెషల్ ట్రీట్..ఫ్యాన్స్‌కు కనువిందే!

జ్యోతి పూర్వజ్, పూర్వాజ్ మూవీ ‘కిల్లర్’.. ఒకేసారి రెండు అప్డేట్స్!

‘స్పిరిట్’ వాయిదా.. ఫ్యాన్స్‌కు కొత్త రిలీజ్ డేట్ ప్రకటించిన సందీప్ రెడ్డి వంగా!

గరివిడి లక్ష్మి సినిమాపై రవితేజ రివ్యూ.. ఏమన్నారంటే?

ఏడేళ్ల వయసులోనే సాఫ్ట్వేర్ సంస్థకు యజమాని.. ‘జైలర్’ బుడ్డోడు చిన్నోడు కాదండోయ్!

‘గరివిడి లక్ష్మి’లో ఆర్పీ పట్నాయక్ పాత్ర వెనుక అసలు కథ ఇదేనా?

క్యాస్టింగ్ కౌచ్‌పై ఝాన్సీ ఏమన్నారంటే.. ఇండస్ట్రీలో మహిళల పరిస్థితి ఇదేనా?

యూత్‌ను టార్గెట్ చేస్తూ వస్తున్న ‘హైకూ’.. అక్టోబర్ 23న థియేటర్లలోకి!

Big Stories

Advertisement
×